ఇది నాకు చాలా చాలా ఇష్టమైన పాటండి తప్పక వినండి వీలయితే నేర్చుకుని పాడుకుని చూడండి నిజంగా చాలా ఆనందంగా వుంటుంది
రాగం: దేవగాంధారి
ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని
బట్టి తెచ్చి పొట్టనిండ బాలు వోయరే ||
గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన
చేమ పూవు కడియాల చేయి పెట్టి |
చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార
వేమరు వాపోవు వాని వెడ్డు వెట్టరే ||
ముచ్చువలె వచ్చి తన ముంగ మురువుల చేయి
తచ్చెడి పెరుగులోన దగబెట్టి |
నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార
వొచ్చెలి వాపోవువాని నూరడించరే ||
ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని
చెప్పరాని వుంగరాల చేయి పెట్టి |
అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన
తప్పకుండ బెట్టె (బట్టి) వాని తలకెత్తరే ||
శ్రీ కృష్ణుని బాల క్రీడ చాలా అందంగా ఉంది. మంచి కీర్తన పెట్టేరు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు
రిప్లయితొలగించండి