22, జనవరి 2013, మంగళవారం

చాణిక్య నీతి

చాణిక్య నీతి 

ఇవి  చదివినప్పుడు ఆ రోజులలో పాలనలో ఎన్ని జాగ్రత్తలు పాటించే వారో అనిపిస్తున్నాయి. పాలనలో కొన్ని ఖటినమైన, ఖచితమైన నిర్ణయాలు తీసుకోవడం ఎంత అవసరమో కదా .  ఎంతటి సన్నిహితులనైన మొహమాట పడకుండా కొన్నింటికి దూరంగా వుంచడం , కొందరు వ్యక్తుల వల్ల సమాజానికి దేశానికి నష్టం వాటిల్లుతుంది అనుకుంటే వారిని వెంటనే దూరం చేయడం లాంటి నిర్ణయాలను నాయకుడు తప్పకుండా పాటించాలి . ఓట్లకోసం నేరస్తులను రక్షించే పరిస్థితులు ఆ నాటి నాయకులకు లేకపోబట్టే కాబోలు ఈనాటికీ వారు చిరస్తాయిగా మన అందరి మనసులలో  జీవించే వున్నారు .


1. రహస్యం ఆయుధం లాంటిది. మన గుప్పెట్లో వున్నంతకాలం సురక్షితంగా వుంటాం.ఇతరుల చేతిలో పడిందా సంక్షోభమే ..

2. మన బలాన్ని మనం రహస్యంగా వుంచుకోవాలి . బలహీనతల్ని మరీరహస్యంగా వుంచుకోవాలి. ఈ విషయంలో తాబేలే మనకు ఆదర్శం . పై పొర చాటున తన పదాల్ని ఎంత జాగ్రతగా దాచుకుంటుంది.

3. చేయి విషతుల్యమైతే చేతిని తీసెయ్యాలి. కాలు విషతుల్యమైతే కాలునూ తెసేయాలి . ఆలస్యం చేస్తే ...  విషం నిలువెల్లా వ్యాపిస్తుంది. అవినీతి పరులూ నమ్మక ద్రోహులూ కాలకూట విషం కంటే ప్రమాదం. 

4. రాజధాని గుండె కాయ వంటిది. శత్రు గూఢచారుల ప్రాబల్యం అక్కడా విస్తరించిందంటే ... అది నాయకుడి వైఫల్యం, మొత్తం పాలనా వ్యవస్థ వైఫల్యం.

5. చిల్లుల పాత్రలో నీరు నిలువ ఎంత అసాధ్యమో ...  చంచల స్వభావుల నోట్లో రహస్యాలు దాగడమూఅంతే అసాధ్యం . అలాంటి వ్యక్తులకు కీలక సమాచారం తెలియనివ్వకూడదు .


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి