27, మే 2013, సోమవారం

గరుడ గమన గరుడధ్వజ అన్నమాచార్య కీర్తన



గరుడ గమన గరుడధ్వజ
నరహరి నమోనమో నమో ||


కమలాపతి కమలనాభా
కమలజ జన్మకారణిక |
కమలనయన కమలాప్తకుల
నమోనమో హరి నమో నమో ||


జలధి బంధన జలధిశయన
జలనిధి మధ్య జంతుకల |
జలధిజామాత జలధిగంభీర
హలధర నమో హరి నమో ||


ఘనదివ్యరూప ఘనమహిమాంక
ఘనఘనా ఘనకాయ వర్ణ |
అనఘ శ్రీవేంకటాధిపతేహం
నమో నమోహరి నమో నమో ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి