హమ్మయ్య నా పరీక్షల హడావుడి అయిపాయిందోచ్చ్ :
అంతే కదండీ మరి . పిల్లల కు పరీక్షలు అంటే మనకే కదా పెద్ద పరీక్షలు .పిల్లలదేముంది అమ్మ అస్సలు మాట్లాడనివ్వడం లేదు, TV చూడనివ్వడం లేదు, ఆడుకోనివ్వడం లేదు. అంటూ వాళ్ళ నాన్నగారికి రాగానే నా మీద complaints . ఆయన అయ్యో పోనిలేవోయ్ కాసేపు refresh అవ్వనీ అని వాళ్ళకి వంత పలకడం . అమ్మో ఈ పదిహేను రోజులు మా ఇంట్లో ఒకటే యుద్ధం అంటే నమ్మండి. నాకు భయం పిల్లలు కొంచెం time ఇస్తే ఇంకాస్త వాళ్ళే తీసేసుకుంటారు . మళ్ళీ పుస్తకాల దగ్గర కూర్చోపెట్టడానికి తాతలు దిగి రావలసిందే మరి . నా భయం నాది.
పరీక్షలంటే పిల్లల కన్నా పెద్దవాళ్ళకే ఎక్కువ భయం . పిల్లలు సరిగా చదువుతున్నారా లేదా , ఈ చదువులో పడి తిండి సరిగా తినటంలేదు ,ఇంతకీ చదివినది జాగ్రత్తగా పేపర్ పైన పెడతారా లేదా, నిద్ర సరిపోకపోతే వేడి చేస్తుందేమో , వీటన్నింటి తో పెద్దవాళ్ళకు చెమటలు పట్టేస్తాయి. ముఖ్యంగా అమ్మలకు . అమ్మలకు అటు పిల్లల చదువు కావాలి ఆరోగ్యం కావాలి.
నేను భయపడ్డాను కానీ మీరెవరూ భయపడకండి . ఈ రోజులలో పిల్లలే మనకన్నా confident గా వుంటున్నారు. అందులోనూ ఇప్పుడు పిల్లలే పెద్దవాళ్ళకి పాఠాలు చెప్పగలిగే తెలివితేటలతో వుంటున్నారు . కాబట్టి మీరు కంగారుపడి వాళ్ళని కంగారు పెట్టకండి .
మొత్తానికి ఎలాగయితేనేం ఈ సంవత్సరం నా పరీక్షలు అయ్యాయి .

మీకయిపోతే సరిపోతుందా? మాకందరికీ ఇప్పుడే మొదలు. anyhow, congrats for succesful completion.
రిప్లయితొలగించండినా ఒక్కత్తికి ఇపోయాయి కాబట్టి ఇపోయాయోచ్చ్ అండి .
రిప్లయితొలగించండి