24, ఫిబ్రవరి 2013, ఆదివారం

మనుజుడై పుట్టి మనుజుని సేవించి అన్నమాచార్య కీర్తన



మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా ||


జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి
పట్టెడు కూటికై బతిమాలి |
పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి
వట్టి లంపటము వదలనేరడుగాన ||


అందరిలో పుట్టి అందరిలో చేరి
అందరి రూపములటు తానై |
అందమైన శ్రీ వేంకటాద్రీశు సేవించి
అందరాని పద మందెనటుగాన ||

4 కామెంట్‌లు:

  1. శారదగారు,
    మంచి కీర్తన వినిపించారు. అన్నమయ్య చిన్న కీర్తనలో గొప్ప సంగతి చెప్పేరు. కీర్తన చాలా బాగా గానం చేసేరు. ఈ కీర్తన పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. మీరిలాగే సాగిపోవాలని నా కోరిక.

    రిప్లయితొలగించండి
  2. SARADA GARU,

    PLEASE POST THE MEANING OF KEERTHANA ALSO. THAT WILL HELPFUL TO THE PEOPLE WHO WANTS TO KNOW THE REAL MEANINGS. PLEASE TRY TO POST IT ALSO.

    రిప్లయితొలగించండి
  3. శారద గారు,
    ఈ కీర్తన నన్ను చాలా ప్రభావితం చేసింది. నిన్నటి నుంచి వీలున్నపుడల్లా విన్నాను. దీని గురించి మీరు వివరిస్తే సంతసం, లేదా మీ అనుమతితో నా బ్లాగులో వివరిస్తా, తెలియచేయగలరు.

    రిప్లయితొలగించండి
  4. శర్మ గారు, శివ గారు, మీ స్పందనకు నా ధన్యవాదాలు. శర్మ గారు, మీలాంటి పెద్దవారు వివరిస్తే ఇంకా బాగుంటుంది. ఇది అన్నమాచార్యుల వారి కీర్తన, నా కాపీరైట్ ఏమీ లేదు. నేను కూడా ఇంకొంచెం వివరంగా తెలుసుకుంటాను.

    రిప్లయితొలగించండి