27, అక్టోబర్ 2016, గురువారం

ఆడది

 ఆడది

      ఆడపిల్లకు అసలు నిజంగా సొంతం అని ఎవరున్నట్టు?  అమ్మ నాన్నల దగ్గర మారం చేస్తే ఆడపిల్లవి ఏమిటా మారం అని పట్టించుకోరు. అమ్మ నాకూ  సైకిల్ కావాలి కోనవూ అని అంటే నీకేందుకు ఆడపిల్లవి అనేస్తుంది అమ్మ. అన్నని ఏదన్నా అడిగితే తన పనులు తనవంటాడు . పెళ్ళితో బాధ్యత తీర్చుకుంటాడు తండ్రి.

     ప్రేమించి / పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న భర్త చేయి పట్టుకోగానే నీ తరువాతే అన్నీఅని (మచ్చిక చేసుకోడానికి) మన ఇంట్లో చెప్పిన కబుర్లు అతని ఇంటికి తీసుకెళ్ళ గానే అమ్మ చెప్పింది చెయ్యి అనో , అక్కకు నచ్చినట్లు ఉండు అనో రెండో స్థానంలో నించో బెడతాయి .

     ఇంక పిల్లలు పుట్టకా చెప్పనే అవసరం లేదు. ఏనాటికైనా వీళ్ళకు నా తరువాతే అని మొదట అనిపించినా వారి అవసరాలతో ఆడదాని కాలం, జీవితం కరిగిపోతాయి. కొడుకు హయాముకు వచ్చేసరికి రెండో స్థానం నుండి జారి ఆఖరికి చివరి స్థానం ఐనా దక్కుతుందో లేదో చెప్పలేని ఆడ బ్రతుకుకు ఎవరు ఆసరా? ఎవరు ఆలంబన?

    వీటన్నింటి మధ్య చిన్నచిన్న ఆనందాల రూపంలో చిరుజల్లులు కురిసినట్టే కురిసి మాయమయ్యే ఆడదాని జీవితానికి ఎవరి నీడ సొంతం? ఎవరి ఆత్మీయత నిజం?

ఇప్పటి రోజులలో మీకు చదువులు , సంపాదనలు వున్నాయిగా అనేవారు వున్నారు. ఎన్ని చదువులు వున్నా , సంపాదనలు వున్నా పక్కన నిజమైన తోడూ నీడ వుండడం అవసరం .స్వతంత్రం వేరు స్వాంతన వేరు . ఆ తోడు ఎవరిది ?  ఆనీడ ఏది ?


5 కామెంట్‌లు:

  1. ఆడదె ఆధారం మనకథ ఆడనె ఆరంభం అన్నారండి మా మిత్రులు ఆకెళ్ళ :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అందరు అది గుర్తించాలి కదా బాబయ్యగారు అందరు పిన్నిగారిలా అదృష్టవంతులు అవ్వాలని ఆసిస్తూ .

      తొలగించండి
  2. మీరు చెప్పిన దాంట్లోనే ఒక వ్యతిరేకత ఉంది. "అమ్మ చెప్పింది చెయ్యి అనో , అక్కకు నచ్చినట్లు ఉండు అనో రెండో స్థానంలో"; అంటే, అమ్మ కి మొదటి స్థానం ఇవ్వాలి అని మీరే అంటారు, మీరే అమ్మ అయ్యాక, మళ్ళీ రెండో స్థానం అంటున్నారు.ఇది ఒక జీవిత చక్రం. అత్తా ఒక కోడలే అన్నట్లు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహహాహ ఐతే అత్త అయ్యేక అవకాసం వస్తుందనుకోమంటారా . అక్కడ కూడా ప్లేస్ దొరుకుతుందో లేదో తెలియదు కదండీ.

      తొలగించండి
  3. శర్మ గారు చెప్పినట్లు ఆడదే ఆధారం కదండీ, పైన మీరు రాసిన అన్ని సందర్భాలలో ఆడదే ఉన్నది కదా, ఒక కూతురు,అక్క,పెళ్ళాం,అమ్మ,అత్త ఇలా. అందరికి ఆడదే ఆలంబన, అందరూ ఆ ఆడదానికే ఆలంబన. మీరు ఇలా నెగటివ్ గ ఆలోచించడం బాలేదు.

    రిప్లయితొలగించండి