8, ఫిబ్రవరి 2019, శుక్రవారం

కాలక్షేపం

 కాలక్షేపం



చాల రోజులయ్యిందండి బ్లాగ్ రాసి, దాదాపు ఏడాది ఐపోతోంది. ఈ ఏడాది ఎలా ఇపొయిందో తెలియనంత త్వరగా ఐపోయింది నాకైతే. ఈ ఏడాది మాత్రమే కాదు లెండి నా లైఫ్ అంతా  ఇప్పటిదాకా ఎలా ఇపొయిందో తెలియనంత  స్పీడ్ గా ఐపోయింది.  ఇంకా స్కూల్ కి వెళ్లే రోజులు, కాలేజ్  రోజులు, అలా దొర్లిపోయి పెళ్లి, పిల్లలు, వాళ్ళు ఎదగడం అన్ని స్పీడ్ స్పీడ్ గా  ఐపోతున్నాయి. ఏమిటో కాలం పరుగెడుతోంది, అందరికీనా లేక నాకేనా. యెంత తొందరగా కాలం పరుగెత్తినా ఎక్కడో ఏదో తోచటం లేదు అనే మాట మాత్రం పోవటం  లెదు. అది కూడా నా  ఒక్కత్తికే ఉంటుందేమో. పూర్వం అమ్మమ్మ, అమ్మ ఉద్యోగాలు చెయ్యలేదు ఐనా వాళ్ళకి ఎప్పుడు తోచటం లేదు అనే మాటే లేదు. ఇప్పుడు అక్కర్లేని కాలక్షేపాలు ఎన్ని ఉన్న ఈ తోచక పోవటం ఏమిటో.  ఎంతసేపు చేస్తాము పని అనిపిస్తుంది ఒక్కోసారి.  ఇంకోసారి యెంత చేసిన తెమలేదేం అనిపిస్తుంది.  TV  చూసినా ఎంత  ఎంతసేపు చూస్తాము.  నాలాంటి  వాళ్ళకి అసలే అవ్వదు. ఒక సీరియల్ చూసే అలవాటు లేదు పోనీ అలవాటు చేసుకుందామా అన్నా నచ్చదు. ఇంతకూ ముందు వంటల ప్రోగ్రాంలు, చేసిచూద్దాం ప్రోగ్రాంలు చూసి అవి ఇవి తగలేసేదాన్ని. ఇప్పుడు ఆ సరదాలు ఐపోయాయి. కొత్తగా యూ ట్యూబ్, దాన్ని ఉద్దరించేసా చాల వరకు. అది కూడా బోర్ కొట్టేసింది మరి.  ఇంకా ఏం చెయ్యాలో టైం గడవడానికి అని వెతికే పని మళ్ళి మొదలు. ఆ మధ్య ఒక షార్ట్ ఫిలిం చూసాను యంగ్ మదర్ అంటే 40 to 50 ఇయర్స్ కె పిల్లలు పెద్ద ఐపోయిన తల్లుల ఇబ్బందులు. వీళ్ళు కొత్తగా కెరియర్ స్టార్ట్ చెయ్యలేరు, ఇంట్లో వీళ్ళమీద ఆధార పడే పిల్లలు ఉండరు, అంటే వండడం వరకే వీళ్ళ పని. వీళ్ళకి వేరే ముఖ్యమైన ఆలోచనలకి కూడా అంతగా ఆస్కారం లేని టైం. ఎందుకంటె ట్రెండ్ కి తగ్గ ఆలోచనలు చేసే వయసు దాటి పోతూ తరవాతి తరాన్ని మోటివేట్  చేసే అవగాహనా తగ్గిపోయే ఏజ్ maybe . నిజమో కాదో తెలియదు కానీ అమ్మకి ఏం తెలుసు వీటి గురించి అని పిల్లలకి అనిపించే వయసు అని నా ఉద్దేశం.  ఇంకా ఏం  ప్రయోజనం అని మనమే ఆగిపోవాలి అని నాకు అనిపిస్తుంది. అన్ని పనులు మనమే చేసుకున్నా నాకు టైం ఎందుకు గడవదు అనేది పెద్ద ప్రశ్నయే.  మీకు తెలిస్తే కొంచెం చెప్పరూ, నేర్చుకుంటాను.

1 కామెంట్‌:

  1. చాలా బాగా రాసారు, నాది అదే ఇబ్బంది.40 దాటాక job కి వెళ్లలేము,ఖాళీగా వుండలేము.
    ఏమి తోచకుండా ఉంది. అది ఇన్ని పుస్తకాలు,బ్లాగు లు చదువుతూ కూడా😊

    రిప్లయితొలగించండి