రచన: అన్నమాచార్య
తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ |
సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ ||
సిరులసింగారరాయ చెలువపుతిమ్మరాయ |
సరసవైభవరాయ సకలవినోదరాయ |
వరవసంతములరాయ వనితలవిటరాయ |
గురుతైన తేగరాయ కొండలకోనేటిరాయ ||
గొల్లెతలవుద్దండరాయ గోపాలకృష్ణరాయ |
చల్లువెదజాణరాయ చల్లబరిమళరాయ |
చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ |
కొల్లలైన భోగరాయ కొండలకోనేటిరాయ ||
సామసంగీతరాయ సర్వమోహనరాయ |
ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ |
కామించి నిన్ను గోరితే గరుణించితివి నన్ను |
శ్రీమంతుడ నీకు జయ శ్రీవేంకటరాయ ||
మీ బ్లాగ్ ను చూస్తుంటే మీకు తెలుగు పై ఉన్న మక్కువ తెలుస్తుంది. మీ బ్లాగ్ లో అన్నమయ్య సంకీర్తనలు పూర్తిగా పెట్టడం బాగుంది
రిప్లయితొలగించండిధన్యవాదాలు
తొలగించండి