చెప్పాలని వుంది నీకు చాలా చెప్పాలని వుంది
నీతో గడిపే ప్రతిక్షణం నా జీవిత మధురిమని
నీతోడే నా ఆనందాల వెల్లువని
నీ చెలిమే నా గరిమ అని
చెప్పాలని వుంది నీకు చెప్పాలని వుంది!!
నాపై నిలిచే నీ చూపే నా చిరకాల వాంఛ అని
నీ నోటి మాటే నా జీవిత మకరందమని
నీ చేతి స్పర్శే నా జన్మకు ధన్యమని
నీ అభిమానమే నా జీవిత లక్ష్యమని
చెప్పాలని వుంది నీకు చెప్పాలని వుంది!!
నీతో వేసే ప్రతి అడుగు నా గమ్యానికి చేరువని
నీతో పలికే ప్రతి మాట నా ప్రగతికి మెట్టు అని
నీతో ఆడే ప్రతి ఆట నా ఆనందానికి ఆసరా అని
నీతో నిండిన జీవితమే నా జన్మకు పరమార్ధమని
చెప్పాలని వుంది నీకు చెప్పాలని వుంది!!
"చెప్పాలని వుంది" అని చాల బాగా చెప్పారు, మీలో ఇంత కవి హృదయం కూడా ఉందని ఇప్పుడే తెలిసింది!
రిప్లయితొలగించండిధన్యవాదాలు శ్రీ రామ ప్రసాద్ గారు..
తొలగించండిచాలా బాగుందండి, మీ జీవిత భాగస్వామి కి మంచి కవితా బహుమతి.
రిప్లయితొలగించండిధన్యవాదాలు సుజాత గారు.
తొలగించండి