తెలుగుని బ్రతికించు కుందాం -3
తెలుగుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా. ప్రసిధ్ధ శైవ క్షేత్రాలైన కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, కర్నూలుజిల్లా లోని శ్రీశైలం , పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం క్షేత్రాల మధ్య నున్న ప్రాంతాన్ని "త్రిలింగ" ప్రాంతమని పిలిచేవారు.ఈ త్రిలింగ పదం నుండే తెలింగ, తెలుంగు, తెలుగు అనే పదాలు క్రమంగా వచ్చాయి అని అంటారు.
ఈ పదాలు క్రమం మారడం చూస్తే నాకు మా చిన్నప్పటి సంగతి ఒకటి గుర్తుకు వస్తోందండీ . మేము స్కూల్ నుండి ఇంటికి సిటీ బస్సు లో ప్రయాణం చేసేవాళ్ళం . మా ఏరియా బస్సు ఆఖరు స్టాప్ ని అప్పటికి మేము ఎప్పుడూ చూడలేదు. అక్కడికి ఎక్కినవాళ్లు టిక్కెట్టు అడిగే వాళ్ళ నోట్లో వినడమే ఆ పేరు." చీకటి పట్నం" పేరు వింతగా అనిపించేది మాకు.ఈ చీకటి పట్నం ఏమిటో అక్కడ అంత చీకటిగా వుంటుందేమో అనుకునే వాళ్ళం పిల్లలం అందరం. ఒకరోజు మేము మాట్లాడుకుంటుంటే విని ఒక ఆయన చెప్పారు అసలు విషయం . చీకటి పట్నం అసలు పేరు"శ్రీ కృష్ణ పట్నం " అని. అది పలకలేనివాళ్ళు దానిని వాడుకలో పాపం చీకటి పట్నం గా మార్చేశారని. ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది.
అలానే మన "త్రిలింగ దేశం" కూడా వాడుకలో " తెలుగు "గా మరిందన్నమాట . ఒకటి మాత్రం ఆనందం, అది ఏమిటంటే శ్రీ కృష్ణ పట్నం , చీకటి పట్నం గా మారినట్టు మరీ మసిబారిన పేరులోకి మన తెలుగు పేరు దిగనందుకు.
సరే కానీ ఇంతకీ త్రిలింగ కాబట్టి ఇంకొక విషయం ఇందులో వుందండీ ఈ మూడు క్షేత్రాల మధ్య అంతే తెలుగు వారు కృష్ణ, గోదావరి నదులు మధ్య ఉన్న ప్రాంతంలో నివసించేవారని చెప్పొచ్చు. ఇది ఒక వాదన ఐతే ఇంకొకటి కూడా వుంది తెలుగుకు ఆ పేరు రావడానికి ఇంకో కారణం.
తమిళం, గోండీ భాషలలో తెలు, తెలి అంటే తెలుపు లేదా చక్కని అని అర్ధం వుందట , "౦" అంతే బహువచనంట. ఆ విధంగా చూస్తే చక్కని వారు , తెల్లని వారు అనే అర్ధం వచ్చేలా తెలింగ, తెలుంగు అనే పదాలు వచ్చాయని కూడా అంటారుట.
ఈ పదాలకు విలువ ఇచ్చి ఐనా మనం చక్కని(మంచి) వారుగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకోవాలి కదండీ .
శ్రీ శారద విభావరి గారికి పాదాభి వందనము మీ తెలుగును బ్రతికించు కుందాం -3 చాలాబాగున్నది తెలుగు కు ఆ పేరు సార్థకము జేయుటకు మనమందరము కృషి చేయ వలసిన అవసరము చాలా ఉన్నది. ఇంత మంచి విషయములను అందించిన మీకు దన్యవాధములను తెలుపుచూ
రిప్లయితొలగించండివరప్రసాదు
చాలా బాగు౦ది :-)
రిప్లయితొలగించండి