31, జనవరి 2017, మంగళవారం

Whatsapp(పెను భూతం)

Whatsapp(పెను భూతం)

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ||

అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు.. 

ఇది నా 100వ పోస్ట్ అంది ఇలాంటి టాపిక్ రాయాల్సి రావడం లక్కీనో కాదో తెలియదు మరి . ఓ బాలకృష్ణ 100 వ సినిమా లాగా శాతకర్ణి నో, చిరంజీవి 15౦వసినిమాలగానో తెలియదు కాని  ఇది నా 100వ పోస్ట్. 

హాయిగా కాలక్షేపానికి అమ్మలు , అత్తలు పెరటిగుమ్మంలో పనులు చేసుకుంటూ బియ్యం ఏరుకుంటూనో,  పప్పులు చేరుగుకుంటూనో ,  కందిపొడి విసురుకుంటూనో ఇంచక్కా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు.

తరువాత TV లు వచ్చి కొంచెం ప్రశాంత  కాలక్షేపాన్ని   పాడుచేస్తూ  వారానికి  ఒక సినిమా, వారంలో  ఒక చిత్రలహరి , మధ్య మధ్య లో చిన్న  చిన్న నాటికలు . ఆ  time లో  కొంచెంలో కొంచెం  నాలుగు  ఇళ్ళకు  ఒక TV అవ్వడం  వల్ల కాస్తా  కలసి  మాట్లాడుకుంటూనే  ఆ  programs  చూసేవాళ్ళు.

ఇంకొన్నాళ్ళకు  ఆ  ఒక్క  channel చాలదని  ఆ  నలుగురు  ఒకచోటే  కూర్చుండిపోయి  మాట్లాడేసుకుంటూ న్నారని కంగారుపడి  TV వాళ్ళు  చానల్స్  పెంచేశారు.  అంతేఅక్కడితో  మొదలయ్యి  ఉంటాయి  ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క choice  అనే  ఆలోచన  అంతే దెబ్బకి TV దెయ్యం  ప్రతి ఇంట్లో వెలిసింది.  అక్కడితో అమ్మలక్కల  కబుర్ల  ఫుల్ స్టాప్  కి పునాది పడిందనే  చెప్పాలి .

తరువాత తరువాత ఎన్నెన్ని చానల్స్ , ఎన్నెన్ని సీరియల్స్ , అందులో ఎంతెంత మంది ఆడ విలన్స్  చెప్పనలవి కావు. ఇవి సరిపోలేదుట. ఇంట్లో నలుగురు మాట్లాడేసుకుంటూ ఏదో ఒక ప్రోగ్రాం చూసేస్తున్నారుట.  అది అర్ధమైన వెంటనే టెక్నాలజీ కంప్యూటర్ ని దానికి జతగా  ఇంటర్నెట్ ని  తీసుకు వచ్చింది.  పోనీ అందులో కొంత కొత్తదనం  వచ్చి ప్రపంచం తో మనం పోటీ పడదాం అనుకునే లోపు  ప్రతివాడు ఎదిగిపోతే  కష్టం  అని  చేతిలోకి  స్మార్ట్ ఫోన్  వచ్చింది.  చెయ్యి అంటే మరి  కుటుంబానికి  ఒకటి కాదు కదా . మనిషికి రెండు . అందుకే  డ్యూయల్ సిమ్ లు మెమరీ కార్డు లు , దానికి తోడూ అందులో  WiFi లు etc  etc  etc .

ఇప్పుడు కొత్తగా  4Gలు 5Gలు . ఇంక పెద్దలకే  పిచ్చి పట్టే కాలక్షేపాలు అరిచేతిలోనే .  అలాంటిది  పిల్లల సంగతి వేరే చెప్పాలా.  facebookలు ,  E mail లు  విషయం అందరికి తెలిసినదే .  దాని వల్ల లాభాల మాటేమో కానీ పక్క  మనుషులతో  సంబంధాలు పోయి , social మీడియా లో అందరూ  బిజీ ఐపోయారు.  ఇప్పుడు కొత్తగా వచ్చింది whatsapp .  రామారామా  ప్రతి వాళ్ళు  whatsapp  లోనే  పలకరించుకోవడా లు ,  మాట్లాడుకోడాలు. అందులో  ప్రతి వాళ్ళకి  ఓ వంద గ్రూప్ లు .

గ్రూప్ లు అంటే గుర్తువచ్చింది  ఇంట్లో అందరిని అంటే  మళ్ళి ఎందరో అనుకుంటారేమో  అబ్బే అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు అంతే  సుమండీ .  హాయిగా పిల్లలని పక్కన కూర్చోబెట్టుకుని  ఇది మంచి ఇది చెడు అని మాట్లాడుకుంటూ  పిల్లలకి కొత్త విషయాలు నేర్పాలిసిన కుటుంబ వ్యవస్థ ఒరేయ్ ఫ్యామిలీ గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాను చూడు అనుకునే స్టేజి లోకి ఈ టెక్నాలజీ  మనల్ని మర్చేస్తోంది. మాటలు  పోయి  మెసేజ్ లతోను  అది కూడా వాళ్ళు వాళ్ళ భావాలను చెప్పఖర్లేదు  సుమండీ. ఎవరో పంపిన మెసేజ్ ని  forward చేసేస్తారు.  అంటే  వీడు పదాలు వెతుక్కోవాల్సిన  పని కూడా లేదు. ఇంక మాటలు ఏం మాట్లాడతారు .  ఇది ఫ్యామిలీ గ్రూప్ సంగతి ఇలా వుంది . 

ఇంకా ప్రతి వాడికి స్కూల్ గ్రూప్ , collage గ్రూప్, ఆఫీస్ గ్రూప్, కాలనీ group అంటూ ఇలా ఓ వంద గ్రూప్ లు. వీటిలో పనికివచ్చే విషయాలు షేర్ చేసుకోవడం మాట ఎలా వుందో తెలియదు ఎవ్వరికీ కానీ , ఒక గ్రూప్ లో వచ్చిన ప్రతి మెసేజ్ ప్రతి గ్రూప్ లోను కనబడుతుంది. ఒక అరగంట కనక ఫోన్  కేసి  చూసే  time దొరకక పొరపాటున  లేట్ అయ్యిందో  ఇంక ఫోన్ చూడాలంటె భయం వేసేనని వందల వందల మెసేజ్ లు అసలు అన్ని మెసేజ్ లు పైపైన చూడాలన్న యెంత time వేస్ట్ అయిపోతుందో .  

అసలు అన్ని మెసేజ్ లు అంత time ఫోన్ లోనే  స్పెండ్ చేసేస్తుంటే  పిల్లలకి  చదువుకునే  time ఎలా . పెద్దలకు పనులు ఎలా . అసలు పక్కన ఒక మనిషి ఉన్నాడు  మాట్లాడాలనే ఆలోచన ఎలా వస్తుంది?  ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి  చేతిలోనూ ప్రపంచంలోను ఉండే  ఆఖర్లేని  కాలక్షేపాలతో గడిపే అలవాటు ఇపోతే  పనికొచ్చే పనులకు సమయం ఎక్కడ వుంటుంది .  మన ఫ్రెండ్ కి కష్టం వచ్చిందంటే  గెట్ వెల్ సూన్ అని మెసేజ్ పెట్టేస్తే వాడు బాగు పడిపోతడా.  

తండ్రి పిల్లాడికి ఒక మంచి మెసేజ్ పెట్టేస్తే వాడు మంచి  దారిలోనే వెళతాడా . కనీసం నువ్వు పంపిన మెసేజ్  వాడు చదివాడో లేదో కూడా చూసే ఆలోచన ఉంటోందా.ఇలాంటి విషయాలలో  వేగంగా కొట్టుకుపోతున్నమనం తెలివి  తెచ్చుకుని  ఇంటివైపు , జనం వైపు చూస్తామా . దేశానికీ పనికొచ్చే కాదు కాదు కనీసం మనకు పనికొచ్చే ఆలోచనలు మన  బుర్రలకు తడతాయా. మనందరికీ డౌటే కదా .

ఓ పది రోజులుగా నేను whatsapp వాడుతున్నాను లెండి . దాని మీద నాకు కలిగిన వికారం , చిరాకు , భయం ఇలా రాయిస్తున్నాయి . టెక్నాలజీ వాడుకోవాలి కాదనము కానీ దానికి కొంత పరిధి ఉండాలి, దాని అవసరాన్ని తెలిసి సద్వినియోగం చేసుకోవాలి కానీ మన ఇల్లు, ఆలోచనలు, చదువులు,  పనులు  పాడైపోయేలా  మాత్రం  కాదు కదా. మీరేమంటారు?