31, జనవరి 2017, మంగళవారం

Whatsapp(పెను భూతం)

Whatsapp(పెను భూతం)

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ||

అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు.. 

ఇది నా 100వ పోస్ట్ అంది ఇలాంటి టాపిక్ రాయాల్సి రావడం లక్కీనో కాదో తెలియదు మరి . ఓ బాలకృష్ణ 100 వ సినిమా లాగా శాతకర్ణి నో, చిరంజీవి 15౦వసినిమాలగానో తెలియదు కాని  ఇది నా 100వ పోస్ట్. 

హాయిగా కాలక్షేపానికి అమ్మలు , అత్తలు పెరటిగుమ్మంలో పనులు చేసుకుంటూ బియ్యం ఏరుకుంటూనో,  పప్పులు చేరుగుకుంటూనో ,  కందిపొడి విసురుకుంటూనో ఇంచక్కా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు.

తరువాత TV లు వచ్చి కొంచెం ప్రశాంత  కాలక్షేపాన్ని   పాడుచేస్తూ  వారానికి  ఒక సినిమా, వారంలో  ఒక చిత్రలహరి , మధ్య మధ్య లో చిన్న  చిన్న నాటికలు . ఆ  time లో  కొంచెంలో కొంచెం  నాలుగు  ఇళ్ళకు  ఒక TV అవ్వడం  వల్ల కాస్తా  కలసి  మాట్లాడుకుంటూనే  ఆ  programs  చూసేవాళ్ళు.

ఇంకొన్నాళ్ళకు  ఆ  ఒక్క  channel చాలదని  ఆ  నలుగురు  ఒకచోటే  కూర్చుండిపోయి  మాట్లాడేసుకుంటూ న్నారని కంగారుపడి  TV వాళ్ళు  చానల్స్  పెంచేశారు.  అంతేఅక్కడితో  మొదలయ్యి  ఉంటాయి  ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క choice  అనే  ఆలోచన  అంతే దెబ్బకి TV దెయ్యం  ప్రతి ఇంట్లో వెలిసింది.  అక్కడితో అమ్మలక్కల  కబుర్ల  ఫుల్ స్టాప్  కి పునాది పడిందనే  చెప్పాలి .

తరువాత తరువాత ఎన్నెన్ని చానల్స్ , ఎన్నెన్ని సీరియల్స్ , అందులో ఎంతెంత మంది ఆడ విలన్స్  చెప్పనలవి కావు. ఇవి సరిపోలేదుట. ఇంట్లో నలుగురు మాట్లాడేసుకుంటూ ఏదో ఒక ప్రోగ్రాం చూసేస్తున్నారుట.  అది అర్ధమైన వెంటనే టెక్నాలజీ కంప్యూటర్ ని దానికి జతగా  ఇంటర్నెట్ ని  తీసుకు వచ్చింది.  పోనీ అందులో కొంత కొత్తదనం  వచ్చి ప్రపంచం తో మనం పోటీ పడదాం అనుకునే లోపు  ప్రతివాడు ఎదిగిపోతే  కష్టం  అని  చేతిలోకి  స్మార్ట్ ఫోన్  వచ్చింది.  చెయ్యి అంటే మరి  కుటుంబానికి  ఒకటి కాదు కదా . మనిషికి రెండు . అందుకే  డ్యూయల్ సిమ్ లు మెమరీ కార్డు లు , దానికి తోడూ అందులో  WiFi లు etc  etc  etc .

ఇప్పుడు కొత్తగా  4Gలు 5Gలు . ఇంక పెద్దలకే  పిచ్చి పట్టే కాలక్షేపాలు అరిచేతిలోనే .  అలాంటిది  పిల్లల సంగతి వేరే చెప్పాలా.  facebookలు ,  E mail లు  విషయం అందరికి తెలిసినదే .  దాని వల్ల లాభాల మాటేమో కానీ పక్క  మనుషులతో  సంబంధాలు పోయి , social మీడియా లో అందరూ  బిజీ ఐపోయారు.  ఇప్పుడు కొత్తగా వచ్చింది whatsapp .  రామారామా  ప్రతి వాళ్ళు  whatsapp  లోనే  పలకరించుకోవడా లు ,  మాట్లాడుకోడాలు. అందులో  ప్రతి వాళ్ళకి  ఓ వంద గ్రూప్ లు .

గ్రూప్ లు అంటే గుర్తువచ్చింది  ఇంట్లో అందరిని అంటే  మళ్ళి ఎందరో అనుకుంటారేమో  అబ్బే అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు అంతే  సుమండీ .  హాయిగా పిల్లలని పక్కన కూర్చోబెట్టుకుని  ఇది మంచి ఇది చెడు అని మాట్లాడుకుంటూ  పిల్లలకి కొత్త విషయాలు నేర్పాలిసిన కుటుంబ వ్యవస్థ ఒరేయ్ ఫ్యామిలీ గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాను చూడు అనుకునే స్టేజి లోకి ఈ టెక్నాలజీ  మనల్ని మర్చేస్తోంది. మాటలు  పోయి  మెసేజ్ లతోను  అది కూడా వాళ్ళు వాళ్ళ భావాలను చెప్పఖర్లేదు  సుమండీ. ఎవరో పంపిన మెసేజ్ ని  forward చేసేస్తారు.  అంటే  వీడు పదాలు వెతుక్కోవాల్సిన  పని కూడా లేదు. ఇంక మాటలు ఏం మాట్లాడతారు .  ఇది ఫ్యామిలీ గ్రూప్ సంగతి ఇలా వుంది . 

ఇంకా ప్రతి వాడికి స్కూల్ గ్రూప్ , collage గ్రూప్, ఆఫీస్ గ్రూప్, కాలనీ group అంటూ ఇలా ఓ వంద గ్రూప్ లు. వీటిలో పనికివచ్చే విషయాలు షేర్ చేసుకోవడం మాట ఎలా వుందో తెలియదు ఎవ్వరికీ కానీ , ఒక గ్రూప్ లో వచ్చిన ప్రతి మెసేజ్ ప్రతి గ్రూప్ లోను కనబడుతుంది. ఒక అరగంట కనక ఫోన్  కేసి  చూసే  time దొరకక పొరపాటున  లేట్ అయ్యిందో  ఇంక ఫోన్ చూడాలంటె భయం వేసేనని వందల వందల మెసేజ్ లు అసలు అన్ని మెసేజ్ లు పైపైన చూడాలన్న యెంత time వేస్ట్ అయిపోతుందో .  

అసలు అన్ని మెసేజ్ లు అంత time ఫోన్ లోనే  స్పెండ్ చేసేస్తుంటే  పిల్లలకి  చదువుకునే  time ఎలా . పెద్దలకు పనులు ఎలా . అసలు పక్కన ఒక మనిషి ఉన్నాడు  మాట్లాడాలనే ఆలోచన ఎలా వస్తుంది?  ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి  చేతిలోనూ ప్రపంచంలోను ఉండే  ఆఖర్లేని  కాలక్షేపాలతో గడిపే అలవాటు ఇపోతే  పనికొచ్చే పనులకు సమయం ఎక్కడ వుంటుంది .  మన ఫ్రెండ్ కి కష్టం వచ్చిందంటే  గెట్ వెల్ సూన్ అని మెసేజ్ పెట్టేస్తే వాడు బాగు పడిపోతడా.  

తండ్రి పిల్లాడికి ఒక మంచి మెసేజ్ పెట్టేస్తే వాడు మంచి  దారిలోనే వెళతాడా . కనీసం నువ్వు పంపిన మెసేజ్  వాడు చదివాడో లేదో కూడా చూసే ఆలోచన ఉంటోందా.ఇలాంటి విషయాలలో  వేగంగా కొట్టుకుపోతున్నమనం తెలివి  తెచ్చుకుని  ఇంటివైపు , జనం వైపు చూస్తామా . దేశానికీ పనికొచ్చే కాదు కాదు కనీసం మనకు పనికొచ్చే ఆలోచనలు మన  బుర్రలకు తడతాయా. మనందరికీ డౌటే కదా .

ఓ పది రోజులుగా నేను whatsapp వాడుతున్నాను లెండి . దాని మీద నాకు కలిగిన వికారం , చిరాకు , భయం ఇలా రాయిస్తున్నాయి . టెక్నాలజీ వాడుకోవాలి కాదనము కానీ దానికి కొంత పరిధి ఉండాలి, దాని అవసరాన్ని తెలిసి సద్వినియోగం చేసుకోవాలి కానీ మన ఇల్లు, ఆలోచనలు, చదువులు,  పనులు  పాడైపోయేలా  మాత్రం  కాదు కదా. మీరేమంటారు?




20 కామెంట్‌లు:



  1. బాగు బాగు వాట్సాపు వనితామణి "కట్టు" గాద :)

    వాట్సాపు జిలేబిని గని
    హాట్సాఫనిరి మొదట మది హాసం బడయన్ ,
    చాట్సుల తో తల తిరుగగ
    బూట్సుల తలగొట్టు కొనిరి బుద్ధిగ మారీ :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అడుసు తొక్కనేల, కాలు కడగనేల? ప్రత్యక్ష అనుభవం కదండీ..

      తొలగించండి
  2. చాలా బాగా చెప్పారు. అసలే చాలా బలహీనంగా ఉన్న మానవ సంబందాలని ఈ whatsapp / social media ఇంకా బలహీనపరుస్తున్నాయి. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. పెద్దవాళ్ళని గౌరవించాలి, తాతలు/అమ్మమ్మలు/మామ్మలు దగ్గర పిల్లలు life lessons నేర్చుకోవాలి.

    రిప్లయితొలగించండి
  3. బాగా చెప్పారు. Technology ని మంచికి, చెడుకి వాడుకోవచ్చు. మన దేశం లో ఇది చెడుకి ఎక్కువ వాడుతున్నారు. పైన ప్రసాద్ గారు చెప్పినట్లు, మన సంస్కృతి నుంచి దూరంగా వచ్చెయ్యడం వల్ల ఇటువంటి విపరీతాలు జరుగుతున్నాయి.

    రిప్లయితొలగించండి
  4. ఏమి అనుకోకండే యీ మెసేజ్ ను కాపీ చేసి వాట్స్ ఆప్ లో పెడతాను , అది అటు తిరిగి ఇటు తిరిగి ఎదో ఒక గ్రూప్ లో మీకు చేరుతుంది .

    రిప్లయితొలగించండి
  5. వంశ వృక్షం ల గ్రూప్ వృక్షాలు వెతుకోవ్వాలి , నా బార్య ఫ్రెండ్స్ గ్రూప్లో ఉండే లక్ష్మి వాళ్ళ వీది గ్రూపులో ఉండే సుబ్బమ్మ తమ్ముని ఈడియట్ గ్రూప్లో ఉండే సోము ఫ్యామిలీ గ్రూప్లో ఉండే విశ్వం బాబాయ్ ఎస్ ఎస్ సి 1948 BATCH లో ఉండే కాంత రావు పెద్ద కూతురి బి టెక్ గ్రూప్ లో ఉండే కళ్యాణి ...........ఇలా చెప్పుకోవాలి .

    రిప్లయితొలగించండి
  6. 100 పోస్టులు పూర్తయినందుకు అభినందనలు.

    దాదాపు అన్ని సోషల్ మీడియా సైట్లను, బ్లాగరు బ్లాగ్ స్పాట్ వర్డ్ ప్రెస్ లను కూడా, చైనాలో నిషేధించారు. మానవ సంబంధాల గురించి చింతా, పాశ్చాత్య దేశాల మీద రాజకీయ కారణాలా ఏదైతేనేం తెలివైన పని చేసారు.

    టెక్నాలజీ గురించి ఐన్ స్టైన్ ఏనాడో అన్నాడంటూ(?) కొన్ని ఫొటోలు చక్కర్లు కొడుతుంటాయి. చూసే ఉంటారు. ఈ క్రింద లింకులో ఉంటుంది. సెల్ ఫోన్ మోజు జనాల్ని ఎంతగా లొంగదీసుకుందో ఈ ఫొటోలలో తెలుస్తుంది.

    Einstein on technology

    వాట్సప్ చిరాకేనండి. వాట్సప్ మెసేజ్ లు వచ్చినప్పుడల్లా అలర్ట్ లతో నిమిషానికి పదిసార్లు టింగ్ మంటూనే ఉంటుంది నా సెల్ ఫోన్. వాట్సప్ మోజున్న మరి కొంతమంది పొద్దున్నే గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్, రాత్రి గుడ్ నైట్ అంటూ మెసేజ్ 😕. ఆ మధ్య మా స్నేహితుడు అన్నాడు సెల్ ఫోన్లో వాట్సప్ వగైరా మెసేజ్ లు ఏమైనా వచ్చాయా అని గడీగడీకి చెక్ చేసుకుంటుండడం పసిపిల్లలకి వేసిన డయపర్ చెక్ చేస్తుండడం లాంటిదని 🙂.

    మీ టపా చక్కగా వ్రాసారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు. Einstein అన్నా అనకపోయినా, మీరు చెప్పింది నిజం.

      తొలగించండి
  7. శతమానం భవతి, శతమనంతం భవతి....

    ఫేస్ బుక్కంటే మొదటి నుంచీ సగమెరికే ఎందుకో తెలియదు :)
    ఇక వాట్సప్, ఒక మనవరాలు బలవంతంగా తీసుకెళ్తానందిగాని,వద్దనేశాను.ట్విట్టర్, మరీటి, మరోటి, ఇక చేరితే కావలసినన్ని,మతి పోగొట్టేందుకు. నా దగ్గరో పురాతనమైన సెల్ ఉంటుంది. ఈ మధ్యనే దాన్ని మార్చేశాడు అబ్బాయి, కొత్త దాంట్లో నెట్టూ వస్తుందని ౪జి వేసి ఇచ్చాడు. నలకల్లా అక్షరాలు, కళ్ళు లాగేయి కార్డ్ పీకేసి మిచ్చేశా.... ఇదిగో బ్లాగ్ వదలటం లేదు....
    టపా బాగుంది.

    రిప్లయితొలగించండి

  8. When Bhakti enters Food,
    Food becomes Prasad..!!

    When Bhakti enters Hunger,
    Hunger becomes a Fast…!!

    When Bhakti enters Water,
    Water becomes Charanamrit…!!

    When Bhakti enters Travel,
    Travel becomes a Pilgrimage…!!

    When Bhakti enters Music,
    Music becomes Kirtan…!!

    When Bhakti enters a House,
    House becomes a Temple…!!

    When Bhakti enters Actions,
    Actions become Services…!!

    When Bhakti enters in Work,
    Work becomes Karma…!!

    When Bhakti enters a Man,
    Man becomes Human…!!

    When Bhakti enters WhatsApp,
    Chat becomes Satsang..!!

    రిప్లయితొలగించండి
  9. చూడబోతే బాధలు whatsapp అందరికి ఉన్నట్టున్నాయి. కొన్నింటిని లేక ఎక్కువ భాగం చూసి చూడనట్టు వదిలేయచ్చు. కానీ గతంలో ఉత్తరాల్లో వచ్చినట్టు, ఈ వార్త మీరు మరో పదిమందికి పంపక పోతే మీకేదో నష్టం/దుఃఖం కలుగుతుందనే వాళ్ళు, ఈ పైసా ఖర్చు లేని వైద్యంతో ఏ జబ్బైన నిముషంలో తగ్గిపోతుందనేవాళ్ళు, ఆపదలో ఉన్న వాళ్ళకి ఎంతోకొంత డబ్బులివ్వమని, కనీసం లైక్ చెయ్యమని, చేస్తే whatsapp వాళ్ళు కొన్నివేలరూపాయలు బాధితులకి ఇస్తారని ఊదరగొట్టే వాళ్ళు మరి ఎక్కువైపోయారు. ఈ జాడ్యం whatsapp వాడే అన్ని వర్గాల వారికి అంటుకొన్నట్టుంది. మీరన్నట్టు కొంత కాలం వీటికి దూరంగా ఉండి, మనుషులతో సావాసం చెయ్యటమే మందు.

    రిప్లయితొలగించండి
  10. నా దగ్గర Galaxy Tab3 ఉంది.

    కొందరు పోరగాపోరగా దానిలోనికి వాట్సప్ తీసుకొచ్చాను. మొదలయ్యాయి కష్టాలు. అందులోనూ‌ అవి దారుణాతిదారుణంగా. రోజుకో రెండొందల మెసేజెస్ వాటిలో బోలెడు బోలెడు వీడియోలూ వగైరా వగైరా. అవన్నీ టాబ్ నిండా పరుచుకొని నానా చిరాకు. ఎలాగో అలా తిప్పలు పడుతూ‌ ఎం చేయాలో‌ తెలీక రోజూ పదినిముషాలు వెచ్చించి చెత్తతొలగింపు కార్యక్రమంలో పడటం.

    కొన్నాళ్ళకు వాట్సప్ అప్-డేట్ అయ్యింది - తాను ఇంక పనిచేయనంది. ఆరాతీస్తే ఇక టాబ్లెట్లమీద పనిచేయటం‌ మానేసిందట.

    శుభం శుభం. అప్పటినుండీ మరలా చాలా హాయిగా ఉన్నానన్న మాట!

    రిప్లయితొలగించండి