17, డిసెంబర్ 2012, సోమవారం

షోడసకళానిధికి షోడశోపచారములు

రచన: అన్నమాచార్య


షోడసకళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి ||

అలరు విశ్వాత్మకున కావాహన మిదె సర్వ
నిలయున కాసనము నెమ్మినిదే |
అలగంగా జనకున కర్ఘ్యపాద్యాచమనాలు
జలధి శాయికిని మజ్జనమిదే ||

వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదె
సరి శ్రీమంతునకు భూషణము లివే |
ధరణీధరునకు గంధపుష్ప ధూపములు
తిరమిదె కోటిసూర్యతేజునకు దీపము ||

అమృతమథనునకు నదివో నైవేద్యము
గమి(రవి)జంద్రునేత్రునకు కప్పురవిడెము |
అమరిన శ్రీవేంకటాద్రి మీది దేవునికి
తమితో ప్రదక్షిణాలు దండములు నివిగో ||

2 కామెంట్‌లు:

  1. మంచి మంచి కీర్తనలు ఉన్నాయి మీ బ్లాగ్లో. చాలా బాగుంది మీ బ్లాగ్. అభినందనలండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండి. నేర్చుకోవాడానికి వీలైన కీర్తనలు పోస్ట్ చేస్తున్నాను.

      తొలగించండి