మీరు పాత కొత్తల మేళవింపు గురించి విని వుంటారు కదా . ఎప్పుడైనా డైరెక్ట్ గా చూసారా . ఏమిటి చాల రోజుల తరువాత కాదు కాదు చాల ఏళ్ళ తరువాత వచ్చి ఇలా ఏమిటేమిటో అడుగుతోంది తల తోక లేకుండా అనుకుంటున్నారా .. కాసేపు ఆలోచించండి చూసారో లేదో . ఎందుకంటె మేము మొన్న దసరా సెలవలకి మా ఊరు వెళ్ళినప్పుడు ఒక పెద్దాయన్ని చూడడానికి అనపర్తి వెళ్ళాము . ఆయన మీ అందరికి కూడా పరిచయమే లెండి మీ అందరికి అంటే బ్లాగ్ లు చదివే వారందరికి అని సుమండీ .
ఇంటిముందు గేటు తీసేసరికి చక్కగా అరటి మొక్కలు, కనకాంబరాలు, మామిడి చెట్టు, మల్లె తీగ ఇలా అన్ని మొక్కలు స్వాగతం పలికాయి . ఎదురుగా పెద్దావిడా (పార్వతిదేవి అంటే బాగుంటుందేమో )ఎవరికో అరటి ఆకులు ఇస్తూ మమ్మల్ని చూసి ఎవరబ్బా ఎక్కడ చూసినవాళ్ళలా లేరే అనుకుంటూ ఉండగానే మేము హైదరాబాదు నుండి వచ్చాము సర్ వున్నారా అండి అని అడిగాము. ఆవిడ లోపలి తీసుకు వెళ్లారు మీకోసం ఎవరో వచ్చారు అంటూ .
చక్కగా కచ్చాపోసిన పంచెకట్టు ముఖాన విభూది రేఖలు , వాటి మధ్యన కుంకుమ బొట్టు. అప్పుడే భోజనం ముగించుకుని ఒక్కపొడి నములుతున్న 6 అడుగుల 70వ పడిలో పడిన మనిషిని చూసి మేము ఫలానా మిమ్మల్ని చూడాలని వచ్చాము అని మావారు తన పేరు ఊరు పరిచయం చేసుకున్నారు . ఆ పరిచయం తో మావారిని పెద్దాయన పరిష్వంగం తో సత్కారం చేసారు . ముఖం తెలియక పోయినా ఆ సత్కారానికి మా వారు తెగ సంబరపడిపోయారు. ఆయన ఆనందాన్ని నేను పంచుకున్నాను అనుకోండి .
ఇంతకీ మొదలు పెట్టిన విషయానికి దీనికి ఏమిటా సంబంధం అనుకుంటున్నారు కదా . వస్తున్నానండి అక్కడికే వస్తున్నా .ఇంతకీ ఆ పెద్దాయన వేషధారణ గురించి చెప్పానుకదా ఆయన వయసుకు భోజనం తరువాత ఏంచేస్తారు కాసేపు పడుకుంటారు అనుకుంటాము మనం కానీ ఆయన ఈ నాటి కంపూటర్లు మాకేం గొప్పకాదు అనేలా కంప్యూటర్ లో తెలియని విషయం లేదు . పూర్వకాలంలాగా అంటే మరీ 60 లు 70 లు లోలా కాదు 80 లో లా లెండి మోడల్ ఇల్లు వంటగది వేరు భోజనాల గది వేరు డైనింగ్ టేబుల్ వుందండోయ్. అలానే పెద్దగ హాలంతా నిండిపోయే టీవీ కాదు కానీ చక్కగా ఎవరి పడక గదుల్లో వాళ్ళకి చిన్న టీవీలు . పెరటిలో చక్కని మొక్కలు ఇంట్లో ACలు , అలానే మీకు నీళ్ళకు కాగులు వాడేవారు గుర్తుందోలేదో మా అమ్మమ్మగారి ఇంట్లో మా మామ్మగారి ఇంట్లో ఉండేవి లెండి పెద్ద ఇత్తడి బిందెతో కట్టెలపొయ్య మీద వేడి నీళ్ళు కాస్తారు దానిని కాగు అంటాము మేము.పెరటిలో కాగు తో నీళ్ళు కచుకోడానికికట్టెల పొయ్యి ఇప్పుడు చెప్పేది మరీ వింత గొప్ప కూడానండోయ్ మీరు ఊర్హించలేరు పాతకాలం వాళ్ళు అందులోను పల్లెటూరి వాళ్ళు దానిగురించి ఆలోచిస్తారని చెప్పేస్తున్నా మరి సోలార్ పవర్ సప్లై. అది చూసి నేను చాల ఆశ్చర్యపోయాను సుమండీ.
సిటీ లో వాళ్ళే దాని గురించి ఆలోచించడం చాల అరుదు కదా . అలాంటిది చిన్న ఊరిలో ఆ సోలార్ వాడకం నాకు చాల కొత్తగా అనిపించింది . అప్పుడు అనిపించింది ఆ పెద్దాయన కు అన్నింటిమీదా పట్టు వుంది కనుకనే ఇన్ని పోస్ట్లు, బ్లాగ్స్ లో అన్ని కంమెంట్లు అంతమంది ఫాల్లోవర్స్ అని . ఆయన అనుభవం ఆధ్యాత్మికం ఆసక్తి ఎప్పుడు కాలంతో పాటు నడుస్తూ ఉంటాయని అర్ధమయ్యాక ఆయనమీద అభిమానం మావారికి నాకు చాల పెరిగిపోయయనుకోండి .
అన్నట్టు ఇంకో విషయం కూడా చెప్పాలి, ఇంట్లో ఆయన భార్య కొడుకు కోడలు ఒక మనవరాలు వున్నారు . చిన్న ఊరులో ఆడపిల్లని పెంచడం అంటే ఇక్కడ వంచిన తల బడిలోనూ, బడిలోవంచిన తల ఇంట్లోను ఎత్తేలా పెంచుతారు కదా. అందులోను తాతగారు మామ్మగారు వున్నా ఇంట్లో ఆడపిల్ల అంటే ఇంకా కట్టుబాట్లు ఎక్కువ వుంటాయి కదా, ఇంతకీ విషయమా ఏంటంటే ఆ మనవరాలు నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్ అంటే ఆశ్చర్యంగా లేదు మీకు.
పాత ఆచారాలను ఒక చేతిలో పట్టుకుని, కొత్త ఆలోచనలను మేళ విన్చుకుంటూ, తన తరువాతి తరానికి ప్రతి విషయాన్నీ విపులంగా వివరిస్తూ, వాటిలోని మంచి చెడులను ఎంచుకోగలిగిన ఆలోచనలను వారిలో పెంపొందిస్తు ముందుకు నడిపిస్తూ, ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా దేశవిదేశాలలోని పాఠకులకు కూడా ఆ విజ్ఞానాన్ని పంచుతూ, వారికి వున్న సమయాన్ని అందరికి ఉపయోగపడేలా వినియోగిస్తున్నారంటే చాల ఆనందంగా వుంది కదూ . రేపు కాదు కాదు ఇప్పటినుండైనా మనం ఎలా ప్రవర్తిస్తే నలుగురికి మన నుంచి మంచి అందే అవకాశం ఎలా వుంటుందో మనకు తెలుస్తుంది ఇలాంటివారి సావాసం వల్ల. వారికి నా నమోవాకాలు.
అవాక్కయ్యాను :) ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమీకే ధన్యవాదాలు తెలియచేయాలి, దాదాపు సంవత్సరం నుండి స్తబ్దుగా ఉన్న నా బ్లాగ్ ని పునఃప్రారంభించడానికి మీరే స్ఫూర్తి..˄˄..
తొలగించండిఓహ్, అయితే శర్మ గారు ఈ మధ్య తన బ్లాగులో వ్రాసినది మీ దంపతుల గురించేనన్నమాట. వారి ఊరుకి వెళ్ళి శర్మ గారిని, వారి కుటుంబాన్ని కలుసుకుని రావడం చాలా మంచి పని చేసారు. అటువంటి పెద్దవారి పరిచయం దొరకడం అదృష్టం.
రిప్లయితొలగించండినిజమేనండి ఆ అదృష్టం అందుకున్నది మేమే. ఆ అవకాశానికి ప్రోద్బలం మాత్రం మావారే.
రిప్లయితొలగించండినిజంగానే మీరు అదృష్టవంతులు, మీ జంటకి ఇద్దరికీ ఒకే రకం అభిరుచి ఉండడం ముదావహం. అందుకోండి మా నెనర్లు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు సుజాత గారు.
తొలగించండిబాగుందండి, పాతంతా రోతా కాదు, కోత్తంతా గొప్ప కాదు.
రిప్లయితొలగించండిఒకరొనొకరు అవగాహన చేసుకున్న భార్యా భర్తలు ఒకే మాట మీద ఉండడం సహజం కాని ఒకే అభిరుచితో ఉండడం అరుదు,ఇదీ గొప్ప విషయం
తొలగించండి_/\/\_ మీ లాంటి పెద్దల ఆశీర్వాదం.
తొలగించండిధన్యవాదాలు.
తొలగించండి