ఈ పాటే మధురం కదండీ. కానీ రామ వర్మ గారి గానం తో కలిపితే దాని మాధుర్యమే వేరు . ఆయన పాట పాడే విధానంలో ఏంతో భక్తి వుంటుంది . విని చూడండి
రచన: అన్నమాచార్య
రాగం: కాంభోజి రాగం
ఇందరికీ అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి ||
వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి
విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి |
కలికియగు భూకాంత కాగలించిన చేయి
వలవైన కొనగోళ్ళ వాడిచేయి ||
తనివోక బలి చేత దానమడిగిన చేయి
వొనరంగ భూ దాన మొసగు చేయి |
మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి ||
పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి |
తిరువేంకటాచల ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి ||
రచన: అన్నమాచార్య
రాగం: కాంభోజి రాగం
కందువగు మంచి బంగారు చేయి ||
వెలలేని వేదములు వెదికి తెచ్చిన చేయి
విలుకు గుబ్బలి కింద చేర్చు చేయి |
కలికియగు భూకాంత కాగలించిన చేయి
వలవైన కొనగోళ్ళ వాడిచేయి ||
తనివోక బలి చేత దానమడిగిన చేయి
వొనరంగ భూ దాన మొసగు చేయి |
మొనసి జలనిధి యమ్ముమొనకు తెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి ||
పురసతుల మానములు పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డ చేయి |
తిరువేంకటాచల ధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి ||
రామవర్మ గారివి త్యాగరాజ కీర్తనలు ఇంకా బాగుంటాయి, అవి కూడా ఇలా పాట తో సహా పెట్టగలరు.
రిప్లయితొలగించండితప్పకుండా ప్రయత్నిస్తాను.
తొలగించండి