14, మే 2017, ఆదివారం

స్నేహం

           మొన్న మే ఒకటవ తేదీన మా స్కూల్ get-to-gather జరిగిందండి . దాదాపు 26 సంవత్సరాలు తరవాత కలిసాము అందరమూ .  మాది girls high school లెండి . పాతికేళ్ళ క్రితం ఆడపిల్లలకి ఇప్పటి పిల్లలలా ఫోన్లు గట్రా లేవుకదా పరిచయాలు నిలబెట్టుకోవడానికి.  వున్నా ఊళ్లోనే వుండే అవకాశాలు కూడా తక్కువ . పెళ్ళిళ్ళు అయ్యి భర్తలతో అత్తవారి ఇళ్లకో ,  ఉద్యోగ రీత్యా వేరే వేరే ఊర్లకో వెళ్లి వున్తున్నవాళ్ళమే ఎక్కువ కదా. ఒక వేళ స్నేహాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయం తో ఉత్తరాలు ద్వార కొన్నాళ్ళు సంబంధాలు కొనసాగించినా తరవాత తరవాత సంసారం బాధ్యతలు పిల్లలు హడావిడులు అంటూ అవీ ఆగిపోయి చాల కాలమే అయ్యింది అందరికి.

       ఒక అమ్మాయి చొరవ వల్ల  ఎట్టకేలకు 26 సంవత్సరాల తరవాత అందరమూ కలవ గలిగాము. కలిసామే కానీ మాలో చాల మందికి చాల మందికి కాదేమో దాదాపు అందరికి  ఒకరో ఇద్దరో తప్ప ఎవరికి ఎవరు గుర్తులేము. ముఖాలు ఎక్కడో గుర్తొస్తున్నాయి కానీ పేర్లు తెలియవు.  మళ్ళి మళ్ళి కొత్త కొత్త గా పరిచయాలు చేసుకున్నా చిన్నప్పుడు స్నేహాలు అనుకునే సరికి ఒక కొత్త లేదు పాత లేదు అందరం ఒకటే కబుర్లు ఆటలు కేకలు పాటలు డాన్సులు . 40 లలో డాన్సులా  అందులోను ఆడవాళ్ళు అనకండి. చుట్టాలతోనో పక్కలతోనో ఐతే 40 లలో కాదు 20 లలోను చెయ్యలేము అల్లరి. బాల్య స్మ్రుతులంటే ఇదేనేమో అందరు మన సొంతవాళ్ళే, అందరు మన అక్క చేల్లెల్లె , అందరు మన బందుజనాలే.  దాదాపు 200 మందిమి కలిసాము. ప్రతి చోట వుండే మొహమాటాలు బెరుకులు తెలియని ప్రపంచం చూసినట్టు వుంది.

        గత పది సంవత్సరాలుగా మా వారి school get-to-gather లకి  నన్ను పిల్లలని కూడా తీసుకువేల్తున్నారు మా వారు. వల్ల ఫ్రెండ్స్ తో మా వారిని చూసినప్పుడు నాకు అనిపించేది . మగ పిల్లలుగా పుట్టడం యెంత లక్కీ నో కదా అని చక్కగా వాళ్లు ఇప్పటికి వల్ల school ఫ్రెండ్స్ దగ్గరనుండి అందరిని కలవోచ్చు ఏం కావాలంటే అల ఉండొచ్చు ఆడపిల్లలకి అవకాసం ఎలా వుంటుంది అని అనుకునే దాన్ని కానీ ఈ సంవత్సరం నేను మా ఫ్రెండ్స్ ని కలిస్తే చాల సంతోషంగా అనిపించింది . స్నేహాలు continue అయితే వుండే ధైర్యం ఏమిటో మళ్ళి ఇంకోసారి రుచిచూడడం అందులోను అన్ని బంధాల గురించు పూర్తిగా అవగాహనా వుంటే ఈ వయసులో తిరిగి అనుభూతిని పొందడం చాల బాగుంది. 

అందరమూ కొంత money ప్రోగు చేసి ఒక పేద స్నేహితురాలికి వేదిక మీదే విరాళం ఇచ్చాము.


2 కామెంట్‌లు:

  1. చాలా బాగుంది, విరాళం చాల మంచి పని. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటే ఉండే ఆనందం వేరు.

    రిప్లయితొలగించండి
  2. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటే ఉండే ఆనందమే వేరు లెండి. news paper లో కూడా వచ్చినట్లుందే, మీకు నా శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి