11, ఏప్రిల్ 2013, గురువారం

ఏమని పొగదుడుమే యికనిను అన్నమాచార్యకీర్తన

 
నేను హాఫ్ సెంచురీ చేశాను బాబోయ్.


రాగం:ఆభేరి
తాళం :ఆదితాళం

 
ఏమని పొగదుడుమే యికనిను |
ఆమని సొబగుల అలమేల్మంగ ||

 
తెలికన్నుల నీ తేటలే కదవే |
వెలయగ విభునికి వెన్నెలలు |
పులకల మొలకల పొదులివి గదవే |
పలుమరు పువ్వుల పానుపులు ||

 
తియ్యపు నీమోవి తేనెలే కదవే |
వియ్యపు రమణుని విందులివి |
ముయ్యక మూసిన మొలక నవ్వు గదె |
నెయ్యపు గప్పురపు నెరి బాగాలు ||

 
కైవసమగు నీ కౌగిలే కదవే |
శ్రీ వేంకటేశ్వరు సిరి నగరు |
తావు కొన్న మీ తమకములే కదే |
కావించిన మీ కల్యాణములు ||

1 కామెంట్‌: