11, మార్చి 2018, ఆదివారం

పుత్రోత్సాహము

డెలివరీ రూమ్ లో డాక్టర్, అమ్మా శారద చాల కష్టపడ్డావు ఇదిగో నీ కొడుకు చూడు అన్నారు. మొదటిసారి పెద్ద పెద్ద కళ్ళు బొద్దుగా ముద్దుగా ఉన్న కొడుకుని చూడగానే రాత్రంతా పురిటి నెప్పులతో పడ్డ కష్టం ఒక్కసారిగా మాయమైపోయిన అనుభూతి . వాడికి 6 నెలలు వయసు లో healthy  baby షో లో prize సంపాదించినా మొదటి పుత్రోత్సాహము.

2 ఏళ్ళు వచాయి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు  మొదలు పెడదాం అని క్రెష్ లో వేసి వస్తుంటే వాడి భయం , మధ్యాహ్నం తీసుకు రావడానికి వెళ్ళే సరికి వాడి ముఖంలో ఆనందం  ఇంకా  గుర్తున్నాయి నాకు .ఇంత చిన్న పిల్లాడిని వదిలేసి ఉద్యోగాలు అవసరమా అనిపించింది.

ఇంతలో 3 1/2 ఏళ్ళు  రానే వచ్చాయి. బడి కి తప్పక పంపాల్సిన వయసు.  LKG లో  చేర్చే మొదటి రోజు నేను నర్సరీ, ప్లే స్కూల్ కి పంపలేదు లెండి ,  ఆ సర్టిఫికేట్ LKG కి అవసరం లేదని.  పిల్లలందరినీ క్లాసు లోకి పంపి  పేరెంట్స్ ని మాత్రం బయట ఒక పక్కన పిల్లలకి కనిపించని ప్లేస్ లో కూర్చోబెట్టారు.  మనకి పిల్లలు అడపా దడపా కనిపిస్తూ వుంటారు. లోపలికి వెళ్ళేప్పుడు school అంటే ఆటలు, పాటలు, ఫ్రెండ్స్ చాలా బాగుంటుందని  చెప్పి చెప్పి ( రెండోసారి (చెప్పి) పొరబాటుగా రాయలేదండి చెప్పి చెప్పి పంపానన్నమాట) పంపడం వల్ల హుషారుగానే లోపలికి వెళ్ళాడు. ఒక అరగంట తరవాత గేమ్స్ పీరియడ్ అని బయటకి తీసుకు వచ్చారు పిల్లలని. అంతే అందరు పేరెంట్స్ ని చూడగానే మొహాలు ఇంత ఇంత చేసుకున్నవాళ్ళు కొంతమంది, బిక్క మొహాలుతో ఏడుపు లంకించు కున్నవాళ్ళు కొంతమంది.  ఇంకా క్లాసు కి వెళితే ఒట్టు.  మొదటి  రోజు school అలా జరిగింది . ఈ లోపే మా వాడు ఒక తిట్టు నేర్చేసుకుని వచ్చి ఇంట్లో ప్రయోగించేసాడు.  దాని ఫలితం మూతి మీద చిన్న దెబ్బ .  అమ్మ చేత్తో అది వాడి మొదటి దెబ్బ. దానితో ఇప్పటికి వాడు పరుషంగా మాట్లాడాడు (ఇంట్లో ఖచితంగా ).

LKG అంతా బాగానే జరిగాకా ఇంక  UKG , అదీ ఫుల్ డే school.  బాక్స్ లో lunch తినాలి . ఇంటికి పంపరు. రోజు వెళ్లి గంట తినిపించడం హడావిడి . ఈ లోపు సెకండ్ pregnancy నెలలు నిండి వెళ్ళలేని పరిస్తితి . నా ఇబ్బందికి పాపం LKG టీచర్ గారు నువ్వు రాకమ్మా నీ కొడుక్కి నేను తినిపిస్తాను అంటూ  వాడికి అన్నం తినిపించేవారు. అప్పుడు  అనిపించింది వాడు చెప్పే రైం chubby cheecks dimple chin............టీచర్స్ pet అని.

ఇంక tenth class exams హడావిడి జాగ్రత్తలు చెపుతుంటే అమ్మ నువ్వు రా అంటూ . నాన్న దింపు తారుగా అన్నా అయినాసరే ఇద్దరు రండి అంటూ.  ఇద్దరం వెళ్లి ఏదో exam మేమే రాస్తున్నట్టు exam అయ్యేదాకా center దగ్గరే ఉండి వాడు బయటికి వచ్చి బాగా రాసాను అన్నాకా ఊపిరి పీల్చుకుని tenth మొదటి exam అలాగా. తరువాత second exam నుండి వాడే వెళ్ళా డనుకోండి.

ఇంటర్ గడిచింది డిగ్రీలో జాయిన్ అయ్యాడు. వాడు ఇంటర్ లో మాకు తెలియకుండా చేసిన పని మాకు అప్పటికి తెలియలేదని వాడి కడుపునొప్పి. ఏమిటా అనుకుంటున్నారు కదా చెపుతాను వుండండి .హాలిడే ట్రిప్ కి వెళ్ళాము ముంబై జుహు బీచ్ లో మా అమ్మాయి మావారు sea water లో దూరంగా ఆడుకొంటున్నారు మా వాడు నేను ఇసుకలో కూర్చుని కబుర్లు చెప్పు కొంటున్నాము . అమ్మ నీకో విషయం చెప్పాలి నువ్వు తిట్టకు అంటూ మొదలెట్టాడు. ఏం కొంప ముంచాడో అని కంగారు పడుతుంటే ఇంటర్ లో collage బంద్ రోజు నేను మీకు చెప్పకుండా ఫ్రెండ్స్ తో మూవీ కి వెళ్ళాను అన్నాడు .హమ్మయ్య అని మనసులో అనుకుని పైకి మాత్రం కొంచెం కోపం చూపించి ఎన్నిసార్లు అన్నాను వాడు కొంచెం బెరుకుగా ఒక్కసారే అమ్మా అన్నాడు. డబ్బులు ఎక్కడివి అన్నాను మీరు emergency కి ఇచ్చిన  డబ్బులు  అన్నాడు.  సరే ఇంకెప్పుడు చెప్పకుండా వెళ్ళకు అన్నాను .  ఇంత easyగా తీసుకుంటావని అనుకోలెదమ్మ నువ్వు అంటూ ఆనందపడిపోయాడు. తప్పు అనిపించినదానికి వాడి గిల్టీ వాడికి వున్నందుకు  పరవాలేదు  మంచి  దారిలోనే  వున్నాడు  అనుకున్నాను.

ఇంతకీ ఎందుకు చెపుతున్నాను ఇందులో పుత్రోత్సాహము ఏమిటి అనుకొంటున్నారు కదా. అమ్మకి పిల్లలతో ప్రతి క్షణం పుత్రోత్సాహమే కదండీ. ఆడపిల్ల అయితే ఏమిటి అనకండి దానిని ఏమంటారో నాకు తెలియదు కానీ word తెలియకపోయినా ఆడపిల్ల తో కూడా ప్రతి క్షణం ఆనందమే , ఉత్సాహమే,  అపురూపమే.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఈ రోజు మా వాడు campus  లో select అయిన job(training) కి మొదటి రోజు .  పాపం  పొద్దున్నే 6 గంటలకి వెళ్ళాడు ఇంట్లోంచి ఒక అరగంట బండిమీద metro station కి వెళ్లి అక్కడ నుండి ఒక గంట metro train లో ప్రయాణం చేసి అక్కడ నుండి cab లో ఒక 45 నిమిషాలు ప్రయాణం చేసి office కి వెళ్ళాడు. పాపం రోజంతా ఏం తిన్నాడో ఏమో రాత్రి  9 అయ్యింది ఇంకా రాలేదు అని  ఎదురు చూస్తుండగా 9.30 కి చేరాడు ఇంటికి . ఇంచుమించు వాళ్ళ నాన్న ఎత్తుకుని లోపలి తీసుకు వచ్చారా అన్నంత అలసటగా.  వస్తూనే బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోతూ కూర్చోలేను నాన్న పడుకుంటాను అంటూ. భోజనం రా అంటుంటే అమ్మా తినిపించు అంటూ బెడ్ మీద కూర్చుండిపోయాడు.  అటు అమ్మమ్మ, తాతగారు. ఇటు మామ్మ కాల్ చేసి ఎలా వుంది ఆఫీస్ అంటే మా వారు వాళ్ళ అమ్మ తినిపించేలా వుంది అని నవ్వారు. 

అమ్మకి  పుత్రోత్సాహము  అదే కదండీ. పిల్లలు యెంత పెద్దవాళ్ళు  అయినా అమ్మ తినిపించవూ అంటే ఆనందం కదా . ఇదన్న మాట పుత్రోత్సాహము. మీరు ఒప్పుకొంటారు కదా.


5 కామెంట్‌లు:

  1. మీ బాబుకు నా హృదయపూర్వక అభినందనలు. మీకు ప్రత్యేక శుభాభినందనలు. పిల్లలు జీవితంలో పైకి వచ్చి సుఖంగా క్షేమంగా, మంచి పేరు తెచ్చుకుని అందరూ మెచ్చుకోవటమే కదండి మనకు కావాల్సింది. ఉజ్వల భవిష్యత్తు తప్పకుండా సాధిస్తాడు. మరి నా స్వీట్సో.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు సుజాత గారు . ఒక్క sweet ఏమిటండి భోజనానికి రండి.

      తొలగించండి
  2. నిస్సందేహంగా పుత్రోత్సాహమే బిడ్డ ఆడ అయినా, మగ అయినా.

    రిప్లయితొలగించండి
  3. మీ పుత్రోత్సాహం గురించి కొంచెం ఆలస్యంగా చదివినట్లున్నాను. ప్రతిఅక్షరం లోనూ మీ ఆనందం తొణికిసలాడుతూ అన్నీ రసగుల్లాలాగా అనిపించాయి. పుత్రోత్సాహానికి మించినది లేదు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని పసిపిల్లవాడిగా ఉన్నప్పుడూ వాడే తనబిడ్డకు పెళ్ళిచేస్తున్నప్పూడూ కూడా తల్లికి పుత్రోత్సాహం అంతే అబ్బురంగా ఉంటుంది. మీకూ మీ పిల్లలకూ శుభాకాంక్షలు - అన్నట్లు మీవారిక్కూడా బోలెడు శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి