స్నేహం విలువ ఎంత
స్నేహం ఈ పదం విలువ అందరికీ తెలియదని నా అభిప్రాయం. తల్లిదండ్రులతో కూడా మాట్లాడలేని విషయాలు స్నేహితులవద్ద మనసు విప్పి చెప్పోచ్చంటారు . కానీ స్నేహితుడు/రాలు అనుకునే వ్యక్తి కూడా అంత మంచిగా వుంటారనడానికి నమ్మకం ఏమిటి? అందరూ ఆరోగ్యకరమైన ఆలోచనలతోనే వుంటారని ఎవరు చెప్పగలరు? స్నేహితులు అని మనం అనుకున్నట్టు అవతలి వారు వుంటారనటానికి దాఖలాలు లేవుగా. అదే వుంటే స్నేహం పేరుతొ ఈ రోజులలో ఇన్ని మోసాలు వుండవు. మరి ఈ విషయాన్నీ ఎవరు మనకు తెలియపరుస్తారు.
ఒక వేళ ఎవరైనా చాల గోప్యంగా వుంచవలసిన విషయాన్నీ స్నేహితుడు/రాలు అని నమ్మి ఎవరికైనా చెబితే, ఆ హితుడనుకున్న వ్యక్తి ఆ విషయపు గాఢతను గ్రహించలేక దానిని బయటకు వెల్లడి చేస్తే లేదా ............ఈ విషయంలో ఆడపిల్లలు మరీ జాగ్రత్తగా వుండాలంటాను నేను. పిల్లలు , పెద్దలు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి స్నేహం వేరు, స్వవిషయాలు వేరు అని.
తల్లిదండ్రులని భగవంతుడు ఇస్తాడు. కానీ స్నేహితులను మనమే ఎంచుకుంటాం . సరయిన వ్యక్తిని ఎంచుకున్నామా లేదా అనేది ఎప్పటికీ ఖచ్చితంగా చెప్పలేని విషయం. ఒక సినిమాలో డైలాగ్ వుంది. బహుశా మీకు తెలిసే వుంటుంది . "అవకాశాన్ని బట్టి మంచివాడు చెడ్డవాడిగా మారొచ్చు , అవకాశం లేకపోతే చెడ్డవాడు కూడా చేతకాక మంచివాడిగా మిగిలిపోవచ్చు". అవకాశాలను గురించి మనిషి ముందే వూహించడం అంత సాధ్యం కాదు కాబట్టి అందరినీ నమ్మి మన జీవితంలో చెడుని (చేదుని) కొని తెచ్చుకోవడం మంచిది కాదని అందరూ తెలుసుకుని మన జాగ్రత్తలో మనం వుండాలి అనే విషయాన్నీ ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.
ఇప్పుడు పేపర్ల లోను , టీవీ లలోను చాలా మోసాల గురించి చదువుతున్నాము , వింటున్నాము. ఐనా మళ్ళీ మళ్ళీ మోసపోతూనే వున్నాము. నెట్ స్నేహాలతో మోసాల గురించి కూడా అందరికీ తెలిసిన విషయాలే.ఇవి ఎవరనేది తెలియని వారి వల్ల మాత్రమే , తెలిసిన వారైతే పరవాలేదు అనుకోవడం పొరపాటే అవుతుంది. కాబట్టి తెలిసిన వారైనా తెలియని వారైనా మన జాగ్రత్త గురించి మనం కొంచెం శ్రద్ధ తీసుకోవడంలో తప్పులేదు కదా . చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడం కంటే ముందుగా మెలకువగా వుంటే మంచిది కదా.
దీని ఉద్దేశం అందరిని అనుమనించాలని కాదు కానీ మన జాగ్రత్త మనం తీసుకోవాలి.
చాల బాగుంది మీ అనుభవాల సారాంశం. కాని స్నేహం యొక్క స్ఫూర్తిని దెబ్బ తీసేలా ఉంది. ఏవో కొన్ని చిల్లర మల్లర విషయాలని పట్టుకుని కోతి పుండుని బ్రహ్మరాక్షసి చేస్తున్నట్టున్నారు. జాగ్రత్త అందరికి అవసరం.
రిప్లయితొలగించండిప్రసాద్ గారూ, మొగవాళ్ళు కాబట్టి అంత తేలికగా శారద గారిని మాటలన్తున్నారు, ఆవిడ చెప్పేవి ఈ రోజుల్లో సర్వ సాధారణంగా జరుగుతున్నవే కదా. పొద్దున్న లేస్తే పేపర్లో ఎన్ని చూడట్లేదని! శారద గారు, మీరు 100 % కరెక్ట్టు. మీ యుద్ధం కొనసాగించాలని నా ఆకాంక్ష. - కవిత
రిప్లయితొలగించండిథాంక్స్ కవితగారూ నాతో ఏకీభవించినందుకు. ఇవి ఏవో కొన్ని చిల్లర మల్లర విషయాలు కాదు. ప్రతీ వాళ్ళు ఖచితంగా జాగ్రత్త వహించవలసిన విషయమని నా ఉద్దేశం. మీరు కూడా నాకు సాయం రావడం నాకు ఆనందంగా వుంది. మరొక్కసారి థాంక్స్.
తొలగించండి