25, ఆగస్టు 2013, ఆదివారం

హౌస్ వైఫ్



హౌస్ వైఫ్

పక్కింటి సరళ ని చూసినప్పుడల్లా శ్రావణి ఆలోచనలో పడిపోతుంది. హాయిగా 9 కొట్టేసరికల్లా మంచి ఇస్త్రీ చీర కట్టుకుని హ్యాండ్ బాగ్ భుజాన వేసుకుని టిప్పుటాపుగా వాళ్ళాయన సుబ్బారావుతో బండిమీద ఆఫీసుకి వెళ్ళిపోతుంది. నేను వున్నాను చదువుకుని ఎందుకు ఎంతసేపు అంట్లు, పిల్లలు, చాకిరీ. గంజిపెట్టిన చీర కట్టుకోవాలన్నా వందసార్లు ఆలోచించాలి. ఇంట్లోనే వుండే దానికి అవసరమా ఇస్త్రీ పడయిపోతుంది అని. ఒకవేళ బయటికి వెళ్ళినా సరళ అంత హుందాగా పనివుండి వెళ్ళిన ఫీలింగ్ ఏం వుంటుంది అని. కాలక్షేపానికి షాపింగ్ కి వెళ్లినట్టు వుంటుంది . హూ ...     ఏంచేస్తాం ఎంత రాసి పెట్టి వుంటే అంతే ప్రాప్తం అని ...

శ్రావణికి వుద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదు. దానితో ఇంట్లోవాళ్ళు, తను తన వుద్యోగం మీద అంతగా శ్రద్ధ చేయలేదు. శ్రావణి భర్త శ్యాం కూడా ఎందుకోయ్ ఉద్యోగం తో శ్రమ పడటం, హాయిగా ఇంట్లో వుండక అంటాడు . తను కూడా పెద్దగా శ్రద్ధ చెయ్యక పోవడంతో హౌస్ వైఫ్ గా స్తిరపడిపోయింది. వెళితే కాదనే వాళ్ళు లేరు, మానేస్తే వద్దనేవాళ్ళు లేరు . కానీ ఉద్యోగాస్తురాళ్ళను చూస్తే శ్రావణికి కొంచెం లోటనిపిస్తుంది.

నిజమే మరి ఈ రోజుల్లో ఉద్యోగాలు చెయ్యాలి అనుకుంటే చాలా అవకాశాలే వున్నాయి. అందులోను ఒకసారి తీసుకున్న నిర్ణయం ఇంక ఎప్పటికి నచ్చాలని లేదుకదా. ఈ వాళ్ళ కావాలనుకున్నది రేపు వద్దనిపించోచ్చు. అలానే శ్రావణి లాంటి చాలా మంది హౌస్ వైఫ్ ల పరిస్తితీను .

పిల్లల చిన్నప్పుడు వాళ్ళ ఆలన పాలనా ముఖ్యం కనుక శ్రావణి అప్పటికి ఆ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కాలేజీ కి వచ్చిన పిల్లలకి అన్ని టైం కి అవిరిస్తే సరిపోతోంది. పూర్వం లా వాళ్ళ వెంట పరుగెత్తి తినిపించాలి, దగ్గర కూర్చుని హోం వర్క్ చేయించాలి అనే అవసరం వుండక పోవడంతో ఇప్పుడు తనకి చాల ఖాళీ సమయం దొరుకుతోంది. ఇంత ఖాళీ సమయాన్ని తను ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచనా తెగటంలేదు .

తను ఇప్పుడు తన పాత అభిరుచులకు మెరుగు పెడదామన్నా ఇప్పుడు ఈ వయసులో అంత అవసరమా అనిపించడం చాలా సహజం. చాలామంది పెద్దవాళ్ళు సమాజసేవ అలవాటు చేసుకుంటే సరి అని చాల తేలికగా అనేస్తారు. అలాంటివి మామూలుగా అంత సులువా.  నలుగురికి ఉపయోగపడడం గోప్పవిషయమే కానీ అంది అందరికీ సాధ్యపడే విషయమా. హౌస్ వైఫ్ అంటే మరీ అంత స్వతంత్రురాలా?

మరి శ్రావణి ఇలా ఆలోచిస్తూంటే అటు శ్రావణి దృష్టిలో ఎంతో అద్రుష్టవంతురలై న సరళ ఏమాలోచిస్తోందో.

మరి మీరేమంటారు?

4 కామెంట్‌లు: