31, డిసెంబర్ 2013, మంగళవారం
30, డిసెంబర్ 2013, సోమవారం
అందమైన కల
అందమైన కల
నిన్న మా ఇంట్లో ఒక Topic వచ్చిందండి. మా వారు పిల్లలకి ఒక చిన్న Question ఇచ్చారు. అది వింటే దాని Answer కన్నా నిజంగా ఆ Thought ఎంత బాగుందా అని అనిపించింది . ఇంతకీ ఆ Topic ఏమిటంటే రాత్రి మీరు మీ ఇంట్లో పడుకున్నారు, తెల్లారి లేచేసరికి ఏదో తెలియని, మీకు తెలీని భాష వున్న area లో వున్నారు. అక్కడ cellphone లు ,. net లు ఏమీ లేని పక్కా పల్లెటూరు. మీరు ఎలా ఇల్లు చేరుతారు? మీ దగ్గర డబ్బులు కూడా లేవు. ఇది Question . ఒక Line లో Answer చెయ్యచ్చనుకోండి. కానీ మనం నిజంగా పడుకుని లేచేసరికి ఊరు మారిపోనఖర లేదనుకోండి . Cellphone లు , Inter Net లు , TV లు , Cable , ఆడవాళ్ళ Vilanism Serials లేని రోజుల్లోకి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో కదా. ఇవన్ని లేకపోతే ఎంత Time దొరుకుతుంది. మనుషుల మధ్య బంధాలు బలపడడానికి ఎన్ని అవకాశాలు వస్తాయి. ఈ ఆలోచనే ఎంత ప్రశాంతంగా అనిపిస్తోందో కదా. ఇంకోటండీ ఈ City Life లో పెద్ద ఇబ్బంది Traffic . అది తగ్గాలంటే Cycle తప్ప వేరే వాహనాలు లేని Time కి మారిపోతే బాగుంటుంది కదా . ఈ ఉరుకులు పరుగులు లేని ప్రపంచం ఇంక కలలోనే తప్ప ఇలలో కనడం కుదరదనుకోండి. అందుకని ఈ రోజు రాత్రి కలలో మీరందరూ కూడా ఇలాంటి అందమైన , అపురూపమైన కలను కనాలని ఆశిస్తూ ..............
3, డిసెంబర్ 2013, మంగళవారం
భగవద్గీత పారాయణం 15
రచన: వేద వ్యాస
అథ త్రయోదశోஉధ్యాయః |
శ్రీభగవానువాచ |
ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే |
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రఙ్ఞ ఇతి తద్విదః || 1 ||
క్షేత్రఙ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత |
క్షేత్రక్షేత్రఙ్ఞయోర్ఙ్ఞానం యత్తజ్ఙ్ఞానం మతం మమ || 2 ||
తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ |
స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు || 3 ||
ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ |
బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః || 4 ||
మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ |
ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియగోచరాః || 5 ||
ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః |
ఏతత్క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్ || 6 ||
అమానిత్వమదంభిత్వమహింసా క్షాంతిరార్జవమ్ |
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః || 7 ||
ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ |
జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్ || 8 ||
అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు |
నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు || 9 ||
మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ |
వివిక్తదేశసేవిత్వమరతిర్జనసంసది || 10 ||
అధ్యాత్మఙ్ఞాననిత్యత్వం తత్త్వఙ్ఞానార్థదర్శనమ్ |
ఏతజ్ఙ్ఞానమితి ప్రోక్తమఙ్ఞానం యదతోஉన్యథా || 11 ||
ఙ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి యజ్ఙ్ఞాత్వామృతమశ్నుతే |
అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే || 12 ||
సర్వతఃపాణిపాదం తత్సర్వతోஉక్షిశిరోముఖమ్ |
సర్వతఃశ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి || 13 ||
సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితమ్ |
అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ || 14 ||
బహిరంతశ్చ భూతానామచరం చరమేవ చ |
సూక్ష్మత్వాత్తదవిఙ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ || 15 ||
అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ |
భూతభర్తృ చ తజ్ఙ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ || 16 ||
జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే |
ఙ్ఞానం ఙ్ఞేయం ఙ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితమ్ || 17 ||
ఇతి క్షేత్రం తథా ఙ్ఞానం ఙ్ఞేయం చోక్తం సమాసతః |
మద్భక్త ఏతద్విఙ్ఞాయ మద్భావాయోపపద్యతే || 18 ||
ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాది ఉభావపి |
వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసంభవాన్ || 19 ||
కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే |
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే || 20 ||
పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్గుణాన్ |
కారణం గుణసంగోஉస్య సదసద్యోనిజన్మసు || 21 ||
ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః |
పరమాత్మేతి చాప్యుక్తో దేహేஉస్మిన్పురుషః పరః || 22 ||
య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ |
సర్వథా వర్తమానోஉపి న స భూయోஉభిజాయతే || 23 ||
ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా |
అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే || 24 ||
అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే |
తేஉపి చాతితరంత్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః || 25 ||
యావత్సంజాయతే కించిత్సత్త్వం స్థావరజంగమమ్ |
క్షేత్రక్షేత్రఙ్ఞసంయోగాత్తద్విద్ధి భరతర్షభ || 26 ||
సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరమ్ |
వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి || 27 ||
సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్ |
న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్ || 28 ||
ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః |
యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి || 29 ||
యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి |
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా || 30 ||
అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః |
శరీరస్థోஉపి కౌంతేయ న కరోతి న లిప్యతే || 31 ||
యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే |
సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే || 32 ||
యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః |
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత || 33 ||
క్షేత్రక్షేత్రఙ్ఞయోరేవమంతరం ఙ్ఞానచక్షుషా |
భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాంతి తే పరమ్ || 34 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
క్షేత్రక్షేత్రఙ్ఞవిభాగయోగో నామ త్రయోదశోஉధ్యాయః ||13 ||
1, డిసెంబర్ 2013, ఆదివారం
భగవద్గీత పారాయణం 14
రచన: వేద వ్యాస
అథ ద్వాదశోஉధ్యాయః |
అర్జున ఉవాచ |
ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే |
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః || 1 ||
శ్రీభగవానువాచ |
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే |
శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః || 2 ||
యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం పర్యుపాసతే |
సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువమ్ || 3 ||
సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః |
తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః || 4 ||
క్లేశోஉధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసామ్ |
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే || 5 ||
యే తు సర్వాణి కర్మాణి మయి సంన్యస్య మత్పరాః |
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే || 6 ||
తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ |
భవామిన చిరాత్పార్థ మయ్యావేశితచేతసామ్ || 7 ||
మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ |
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః || 8 ||
అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ |
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ || 9 ||
అభ్యాసేஉప్యసమర్థోஉసి మత్కర్మపరమో భవ |
మదర్థమపి కర్మాణి కుర్వన్సిద్ధిమవాప్స్యసి || 10 ||
అథైతదప్యశక్తోஉసి కర్తుం మద్యోగమాశ్రితః |
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ || 11 ||
శ్రేయో హి ఙ్ఞానమభ్యాసాజ్ఙ్ఞానాద్ధ్యానం విశిష్యతే |
ధ్యానాత్కర్మఫలత్యాగస్త్యాగాచ్ఛాంతిరనంతరమ్ || 12 ||
అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ |
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ || 13 ||
సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః |
మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః || 14 ||
యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః |
హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యః స చ మే ప్రియః || 15 ||
అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః |
సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః || 16 ||
యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి |
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్యః స మే ప్రియః || 17 ||
సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః |
శీతోష్ణసుఖదుఃఖేషు సమః సంగవివర్జితః || 18 ||
తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ |
అనికేతః స్థిరమతిర్భక్తిమాన్మే ప్రియో నరః || 19 ||
యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే |
శ్రద్దధానా మత్పరమా భక్తాస్తేஉతీవ మే ప్రియాః || 20 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
భక్తియోగో నామ ద్వాదశోஉధ్యాయః ||12 ||
27, నవంబర్ 2013, బుధవారం
నువ్వెక్కడని
నువ్వెక్కడని
వీచే గాలిని అడిగా
పారే ఏరుని అడిగా
నీలాకాశాన్నడిగా నువ్వెక్కడని
కురిసే వర్షాన్నడిగా
కదిలే పైరునడిగా
పూచే పూలనడిగా నువ్వెక్కడని
ఎగిరే పక్షినడిగా
ఆడే నేమలినడిగా
ఉరికే జలపాతాన్నడిగా నువ్వెక్కడని
24, అక్టోబర్ 2013, గురువారం
భగవద్గీత పారాయణం 13
అథ ఏకాదశోஉధ్యాయః |
అర్జున ఉవాచ |
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంఙ్ఞితమ్ |
యత్త్వయోక్తం వచస్తేన మోహోஉయం విగతో మమ || 1 ||
భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా |
త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్ || 2 ||
ఏవమేతద్యథాత్థ త్వమాత్మానం పరమేశ్వర |
ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ || 3 ||
మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో |
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ || 4 ||
శ్రీభగవానువాచ |
పశ్య మే పార్థ రూపాణి శతశోஉథ సహస్రశః |
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ || 5 ||
పశ్యాదిత్యాన్వసూన్రుద్రానశ్వినౌ మరుతస్తథా |
బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత || 6 ||
ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరమ్ |
మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ద్రష్టుమిచ్ఛసి || 7 ||
న తు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా |
దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ || 8 ||
సంజయ ఉవాచ |
ఏవముక్త్వా తతో రాజన్మహాయోగేశ్వరో హరిః |
దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ || 9 ||
అనేకవక్త్రనయనమనేకాద్భుతదర్శనమ్ |
అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ || 10 ||
దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనమ్ |
సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖమ్ || 11 ||
దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా |
యది భాః సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః || 12 ||
తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా |
అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా || 13 ||
తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః |
ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత || 14 ||
అర్జున ఉవాచ |
పశ్యామి దేవాంస్తవ దేవ దేహే సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్ |
బ్రహ్మాణమీశం కమలాసనస్థమృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ || 15 ||
అనేకబాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోஉనంతరూపమ్ |
నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప || 16 ||
కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతమ్ |
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాద్దీప్తానలార్కద్యుతిమప్రమేయమ్ || 17 ||
త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
త్వమవ్యయః శాశ్వతధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే || 18 ||
అనాదిమధ్యాంతమనంతవీర్యమనంతబాహుం శశిసూర్యనేత్రమ్ |
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతమ్ || 19 ||
ద్యావాపృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః |
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ || 20 ||
అమీ హి త్వాం సురసంఘా విశంతి కేచిద్భీతాః ప్రాంజలయో గృణంతి |
స్వస్తీత్యుక్త్వా మహర్షిసిద్ధసంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః || 21 ||
రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా విశ్వేஉశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ |
గంధర్వయక్షాసురసిద్ధసంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే || 22 ||
రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదమ్ |
బహూదరం బహుదంష్ట్రాకరాలం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్ || 23 ||
నభఃస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్తవిశాలనేత్రమ్ |
దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో || 24 ||
దంష్ట్రాకరాలాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసంనిభాని |
దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస || 25 ||
అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాలసంఘైః |
భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః || 26 ||
వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాలాని భయానకాని |
కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః || 27 ||
యథా నదీనాం బహవోஉంబువేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి |
తథా తవామీ నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి || 28 ||
యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధవేగాః |
తథైవ నాశాయ విశంతి లోకాస్తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః || 29 ||
లేలిహ్యసే గ్రసమానః సమంతాల్లోకాన్సమగ్రాన్వదనైర్జ్వలద్భిః |
తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో || 30 ||
ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో నమోஉస్తు తే దేవవర ప్రసీద |
విఙ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ || 31 ||
శ్రీభగవానువాచ |
కాలోஉస్మి లోకక్షయకృత్ప్రవృద్ధో లోకాన్సమాహర్తుమిహ ప్రవృత్తః |
ఋతేஉపి త్వాం న భవిష్యంతి సర్వే యేஉవస్థితాః ప్రత్యనీకేషు యోధాః || 32 ||
తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్ |
మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ || 33 ||
ద్
రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ |
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ || 34 ||
సంజయ ఉవాచ |
ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ |
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్య || 35 ||
అర్జున ఉవాచ |
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ |
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః || 36 ||
కస్మాచ్చ తే న నమేరన్మహాత్మన్గరీయసే బ్రహ్మణోஉప్యాదికర్త్రే |
అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ || 37 ||
త్వమాదిదేవః పురుషః పురాణస్త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ |
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప || 38 ||
వాయుర్యమోஉగ్నిర్వరుణః శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ |
నమో నమస్తేஉస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోஉపి నమో నమస్తే || 39 ||
నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోஉస్తు తే సర్వత ఏవ సర్వ |
అనంతవీర్యామితవిక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోஉసి సర్వః || 40 ||
సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి |
అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ప్రణయేన వాపి || 41 ||
యచ్చావహాసార్థమసత్కృతోஉసి విహారశయ్యాసనభోజనేషు |
ఏకోஉథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయమ్ || 42 ||
పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ |
న త్వత్సమోஉస్త్యభ్యధికః కుతోஉన్యో లోకత్రయేஉప్యప్రతిమప్రభావ || 43 ||
తస్మాత్ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యమ్ |
పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుమ్ || 44 ||
అదృష్టపూర్వం హృషితోஉస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే |
తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస || 45 ||
కిరీటినం గదినం చక్రహస్తమిచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ |
తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే || 46 ||
శ్రీభగవానువాచ |
మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ |
తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్ || 47 ||
న వేదయఙ్ఞాధ్యయనైర్న దానైర్న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః |
ఏవంరూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర || 48 ||
మా తే వ్యథా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్ |
వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య || 49 ||
సంజయ ఉవాచ |
ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః |
ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా || 50 ||
అర్జున ఉవాచ |
దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన |
ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః || 51 ||
శ్రీభగవానువాచ |
సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ |
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః || 52 ||
నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా |
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా || 53 ||
భక్త్యా త్వనన్యయా శక్య అహమేవంవిధోஉర్జున |
ఙ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప || 54 ||
మత్కర్మకృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః |
నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ || 55 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
విశ్వరూపదర్శనయోగో నామైకాదశోஉధ్యాయః ||11 ||
10, అక్టోబర్ 2013, గురువారం
25, సెప్టెంబర్ 2013, బుధవారం
ఎదురుచూపులు
ఎదురుచూపులు
ఇలా శ్రీవారు
ఆఫీసుకి వెళ్ళారో లేదో సుమన ఫోన్ వచ్చింది . ఇంట్లోనే ఉంటున్నావా నేను వస్తున్నాను
అని. You are always welcome అని చెప్పాను తనకి. సుమన వస్తుందంటే నాకు చాలా సంతోషం మరి.
ఎందుకంటే తను నాకున్న మంచి స్నేహితురాళ్ళలో మొదటి స్థానంలో వుంటుంది మరి.
తను వచ్చేసరికి పనంతా ముగించుకుని కబుర్లు చెప్పుకోవచ్చని మొత్తం పనంతా గబగబా
హడావిడిగా చేసి వచ్చి హాల్లో సోఫాలో కూర్చుని తనకోసం ఎదురు చూస్తూ TV లో channels తిప్పుతున్నాను . Time చూస్తే 11.30, అయినా సుమన ఇంకా రాలేదు సరికదా,
కనీసం తన ఫోన్ కూడా రాలేదు. సరేలే ఇంకా బయలుదేరటం కుదరలేదేమో అని అనుకున్నాను.
సుమనకి నాకు పదిహేనేళ్ళ స్నేహం. సుమన భర్త మావారు ఒకే ఆఫీసులో పని చేస్తారు.
సుమన తీరు వేరు. మనిషి అందంగా , హుందాగా ఉంటుంది. ఎవరైనా తన సర్కిల్ లో వాళ్ళు సలహా
అడిగితే ఎంతో ఆలోచించి అన్ని కోణాలనుండి ఆ సమస్యలోని సాధక బాధకాల గురించి పూర్తిగా
విశ్లేషించి వివరించి చెప్పగల తెలివైనది.
నాకు తన వ్యక్తిత్వం చాలా విషయాలలో నచ్చుతుంది. ఒక్క విషయంలో తప్ప. అబ్బ ఇంకా రాలేదేమిటా అని టైం చూస్తే ఒంటిగంట
లంచ్ టైం అయ్యింది ఇంక ఎప్పటికి వస్తుంది సుమన ? కనీసం ఎదురుచూస్తూ ఉంటానని
అనుకోదేం? ఒక ఫోన్ చేసి లేట్ అవుతుందని
చెబితే తన సొమ్మేం పోతుంది?
ఇంత గింజుకునే బదులు ఆ పనేదో నేనే చెయ్యొచ్చుగా అనేగా మీ ఉద్దేశం? అదే
వస్తున్నాను. నాకు తనలో నచ్చని విషయం ఇదే . ఇప్పుడు నేను ఫోన్ చేసాననుకోండి "అయ్యో
నేను నీకు చెప్పినప్పటి నుంచి ఒకటే
హడావిడిగా పనులు చేస్తూనే వున్నాను. ఇంకా కాలేదోయ్ ఏమీ అనుకోకు నేనే చేసి
చెబుదామనుకున్నాను. హడావిడిలో మర్చిపోయాను . ఇందాక ఫోన్ దాకా వచ్చిన దాన్నే ఏదో గుర్తువచ్చి
వెళ్లాను మళ్ళి కుదరలేదు. అందులోను నువ్వేకదా నన్ను బాగా అర్ధం చేసుకున్నదానివి,
ఇంక నా సంగతి బాగా తెలిసిన దానివి కనుక మనిద్దరిమధ్య ఫార్మాలిటీస్ కి అంత
ఇంపార్టెన్స్ లేదని, మర్చిపోయినా నువ్వేమీ అనుకోవని పరవాలేదులే" అని..............
అంటూ ముందరకాళ్ళకి బంధం వేసేస్తుంది మరి. ఇలాంటివి చాలా సార్లే అయ్యాయి లెండి.
అందుకే ఈసారి మాత్రం ఎలాగైనా తను చేసి చెపితేనే వినాలి అని నేను పట్టుబట్టి
కూర్చున్నాను.
సరే తనింకా రాలేదుగా అని ఎలాగో లంచ్ టైం అయ్యింది కదాని భోజనం అయ్యిందనిపించానే కానీ ధ్యాసంతా
సుమన మీదే . ఇన్ని మంచి క్వాలిటీస్ వున్న అమ్మాయి ప్రతిసారి ఇలానే ఎందుకు చేస్తుందా
అని. వచ్చిన తరువాత మాత్రం ఇంక భూమ్మీద తను నిలబడదు, నన్ను నిలబడ నివ్వదు . అంత
హడావిడి చేసేస్తుంది. ఈ లోపు ఎదురుచూడడం మాత్రం నేను ఎప్పుడు ఫేస్ చేసే పెద్ద
బోరింగ్ ప్రోగ్రాం అనుకోండి. టైం 4 కాస్తోంది ఇంకేం వస్తుంది? ఒకవేళ ఫోన్ చేసినా
ఇంక కుదరదు లేవోయ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వేళ్ళయ్యింది అంటుంది. అందుకని ఇంక
నేను కూడా ఈ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెట్టి నా పిల్లలు వచ్చే వేళ్ళయ్యిందని లేచి
వాళ్ళకు టిఫిన్ ఏర్పాట్లలో పడ్డాను.
తనంటే నాకు క్లోజ్ కనుక నిజంగానే మా మధ్య ఫార్మాలిటీస్ కి అంత ప్రాముఖ్యం లేదు
కనుక సరిపోతోంది. ఇలా ఎదుటివాళ్ళ ఫీలింగ్స్ గురించి అంత శ్రద్ధ చేయని వాళ్ళు చాలామందే
వుంటారు. కానీ రిలేషన్స్ ని జగ్రత్తగా మెయింటైన్ చెయ్యాలంటే మాత్రం ఇలాంటి చిన్న
చిన్న విషయాలమీద శ్రద్ధ చాలా అవసరం. చిన్న ఫోన్ కాల్ లేదా మెసేజ్ పెట్టడం వల్ల
అవతల వ్యక్తి మీద మనకున్న కేర్ ని , అభిమానాన్ని వ్యక్తం చేసినవాళ్ళమవుతాము . వాళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్ అనే భావన అవతలి వారిలో మనమీద పాజిటివ్ ఫీల్ ని నింపుతుంది . దాని
వల్ల ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య బంధం మరింత బలపడుతుందనేది మాత్రం నిజం. ఇది కేవలం
ఫ్రెండ్స్ వరకే కాదు తల్లిదండ్రులు – పిల్లలు, భార్య – భర్తలు, రిలేటివ్స్ఇలా ఎవరి
మధ్యనైనా ఇటువంటి చిన్న కేర్ బంధాలను బలపరుస్తుందనేది నా అభిప్రాయం, నమ్మకం. మరి
మీది?
18, సెప్టెంబర్ 2013, బుధవారం
జర్నీ (ప్రయాణంలో పదనిసలు)
జర్నీ (ప్రయాణంలో పదనిసలు)
జోరుగా హుషారుగా షికారు పోదమా
హాయి హాయిగా తీయతీయగా జోరుగా.....
ఈ పాట వింటూ కారులో లాంగ్ జర్నీ ఎంత బాగుంటుందో కదా. మేము ఈ హాయినీ , తీయదనాన్ని చాలా సార్లే ఎంజాయ్ చేసాము లెండి . కానీ దారిలో ఏదైనా ఇబ్బంది అయిందంటే వచ్చే చేదుని కూడా ఈ మధ్యనే రుచి చూసాము మేము. ఎలా అంటారా...
మొన్న వినాయకచవితికి రెండు రోజులముందు బెంగుళూరుకు వెళ్ళడానికి సన్నాహాలు ప్రారంభిస్తే నేనేమో హాయిగా ట్రైన్లో వెళదాం అని అంటే మా సుపుత్రుడు ససేమిరా అని, వెడితే కారులో హాయిగా ఎంజాయ్ చేస్తూ వెళదాము అని ఒకటే పట్టుపట్టాడు. నా ఓటు తప్ప, వాడిది కాక, ఇంట్లో మిగిలిన రెండు ఓట్లు వాడికే పడ్డాయి. ఇంకేముంది నేనుకూడా తప్పని పరిస్థితుల్లో సరే అని దానికే ఊ అనాల్సివచ్చి కారులో బయలుదేరాము . NH 7 హైవే చాలా బాగుంది. నిజంగానే చాలా హాయిగా సాగిపోయాము చీకటి పడేదాకా .
చీకటి పడ్డాకా దారిలో మా కారుకి ఏదో తగిలి ధబీ మని పెద్ద సౌండ్ . మావారు గభాలున కారు పక్కకి ఆపి చూసాముకదా పెట్రోల ట్యాంక్ కు హోల్ అయ్యింది. బొటబొటబోట మని ఇరవై లీటర్లు పైగా పెట్రోల్ ఒక్కసారిగా మా కళ్ళముందే నేలపాలయిపోయింది . అసలే ఈ రోజులలో పెట్రోలంటే మాటలా. అందులోను డబ్బుల బాధ కన్నా చూస్తూ చూస్తూ అంత ఫ్యూయల్ ని నేలపాలవుతుంటే చూడడం ఇంకా బాధ. ఏమి చేయలేము దానిని ఆపడానికి .
ఇంతకీ ఏమి తగిలిందా అని కొంచెం వెనక్కి నడిచి వెళ్లి చూస్తే పోలీసులు స్పీడ్ కంట్రోల్ కోసం పెట్టె బోర్డు. ఎవరో లారీవాళ్ళో , వేరే వాళ్ళో దానిని అంతకు ముందు గుద్దేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయిన దాని ఫలితం మేము ఇబ్బంది పడడం . కొంచెం ఆగి దానిని పక్కకి జరిపితే వాడి సొమ్మేంపోతుంది చెప్పండి. ఇంకా అది అక్కడే అలానే వుంటే మాలానే వేరేవాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వుంటుందని పాపం మా వారు దానిని పక్కకి పెట్టి వచ్చారనుకోండి . ఇలాంటి విషయాలలో మాత్రం నేను మావారిని మెచ్చుకోక తప్పదనుకోండి. ఏమి చేస్తాం తను గుడ్ బోయ్ మరి. మీరు ఆయనతో నేను ఇలా అన్నానని చెప్పకండి. ఇంక ఆయన ములగచెట్టు దిగరు. మనం పట్టుకోలేము .
ఇది ఒక ఎత్తయితే టైం ఎంత అని చూసేసరికి రాత్రి ఒంటిగంట . అప్పుడు మొదలయ్యింది నాలో కంగారు. అర్ధరాత్రి, హైవే , నిర్జనప్రదేశం , వంటిమీద బంగారం, పక్కన ఆడపిల్ల . ఎవరినైనా ఆపి హెల్ప్ అడగలన్నా భయం. ఆడపిల్ల పుట్టిందని ప్రతిక్షణం మురిసిపోయే నేను మొదటిసారిగా ఆడపిల్ల అంటే భయపడడం జరిగింది. నాకే ఆశ్చర్యం వేసింది . మనం మన దేశంలోనే వుండి బ్రతకడానికి ఇంత భయపడవలసిన పరిస్తితి ఏమిటా అని. కానీ అవసరం వుండి కూడా డేర్ చేసి బయటికి మన పని మీద మనం వెళ్లడానికి వీలు కాని పరిస్తితికి కారణం ఎవరు అని ఆలోచిస్తే సమాధానం మాత్రం కేవలం మనమే అనేది మాత్రమే దొరుకుతోంది . బహుశా మీ అందరికి కూడా అదే సమాధానం దొరుకుతూ ఉండో చ్చేమో .
లోపల కారులోనే ఉండు అని చెపితే అర్ధంకాక , నాన్న వెనక క్యూరియస్ గా తిరిగే చురుకైన ,అమాయకపు చిన్నపిల్ల తను. అంత భయపడకోయ్ అనే అసలు భయం పట్టని మావారు. ఇంక నా కొడుకైతే సరేసరి . ఫరలేదులే అమ్మా నేను , డాడీలేము అంటాడు వాడు . నా పాట్లు ఆ దేవుడికే తెలియాలి.
ఇంతలో మా వారు హై వే పోలీసులకు ఫోన్ చేసి ఏదన్నా హెల్ప్ దొరుకుతుందేమో అని చూసారు. వాళ్ళు ఆక్సిడెంట్ అయ్యి ఇంక గొడవ జరుగుతూ ఉంటేనే వస్తారుట లేకపోతే రారుట. అలాగే హై వే హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేస్తే మొత్తానికి బండి తుక్కుతుక్కు అయిపోతే పక్కకి పడేయడానికి వస్తారుట అదేట వాళ్ళ డ్యూటీ .పోనిలే బాబూ అంత అవసరం రాకుండా భగవంతుడు దయ తలచాడు అని అనుకోవలసి వచ్చింది వాళ్ళ సమాధానాలు విన్నాక.
ఒక గంటా గంటన్నర ఇలా గడిచాకా రిపేర్ షాప్లు కూడా పొద్దుటిదాకా తెరవరు కనుక మీరు బస్సులో బెంగుళూరు వెళ్ళిపొండి నేను రేపు రిపేర్ చేయించుకుని వచ్చేస్తాను అని మావారు అనగానే నాకు ఇంకా భయం వేసింది. ఎందుకా అని అనుకుంటున్నారా? ఏమి లేదండి నాకు పుట్టింటికి వెళ్ళడానికి ఇక్కడ ఈయన ట్రైన్ ఎక్కిస్తే అక్కడ (ఉండేది ఒక్క బస్సు స్టాప్ , ఒక్క రైల్వే స్టేషనే కాబట్టి) నాన్నగారు వచ్చి రిసీవ్ చేసుకోవడమే తెలుసు మరి. వేరే ఎక్కడికి నేను ఒక్కత్తినే వెళ్ళిన అలవాటు, ఆలోచన కూడా లేని దాన్ని మరి. నిజమండి.
అలాంటిది బెంగుళూరు అంటే మాటలా, ఎన్ని ఏరియాలో , ఎన్ని రైల్వే స్టేషన్లో, ఎన్ని బస్సు స్టాప్లో . వెళ్ళగలిగితే అక్కడికి మా తమ్ముడు వస్తాడనుకోండి, కానీ నా భయం నాది. ఎంతైనా సొంత ప్రాణం కదండీ . నా వల్ల కాదంటే కాదని ససేమిరా అనేసా.
ఇంక తప్పేది లేక మావారు కనీసం హైదరాబాదు బస్సు ఎక్కు నేకు తెలియకపోతే పిల్లలకకి తెలుసు అనేసారు. నా అభిప్రాయంతో పని లేకుండా. మా అబ్బాయి కూడా భరోసా ఇవ్వడంతో కొంచే భయంగానే అనిపించినా కూడా రోడ్డుమీద ఆడపిల్లతో రిస్క్ తీసుకోవడం కన్నా అదే మంచిదని హైదరాబాదు వెళ్ళే బస్సు రిక్వెస్ట్ మీద అక్కడే ఆపి ఎక్కి హైదరాబాదు చేరడం జరిగింది. బస్సు లక్డీకాపూల్ ట అక్కడ ఆగింది . అక్కడ ఆటో ఎక్కించాడు మా అబ్బాయి. ఒక్కదారి ఎప్పుడూ చూసిన దాఖలా కనిపించలేదు నాకు . నీకు దారి తెలుసురా అంటే వాడు పరవాలేదు అంటాడే కానీ గారెంటీ ఇవ్వడు. ఆటో డ్రైవర్ ఎటు వెళ్ళాలండి అని అడిగితె ఏమి చెప్పాలా అని నాకు ఒకటే టెన్షన్. నా అదృష్టం బాగుండి ఆ ఆటో డ్రైవర్ ఎలాంటి ప్రశ్నలు వెయ్యకుండానే మా ఏరియాకు తీసుకువచ్చాడు కాబట్టి సరిపోయింది. తెలిసిన ఏరియాకు వచ్చాకా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను నేను. ఇల్లు చూసాక అయితే ప్రాణం లేచొచ్చిం దంటే నమ్మండి. మా వారు రావడనికయితే పాపం రాత్రి అయ్యింది. (ఆయన కారుని ఎలా రిపైర్ చేయించుకున్నారు అనేది ఒక పోస్ట్ కు సరిపడే విషయం).
ఇంత టెన్షన్ , భయం ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల మన అనుభవిస్తున్నాం అంటే మన సమాజం ఎంత ఇన్సేక్యుర్ గా తయారయ్యిందో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా వుంది. దానిని సరిదిద్దుకోవలసిన అవసరం దేశ పౌరులందరి మీదా వుంది. మనం తప్పుడు పద్దతులను ప్రోత్సహించకూడదు, చూసి చూడనట్లు ఊరుకోకూడదు, తప్పును తప్పు అని చెప్పడానికి సమిష్టిగా కృషి చేయవలసి వుంది. అనే నిజాలను అందరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఈ రోజు మన దేశ పరిస్తితులను బట్టి ఎంతైనా ఉంది.
పక్క మనిషిని నమ్మలేని పరిస్తితి మన భారత దేశంలో వుంది అంటే మిగతా ప్రపంచానికి మన దేశానికి తేడా లేదనే కదా.
ఇంతకీ ఇదండి మా హాయి హాయి జర్నీ లోని చెడు అనుభవం. సో జర్నీ లో జాగ్రత్త సుమండి . తప్పు మనది కాకపోయినా ఒక్కొక్క సారి మనం ఇబ్బంది పడవలసి వస్తుంది. అలా అని మానేసి ఇంట్లో కూర్చోలేముకదా. మీ ప్రయాణాలు ఎప్పుడూ తియ్యగానే సాగిపోవాలని కోరుతూ...............
శారద విభావరి
25, ఆగస్టు 2013, ఆదివారం
హౌస్ వైఫ్
హౌస్ వైఫ్
పక్కింటి సరళ ని చూసినప్పుడల్లా శ్రావణి ఆలోచనలో
పడిపోతుంది. హాయిగా 9 కొట్టేసరికల్లా మంచి ఇస్త్రీ చీర కట్టుకుని హ్యాండ్ బాగ్
భుజాన వేసుకుని టిప్పుటాపుగా వాళ్ళాయన సుబ్బారావుతో బండిమీద ఆఫీసుకి
వెళ్ళిపోతుంది. నేను వున్నాను చదువుకుని ఎందుకు ఎంతసేపు అంట్లు, పిల్లలు, చాకిరీ.
గంజిపెట్టిన చీర కట్టుకోవాలన్నా వందసార్లు ఆలోచించాలి. ఇంట్లోనే వుండే దానికి
అవసరమా ఇస్త్రీ పడయిపోతుంది అని. ఒకవేళ బయటికి వెళ్ళినా సరళ అంత హుందాగా పనివుండి
వెళ్ళిన ఫీలింగ్ ఏం వుంటుంది అని. కాలక్షేపానికి షాపింగ్ కి వెళ్లినట్టు వుంటుంది
. హూ ... ఏంచేస్తాం ఎంత రాసి పెట్టి
వుంటే అంతే ప్రాప్తం అని ...
శ్రావణికి వుద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదు.
దానితో ఇంట్లోవాళ్ళు, తను తన వుద్యోగం మీద అంతగా శ్రద్ధ చేయలేదు. శ్రావణి భర్త
శ్యాం కూడా ఎందుకోయ్ ఉద్యోగం తో శ్రమ పడటం, హాయిగా ఇంట్లో వుండక అంటాడు . తను కూడా
పెద్దగా శ్రద్ధ చెయ్యక పోవడంతో హౌస్ వైఫ్ గా స్తిరపడిపోయింది. వెళితే కాదనే వాళ్ళు
లేరు, మానేస్తే వద్దనేవాళ్ళు లేరు . కానీ ఉద్యోగాస్తురాళ్ళను చూస్తే శ్రావణికి
కొంచెం లోటనిపిస్తుంది.
నిజమే మరి ఈ రోజుల్లో ఉద్యోగాలు చెయ్యాలి
అనుకుంటే చాలా అవకాశాలే వున్నాయి. అందులోను ఒకసారి తీసుకున్న నిర్ణయం ఇంక ఎప్పటికి
నచ్చాలని లేదుకదా. ఈ వాళ్ళ కావాలనుకున్నది రేపు వద్దనిపించోచ్చు. అలానే శ్రావణి
లాంటి చాలా మంది హౌస్ వైఫ్ ల పరిస్తితీను .
పిల్లల
చిన్నప్పుడు వాళ్ళ ఆలన పాలనా ముఖ్యం కనుక శ్రావణి అప్పటికి ఆ నిర్ణయం తీసుకుంది.
ఇప్పుడు కాలేజీ కి వచ్చిన పిల్లలకి అన్ని టైం కి అవిరిస్తే సరిపోతోంది. పూర్వం లా
వాళ్ళ వెంట పరుగెత్తి తినిపించాలి, దగ్గర కూర్చుని హోం వర్క్ చేయించాలి అనే అవసరం
వుండక పోవడంతో ఇప్పుడు తనకి చాల ఖాళీ సమయం దొరుకుతోంది. ఇంత ఖాళీ సమయాన్ని తను ఎలా
ఉపయోగించుకోవాలో ఆలోచనా తెగటంలేదు .
తను ఇప్పుడు తన పాత అభిరుచులకు మెరుగు
పెడదామన్నా ఇప్పుడు ఈ వయసులో అంత అవసరమా అనిపించడం చాలా సహజం. చాలామంది
పెద్దవాళ్ళు సమాజసేవ అలవాటు చేసుకుంటే సరి అని చాల తేలికగా అనేస్తారు. అలాంటివి
మామూలుగా అంత సులువా. నలుగురికి ఉపయోగపడడం
గోప్పవిషయమే కానీ అంది అందరికీ సాధ్యపడే విషయమా. హౌస్ వైఫ్ అంటే మరీ అంత స్వతంత్రురాలా?
మరి శ్రావణి ఇలా ఆలోచిస్తూంటే అటు శ్రావణి
దృష్టిలో ఎంతో అద్రుష్టవంతురలై న సరళ ఏమాలోచిస్తోందో.
మరి మీరేమంటారు?
21, ఆగస్టు 2013, బుధవారం
భగవద్గీత పారాయణం 12
రచన: వేద వ్యాస
అథ దశమోஉధ్యాయః |
శ్రీభగవానువాచ |
భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః |
యత్తేஉహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా || 1 ||
న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః |
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః || 2 ||
యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ |
అసంమూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే || 3 ||
బుద్ధిర్ఙ్ఞానమసంమోహః క్షమా సత్యం దమః శమః |
సుఖం దుఃఖం భవోஉభావో భయం చాభయమేవ చ || 4 ||
అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోஉయశః |
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః || 5 ||
మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా |
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః || 6 ||
ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః |
సోஉవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః || 7 ||
అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే |
ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః || 8 ||
మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్ |
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ || 9 ||
తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ |
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే || 10 ||
తేషామేవానుకంపార్థమహమఙ్ఞానజం తమః |
నాశయామ్యాత్మభావస్థో ఙ్ఞానదీపేన భాస్వతా || 11 ||
అర్జున ఉవాచ |
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ |
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ || 12 ||
ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా |
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే || 13 ||
సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ |
న హి తే భగవన్వ్యక్తిం విదుర్దేవా న దానవాః || 14 ||
స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ |
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే || 15 ||
వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః |
యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి || 16 ||
కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచింతయన్ |
కేషు కేషు చ భావేషు చింత్యోஉసి భగవన్మయా || 17 ||
విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన |
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేஉమృతమ్ || 18 ||
శ్రీభగవానువాచ |
హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః |
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే || 19 ||
అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః |
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ || 20 ||
ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ |
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ || 21 ||
వేదానాం సామవేదోஉస్మి దేవానామస్మి వాసవః |
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా || 22 ||
రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ |
వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్ || 23 ||
పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ |
సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః || 24 ||
మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ |
యఙ్ఞానాం జపయఙ్ఞోஉస్మి స్థావరాణాం హిమాలయః || 25 ||
అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః |
గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః || 26 ||
ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ |
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్ || 27 ||
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ |
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః || 28 ||
అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ |
పితూణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ || 29 ||
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ |
మృగాణాం చ మృగేంద్రోஉహం వైనతేయశ్చ పక్షిణామ్ || 30 ||
పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ |
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ || 31 ||
సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున |
అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్ || 32 ||
అక్షరాణామకారోஉస్మి ద్వంద్వః సామాసికస్య చ |
అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః || 33 ||
మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్ |
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా || 34 ||
బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ |
మాసానాం మార్గశీర్షోஉహమృతూనాం కుసుమాకరః || 35 ||
ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ |
జయోஉస్మి వ్యవసాయోஉస్మి సత్త్వం సత్త్వవతామహమ్ || 36 ||
వృష్ణీనాం వాసుదేవోஉస్మి పాండవానాం ధనంజయః |
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః || 37 ||
దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ |
మౌనం చైవాస్మి గుహ్యానాం ఙ్ఞానం ఙ్ఞానవతామహమ్ || 38 ||
యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున |
న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్ || 39 ||
నాంతోஉస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప |
ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా || 40 ||
యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా |
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంஉశసంభవమ్ || 41 ||
అథవా బహునైతేన కిం ఙ్ఞాతేన తవార్జున |
విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్ || 42 ||
ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
విభూతియోగో నామ దశమోஉధ్యాయః ||10 ||
16, ఆగస్టు 2013, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)