కొన్ని ముత్యాలు మనందరి కోసం
1. నిజమైన పని ఇతరులకు సేవ
చేయడమే .
2. వంద కళలలో ప్రవేశించడం
కన్నా ఒక్క కళలో పరిపక్వత సాధించడం మంచిది .
3. ఇతరుల కష్టాలలో
పాలుపంచుకునే వారికి నిజమైన మిత్రులు లభిస్తారు .
4. పని చేసే ప్రతీసారి
సత్ఫలితాలు రావు. కానీ పని చేయకపోతే ఏ ఫలితం ఉండదు .
5. నీవు సంతోషంగా ఉండు. నీ
సంతోషాన్ని నలుగురితో పంచుకో. ఇదే అసలు సిసలైన సంతోష రహస్యం.
6. ఎంత ఉపయోగించినా
తరగనిది , అరగనిది విజ్ఞానం.
7. కాలాన్ని సరిగ్గా
నిర్వహించుకున్న వ్యక్తి, మనసును సవ్యంగా నిర్దేసించుకుంటాడు.
8. మనం నమ్మి పోరాడే
క్రమలో ఓటమిని చూసి ధైర్యాన్ని వదులుకోకూడదు .
9. ఒక సజ్జనునికి చిరునవ్వు,
దానగుణం, న్యాయబుద్ధి , మంచి మాటలు ముఖ్యం .
10. ఆత్మాభిమానం,
పవిత్రహృదయం ఉన్న మనిషి, ధనంలేని పేదవాడైనా ప్రపంచంలో శ్రేష్టుడు.
వ్యక్తిత్వవికాస మంచి ముత్యాలు.
రిప్లయితొలగించండి