22, మే 2017, సోమవారం

పెళ్లి రోజు కానుక (Surprise)

ఎంతైనా మీరు మరీ తెలివైన వారు కదా surprise అని చెప్పి ఓ  అరతులం బంగారం తో సరిపెట్టేసారు పెళ్లిరోజు gift అని దెప్పడం నా వంతు అయ్యింది కాని మా వారు ఒక చిన్న చిరుమందహసంతో సరిపెట్టేసరికి మూతి తిప్పడం తప్ప ఇంకేమి అనలేకపోయాను . మొదటి నుంచి మా వారు ఇంతే. మొదటిలో చిన్న పిల్లనేమో చేతిలో కొత్త వస్తువు రావడమే అపురూపం అనిపించేది. దానిలో అది చిన్నదో పెద్దదో ఉపయోగ పదేదో కాదో  తెలుసుకునే వయసు లేదు. మా బావ నాకోసం తెచ్చాడు వరకే తెలుసు మరి . పెద్దవి కొన్న రోజులు వున్నాయనుకోండి . అవి surprise లు కావు . మా వారు surprise అన్నారో ఆ time నాకు పెద్ద gift రాదని అర్ధం అన్నమాట. సరే ఏం చేస్తాం ఎలాను తిరుపతి కూడా తీసుకువెళ్లటం లేదు కనీసం ఉదయాన్నే గుడికైనా పెందరాలే తీసుకువెళ్ళండి అని last మాట మనదైతే వుండే satisfaction కోసం దేప్పినట్టు నటించి ఊరుకున్నాను.

మొత్తానికి మావారి gift కే సరిపెట్టుకుని గుడికి వెళ్లి అటునుంచి అటు బయట tiffin కానిచ్చి తిరిగి వస్తుంటే ఫోన్ ring అయ్యింది. ఎవరా అని చూస్తె police station నుంచి . ఇదేంటి పోలీసులు హడావిడి అనుకొంటున్నారా వుండండి వస్తున్నాను. మొన్న January లో హ్యాండ్ బాగ్ పాయిందని complaint చేసింది మీరేకదా  దొంగ దొరికాడు ఇంకా పూర్తిగా అతని దొంగతనం ఒప్పుకోలేదు ఒప్పుకోగానే కాల్ చేస్తాము station కి రండి అని. మాకు చాల ఆశ్చర్యం అనిపించింది.  ఎప్పుడో నాలుగు నెలల క్రితం ఒక functionలో నా హ్యాండ్ బాగ్ పోయింది . పోయింది కాదు లెండి నా అజాగ్రత్త  అనే చెప్పాలి. కింద గ్రౌండ్ ఫ్లౌర్ లో బాగ్ పెట్టి ఫస్ట్ ఫ్లోర్ లో lunch చెయ్యడానికి వెళ్ళాను. అందరు పెట్టారు నేనోక్కత్తినే కాదుకదా అనే ధైర్యం తో కాని అందరి బాగ్ లు వున్నాయి ఏదో నాలాంటి ఒకల్లిద్దరివి తప్ప అందులోను మన దానిలో విలువలు ఎక్కువవి పోయాయి. స్మార్ట్ ఫోన్ ఒకటి, పాతిక వేలు డబ్బులు, కార్డు లు వగైరా వగైరా.  బాగ్ పోవడం ఒక వంతు ఐతే అది మా గురువుగారి పుట్టిన రోజు function కావడం ఒకఎత్తు. sentimental గా చాల బాధ వేసే వెషయం ఇపోయింది . ఇంకేం దొరుకుతుంది లే అని అనుకొంటున్నా సమయంలో అక్కడ పరిచయమైన రిటైర్డ్ police ఆఫీసర్ ఒకరు కంప్లైంట్ ఇవ్వండి వదిలేస్తే ఎలా అనగా పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చేసినా అది దొరుతుందన్న నమ్మకం ఐతే మాలో లేదు.

పోలీసులు రావడం అక్కడి CC కెమెరాలలో రికార్డు ఇనవి చూడడం క్లారిటీ లేదు సో ట్రై చేస్తాముఅని చెప్పడం జరిగింది. మా వారి classmate ఒకరు police ఆఫీసర్ ఆయనకూడా అంత easy కాదురా CC Tv footages కూడా సరిగా లేవుకదా సో దొరకడం కష్టమే కానీ ఒకసారి నేను కనుక్కుంటాను అన్నారు కానీ నమ్మకంగా చెప్పలేను అని అన్నారు. ఇంకా ఆయన అలా అనేసరికి ఇంకేం విసిగిస్తాములే పోలీసులను అని మేము కూడా దొరికిందా అని అడిగిన పాపానకూడా పోలేదు .

ఇక్కడ మీకో విషయం చెప్పెతీరాలి మరి పోగొట్టిన బాగ్ చాల విలువై నదే అన్నానుకదా  అన్ని పోగొట్టినా మావారు మాత్రం పాపం నన్ను ఒక్క మాట కూడా అనలేదనుకోండి . ఏం అనలేకపోయారో లేక ఎప్పుడు ఏమి పోగొట్టలేదు ఇదే ఫస్ట్ time అని ఊరుకున్నారో కాని అన్ని బాగ్ లో పెట్టుకుని తిరగోచ్చా అని ఒక సారి మాత్రం చిన్నగా అని ఊరుకున్నారు . పాపం నన్ను అనలేరు కూడా ఆయన  ఇది ఒప్పుకుని తీరాల్సిన విషయం నేను.

 ఈ మర్చిపోయిన విషయం మీద కాల్ రావడం అంటే చాల వింతగా అనిపించింది నాకు మా వారికి . సరే రమ్మన్నారుకదా అని వెళ్ళాము ఇంతకీ ఆ దొంగతనం అతనే చేసానని ఒప్పుకున్నాడుట . వాళ్ళ బంధువులతో మా డబ్బు మాకు ఇప్పించారు Hyderabad పోలీసులు .ఇలా పోయిన డబ్బు తిరిగి వస్తుందా అనే ఆలోచనలలోనుంచి తెలుకోడానికి కొంచెం time పట్టిందనుకోండి . పోలీసులకు థాంక్స్ చెప్పి స్వీట్ కొని విష్ చేసి వచ్చాము .

గురువుగారి పుట్టిన రోజున పోయిన డబ్బులు తిరిగి నాకు పెల్లిరోజుకు gift గా ఇచ్చారు అన్నమాట మొత్తానికి మా పెళ్లిరోజు gift అలా భారీగా ( మా వారు తక్కువలో తెల్చేసినా ) అందినందుకు అందులోను గురువుగారి పుట్టినరోజున పోయింది అనే బాధను చెరిపేస్తూ పెళ్ళి రోజుకు కానుకగా అందినందుకు చాల ఆనందం లో ములిగి పోవడం జరిగింది.


8 కామెంట్‌లు:

  1. ముందుగా మీ పెళ్ళిరోజు శుభాకాంక్షలు, మీ గురువు గారి దయ, ఆ దేవుడి దయ మీకు పుష్కలంగా ఉన్నాయి, అలాగే ఉండాలని నా ఆకాంక్ష. చాలా బాగా రాసారు. మీరు కథలు అవి రాస్తారా? లేకపోతే మొదలు పెట్టండి. మీ శైలి natural గ ఉంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. thank u శ్రీ రామ ప్రసాద్ గారు , కధలు రాసేంత ధైర్యం ఇంకా చెయ్యలేదండీ .

      తొలగించండి
  2. పెళ్లిరోజు శుభాకాంక్షలు మీకు! బావుంది మీ బ్లాగు.

    రిప్లయితొలగించండి
  3. పెళ్ళిరోజు శుభకామనలు.
    పోయినవి దొరకడం గొప్ప,వింత కూడా,నేటి రోజుల్లో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు బాబయ్యగారు. ఏదో మీలాంటి పెద్దల ఆశీర్వాదం ఆ దేవుడి దయ కలిసి రాబట్టి పోయినవి దొరికాయి.

      తొలగించండి
  4. లేట్ గా, పెళ్లిరోజు శుభాకాంక్షలు మీకు! శర్మ గారు చెప్పినట్లు ఈ రోజుల్లో పోయినవి దొరకడం గొప్పే. దానికి కూడా శుభాకాంక్షలు, ఇంతకీ మీ వారిని (బావ అనే అంటారా?) పొగిడార, దేప్పారా? బ్లాగు రాస్తూ ఉండండి.:))

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు సుజాతగారు . బావ అనే అంటానండి blog ముందు మావారు చదివి శభాష్ అన్నారు ఇప్పుడు మీరు అనుమానం కలిగించారు ఇది అన్యాయం అండి.

      తొలగించండి