8, ఏప్రిల్ 2013, సోమవారం

రామ దశరథరామ అన్నమాచార్య కీర్తన



 ఆహా వింటుంటే ఎంతటి హాయి . మీరు కూడా విన్నాకా  తప్పకుండా ఆహా అనకుండా వుండలేరు .


 



రామ దశరథరామ నిజ సత్య-
కామ నమో నమో కాకుత్థ్సరామ ||



కరుణానిధి రామ కౌసల్యానందన రామ
పరమ పురుష సీతాపతిరామ |
శరధి బంధన రామ సవన రక్షక రామ
గురుతర రవివంశ కోదండ రామ ||



దనుజహరణ రామ దశరథసుత రామ
వినుతామర స్తోత్ర విజయరామ |
మనుజావతారా రామ మహనీయ గుణరామ
అనిలజప్రియ రామ అయోధ్యరామ ||



సులలితయశ రామ సుగ్రీవ వరద రామ
కలుష రావణ భయంకర రామ |
విలసిత రఘురామ వేదగోచర రామ
కలిత ప్రతాప శ్రీవేంకటగిరి రామ ||

2 కామెంట్‌లు: