10, జూన్ 2013, సోమవారం

ఆనందం


         ఆనందం


        ఆనందం పలకడానికే  ఎంతో ఆనందంగా వినిపించే / అనిపించే పదం . కానీ నాకు అనిపిస్తుంది ఆనందానికి కొలత , అర్ధం పూర్తిగా అందుకోగలమా అని.  ఆలోచించే కొద్దీ చాలా ఆనందాలు చాలా మంది అందుకోలేకపోతా మేమో అనిపించింది.


       చల్ల గాలితో  రివ్వున పోటీ పడుతూ ఎగురుతున్న భావన. నది పాయలో అడ్డు ఆపు లేకుండా మనం కూడా వాగులో వాగులా, నది మలుపులో మలుపులా, లోయలో పడిలేచే  ప్రవాహంలా  తేలిన హాయి. మేఘాలలో దూది పింజలా తేలిపోతున్న తృప్తి . కదిలే కాలంతో పనిలేని ప్రశాంతత . 


      ఇవన్ని అనుభూతులే , మన ఊహలే నిజానికి ఆనంద సమయం అని మనం నిర్వచిచే సమయంలో వీటిలో ఏ ఒక్క అనుభూతినైనా మనం చేరుకోగలిగితే దానిని మించిన ఆనందం ఉండదనిపిస్తుంది. కానీ ఒక్కసారైనా మన ఆనందానికి ఇటువంటి అనుభూతి కలుగుతుందా?

      
       ఆనందాన్ని అనుభవించడంలో మనందరం సరిగా స్పందించ గలిగినా లేకపోయినా బాధలో మాత్రం పూర్తిగా  ములిగిపోతామనే చెప్పాలి.

     
         ఎలాగంటారా చిన్న దెబ్బ తగిలిందనుకోండి  ఇంకేముంది మొత్తం ప్రపంచం అంత తల్లకిందులయి మన నెత్తిన పడినంత హడావిడి చేసేస్తాము.
అదే ఎవరైనా చిన్న మాట అన్నారో ఇంక వాళ్ళు మన లిస్టు లోనే కాదు ప్రపంచంలోనే వుండడానికి పనికి రాని వాళ్ళుగా  డిసైడ్ అయిపోతాము.ఇంక ఇంట్లో ఏదైనా పొద్దున్నే ఆఫీసు టైములో కనుక కావలిసిన వస్తువు దొరకలేదో ఇంట్లో అందరూ నేరస్తులే.  కాదంటారా. 

     

         ఇంతకీ ఏమిటంటే చిన్న చిన్న ఇబ్బందులను ఇంతా పెద్దగా చూసేసే అలవాటుని మానుకుని  ,  ఆనందాన్ని మాత్రం  అంతకన్నా పెద్దగా చూడడం మొదలు పెడితే జీవితం మొత్తం ఆనందాన్నే అందుకోగలుగుతాము. కాబట్టి మనం అందులో ప్రాక్టీసు చేద్దాము.




       



        

    


2 కామెంట్‌లు:

  1. బాగుంది, ఏదో చెప్పాలని మీకు చాలా ఉత్సాహంగా ఉన్నట్లుంది. ఇలాగే కంటిన్యూ చేయండి, కొన్నాళ్ళకు బాగా రాయడం వస్తుంది -- ప్రమీల

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రమీలగారు మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు .

      తొలగించండి