చూడరమ్మ సతులారా సోబాన పాడరమ్మ |
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి ||
శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు |
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు |
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు |
కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి ||
కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు |
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు |
జలజనివాసినియట చల్లదనమేమరుదు |
కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి ||
అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు |
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు |
తమితో శ్రీవేంకటేశు దానె వచ్చి పెండ్లాడె |
కౌమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి ||
సోబాన, చూడి కుడుత, తమితో ante meanings emito vivarincha galaru. thanks.
రిప్లయితొలగించండిసోబాన: మంగళప్రదముగా, చూడికుడుత నాంచారి: గోదాదేవి, తమితో: కోరికతో
తొలగించండిdhanya vadamulu
రిప్లయితొలగించండిమరుదు అంటే?
రిప్లయితొలగించండి