30, జనవరి 2013, బుధవారం

నిత్య పూజలివిగో నెరిచిన నోహో

రచన: అన్నమాచార్య


నిత్య పూజలివిగో నెరిచిన నోహో |
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో ||


తనువే గుడియట తలయె శిఖరమట
పెను హృదయమే హరి పీఠమట |
కనుగొన చూపులే ఘన దీపములట
తన లోపలి అంతర్యామికిని ||


పలుకే మంత్రమట పాదయిన నాలుకే
కలకల మను పిడి ఘంటయట |
నలువైన రుచులే నైవేద్యములట
 

తలపులోపలనున్న దైవమునకు ||
గమన చేష్టలే అంగరంగ గతియట
తమి గల జీవుడే దాసుడట |
అమరిన ఊర్పులే ఆలబట్టములట
క్రమముతో శ్రీ వెంకటరాయునికి ||

తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ

 
రచన: అన్నమాచార్య


తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ |
సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ ||


సిరులసింగారరాయ చెలువపుతిమ్మరాయ |
సరసవైభవరాయ సకలవినోదరాయ |
వరవసంతములరాయ వనితలవిటరాయ |
గురుతైన తేగరాయ కొండలకోనేటిరాయ ||


గొల్లెతలవుద్దండరాయ గోపాలకృష్ణరాయ |
చల్లువెదజాణరాయ చల్లబరిమళరాయ |
చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ |
కొల్లలైన భోగరాయ కొండలకోనేటిరాయ ||


సామసంగీతరాయ సర్వమోహనరాయ |
ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ |
కామించి నిన్ను గోరితే గరుణించితివి నన్ను |
శ్రీమంతుడ నీకు జయ శ్రీవేంకటరాయ ||

22, జనవరి 2013, మంగళవారం

చాణిక్య నీతి

చాణిక్య నీతి 

ఇవి  చదివినప్పుడు ఆ రోజులలో పాలనలో ఎన్ని జాగ్రత్తలు పాటించే వారో అనిపిస్తున్నాయి. పాలనలో కొన్ని ఖటినమైన, ఖచితమైన నిర్ణయాలు తీసుకోవడం ఎంత అవసరమో కదా .  ఎంతటి సన్నిహితులనైన మొహమాట పడకుండా కొన్నింటికి దూరంగా వుంచడం , కొందరు వ్యక్తుల వల్ల సమాజానికి దేశానికి నష్టం వాటిల్లుతుంది అనుకుంటే వారిని వెంటనే దూరం చేయడం లాంటి నిర్ణయాలను నాయకుడు తప్పకుండా పాటించాలి . ఓట్లకోసం నేరస్తులను రక్షించే పరిస్థితులు ఆ నాటి నాయకులకు లేకపోబట్టే కాబోలు ఈనాటికీ వారు చిరస్తాయిగా మన అందరి మనసులలో  జీవించే వున్నారు .


1. రహస్యం ఆయుధం లాంటిది. మన గుప్పెట్లో వున్నంతకాలం సురక్షితంగా వుంటాం.ఇతరుల చేతిలో పడిందా సంక్షోభమే ..

2. మన బలాన్ని మనం రహస్యంగా వుంచుకోవాలి . బలహీనతల్ని మరీరహస్యంగా వుంచుకోవాలి. ఈ విషయంలో తాబేలే మనకు ఆదర్శం . పై పొర చాటున తన పదాల్ని ఎంత జాగ్రతగా దాచుకుంటుంది.

3. చేయి విషతుల్యమైతే చేతిని తీసెయ్యాలి. కాలు విషతుల్యమైతే కాలునూ తెసేయాలి . ఆలస్యం చేస్తే ...  విషం నిలువెల్లా వ్యాపిస్తుంది. అవినీతి పరులూ నమ్మక ద్రోహులూ కాలకూట విషం కంటే ప్రమాదం. 

4. రాజధాని గుండె కాయ వంటిది. శత్రు గూఢచారుల ప్రాబల్యం అక్కడా విస్తరించిందంటే ... అది నాయకుడి వైఫల్యం, మొత్తం పాలనా వ్యవస్థ వైఫల్యం.

5. చిల్లుల పాత్రలో నీరు నిలువ ఎంత అసాధ్యమో ...  చంచల స్వభావుల నోట్లో రహస్యాలు దాగడమూఅంతే అసాధ్యం . అలాంటి వ్యక్తులకు కీలక సమాచారం తెలియనివ్వకూడదు .


21, జనవరి 2013, సోమవారం

అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ |

రచన: అన్నమాచార్య
కొంచెం  అరుదుగా వినే పాట చాలా బాగుంది. చూస్తూ వినండి ఇంకా బాగుంది.


 
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ |
తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ||


నీరిలోన తల్లడించే నీకే తలవంచీ
నీరికింద పులకించీ నీరమణుండు |
గోరికొన చెమరించీ కోపమే పచరించీ
సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ ||


నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ
మేకొని నీవిరహాన మేను వెంచీని |
ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా ||


చక్కదనములె పెంచీ సకలము గాలదంచి
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని |
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ
అక్కున నాతని నిట్టే అలరించవమ్మ ||

సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను |

రచన: అన్నమాచార్య

సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను |
సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా ||


వూరకున్నజీవునికి వొక్కొక్క స్వతంత్రమిచ్చి |
కోరేటియపరాధాలు కొన్ని వేసి |
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ |
దూరువేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా ||


మనసు చూడవలసి మాయలు నీవే కప్పి |
జనులకు విషయాలు చవులుచూపి |
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి |
ఘనము సేసేవిందు కర్తలెవ్వరయ్యా ||


వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే |
కన్నకన్న భ్రమతలే కల్పించి |
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె |
నిన్ను నన్ను నెంచుకుంటే నీకే తెలియునయ్యా ||

17, జనవరి 2013, గురువారం

కొన్ని ముత్యాలు



 కొన్ని ముత్యాలు మనందరి కోసం


1. నిజమైన పని ఇతరులకు సేవ చేయడమే .


2. వంద కళలలో ప్రవేశించడం కన్నా ఒక్క కళలో పరిపక్వత సాధించడం  మంచిది .


3. ఇతరుల కష్టాలలో పాలుపంచుకునే వారికి నిజమైన మిత్రులు లభిస్తారు .


4. పని చేసే ప్రతీసారి సత్ఫలితాలు రావు. కానీ పని చేయకపోతే ఏ ఫలితం ఉండదు .


5. నీవు సంతోషంగా ఉండు. నీ సంతోషాన్ని నలుగురితో పంచుకో. ఇదే అసలు సిసలైన సంతోష రహస్యం.


6. ఎంత ఉపయోగించినా తరగనిది , అరగనిది విజ్ఞానం.


7. కాలాన్ని సరిగ్గా నిర్వహించుకున్న వ్యక్తి, మనసును సవ్యంగా నిర్దేసించుకుంటాడు.


8. మనం నమ్మి పోరాడే క్రమలో ఓటమిని చూసి ధైర్యాన్ని వదులుకోకూడదు .


9. ఒక సజ్జనునికి చిరునవ్వు, దానగుణం, న్యాయబుద్ధి , మంచి మాటలు ముఖ్యం .


10. ఆత్మాభిమానం, పవిత్రహృదయం ఉన్న మనిషి, ధనంలేని పేదవాడైనా ప్రపంచంలో శ్రేష్టుడు.

16, జనవరి 2013, బుధవారం

చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు అన్నమాచార్య కీర్తన

రచన: అన్నమాచార్య కీర్తన
రాగము : హంసధ్వని


చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు |
చాలదా హితవైన చవులెల్లను నొసగ ||


ఇది యొకటి హరి నామ మింతైన జాలదా |
చెదరకీ జన్మముల చెరలు విడిపించ |
మదినొకటె హరినామ మంత్రమది చాలదా |
పదివేల నరక కూపముల వెడలించ ||


కలదొకటి హరినామ కనకాద్రి చాలదా |
తొలగుమని దారిద్ర్యదోషంబు చెరుచ |
తెలివొకటి హరినామదీప మది చాలదా |
కలుషంపు కఠిన చీకటి పారద్రోల ||


తగువేంకటేశు కీర్తనమొకటి చాలదా |
జగములో కల్పభూజంబు వలె నుండ |
సొగసి యీవిభుని దాసుల కరుణ చాలదా |
నగవు జూపులను నున్నతమెపుడు జూప ||

జగడపు చనువుల జాజర అన్నమాచార్య

 
రచన: అన్నమాచార్య



జగడపు చనువుల జాజర
సగినల మంచపు జాజర ||


మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున |
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై
చల్లే రతివలు జాజర ||


భారపు కుచముల పైపై కడు సిం-
గారము నెరపేటి గంధవొడి |
చేరువ పతిపై చిందగ పడతులు
సారెకు చల్లేరు జాజర ||


బింకపు కూటమి పెనగే చెమటల
పంకపు పూతల పరిమళము |
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమ దంబుల జాజర ||

9, జనవరి 2013, బుధవారం

అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల |

ఈ పాట మనకు  కొంచెమే పరిచయం కదండీ ఇదిగో మొత్తం పాట వినండి.
 రచన: అన్నమాచార్య



అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల |
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ||


ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల ||


పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల |
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ||


మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల ||


పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల |
వోలి బ్రహ్మాండములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల


కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల |
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల ||


కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల |
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల ||

8, జనవరి 2013, మంగళవారం

భావయామి గోపాలబాలం మన- స్సేవితం అన్నమాచార్య కీర్తన

రచన: అన్నమాచార్య



భావయామి గోపాలబాలం మన-
స్సేవితం తత్పదం చింతయేహం సదా ||


ఘటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటికా-
పటల నినదేన విభ్రాజమానమ్ |
కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం
చటుల నటనా సముజ్జ్వల విలాసమ్ ||


నిరతకర కలిత నవనీతం బ్రహ్మాది
సుర నికర భావనా శోభిత పదమ్ |
తిరువేంకటాచల స్థితమ్ అనుపమం హరిం
పరమ పురుషం గోపాలబాలమ్ ||

6, జనవరి 2013, ఆదివారం

ఎక్కువ కులజుడైన హీన కులజుడైన

 
రచన: అన్నమాచార్య

ఎక్కువ కులజుడైన హీన కులజుడైన
నిక్కమెరిగిన మహా నిత్యుడే ఘనుడు ||

వేదములు చదివియును విముఖుడై హరిభక్తి
యాదరించని సోమయాజి కంటె |
ఏదియును లేని కుల హీనుడైనను విష్ణు
పాదములు సేవించు భక్తుడే ఘనుడు ||

పరమ మగు వేదాంత పఠన దొరికియు సదా
హరి భక్తి లేని సన్యాసి కంటె |
సరవి మాలిన అంత్య జాతి కులజుడైన
నరసి విష్ణుని వెదకు నాతడే ఘనుడు ||

వినియు చదివియు, శ్రీ విభుని దాసుడు గాక
తనువు వేపుచు నుండు తపసి కంటె |
ఎనలేని తిరు వేంకటేశు ప్రసాదాన్న
మనుభవించిన యాతడప్పుడే ఘనుడు ||

1, జనవరి 2013, మంగళవారం

తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ

రచన: అన్నమాచార్య




తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ |
సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ ||


సిరులసింగారరాయ చెలువపుతిమ్మరాయ |
సరసవైభవరాయ సకలవినోదరాయ |
వరవసంతములరాయ వనితలవిటరాయ |
గురుతైన తేగరాయ కొండలకోనేటిరాయ ||


గొల్లెతలవుద్దండరాయ గోపాలకృష్ణరాయ |
చల్లువెదజాణరాయ చల్లబరిమళరాయ |
చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ |
కొల్లలైన భోగరాయ కొండలకోనేటిరాయ ||


సామసంగీతరాయ సర్వమోహనరాయ |
ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ |
కామించి నిన్ను గోరితే గరుణించితివి నన్ను |
శ్రీమంతుడ నీకు జయ శ్రీవేంకటరాయ ||