మొన్న ఒక కధ చదివానండి . ఎందులో అనేది ఇక్కడ విషయం కాదనుకోండి .ఇంతకీ విషయం ఏమిటి అనేగా మీరు అడిగేది వస్తున్నానండి అక్కడికే వస్తున్నాను.
మొన్న కధ చదివానన్నాను కదా అందులో ఒక మాస్టారు పాపం కొంచెం పేద మాస్టారు లెండి తన కూతురికి కొత్తగా పెళ్లి చేసారు . మొదటి సంక్రాంతి వచ్చింది. అల్లుడిని కూతురిని ఇంటికి పిలిచి బట్టలు పెట్టి ఏదైనా గిఫ్ట్ కొనివ్వాలని ఆ మాస్టారి గారి భార్య గారి ఆశా. పాపం మాస్టారి పరిస్టితి ఇరకాటంలో పడుతుంది . ఇంకా పెళ్ళికి చేసిన అప్పులకి వడ్డీలే తెమలలేదు, ఎలారా భగవంతుడా అని ఆలోచనలో పడుతుంటారు. ఇంతలో పండగ రానే వచ్చింది . దానితో పాటే కూతురు కొత్తల్లుడు కూడా వచ్చారు. దానితో మాస్టారి కంగారు ఇంకా ఎక్కువ అయ్యింది . పాపం తన భార్యకేమో అల్లుడికి కొత్త బండి కొనివ్వాలని కోరిక . పోనీ ఏ వాచినో వుంగారమో ఐతే మాస్టారు కాస్త ఆశాజనకంగా ఉండేవారేమో .అంత చిన్నచిన్న బహుమతులు పెద్దింటి అబ్బాయికి ఎలా ఇస్తాము అందులోను కట్నం కూడా లేకుండా మనమ్మాయిని చేసుకున్నారాయే అంటారు మాస్టారి భార్య . ఇంక బండి గురించి ఆలోచించక తప్పలేదు మాస్టారికి . ఆయన పడే తర్జన భర్జన చూడలేక ఆ గొప్పింటి అబ్బాయి తనే ఒక బండి బుక్ చేసి surprise గా బండి మాస్టారే బుక్ చేసినట్టుగా ఇంటి address కి పంపి మాస్టారి చేతులమీదుగా బహుమతి గా ఆ బండిని అందుకుని తన ఇంట్లో భార్యకు అవమానం జరగకుండా ఆదుకుంటాడు . ఎప్పటికి మావగారికి ఆ విషయం తెలియకూడదని తన భార్యనుండి మట తీసుకుంటాడు . బండి ఎలా వచ్చిందో తెలియక మాస్టారు , మాస్టారే తెచ్చారు కాబోలనుకుని మురిసిపోయిన మాస్టారి భార్య , తన భర్త తన పరువు తన తల్లి తండ్రుల పరువు కాపాడి (అతని తరఫు వాళ్ళ దగ్గర ) తనని ఉన్నత స్తానం లో నిలబెట్టడాని కూతురు మురిసిపోతారు .
ఆ అల్లుడి ఉద్దేశం తప్పని నేను అనటంలేదు . కాని తన వాళ్ళని మోసం చేసి నట్టే కదా . ఈ కధ ద్వార మనం అత్తారికి తెలియకుండా వాళ్ళ అబ్బాయి మనకు హెల్ప్ చెయ్యడం మంచిది అని కదా చెపుతున్నాము. కాని మార్పు అనేది ఒక వ్యక్తీ లో వస్తే ఏం లాభం . మొత్తం సమాజంలో కనీసం అబ్బాయి విలువలు వున్నవాడు అంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఆ విలువలను నేర్పే సంస్కారం వున్నవాళ్ళుగా వుండాలని చూపిస్తే బాగుండేది . వాళ్ళకి తెలియకుండా కొడుకు వేరే వాళ్ళకి అత్తారే అనుకోండి సమర్ధింపుగా వున్నాడనే విషయం తరవాత తెలిస్తే వాళ్ళు తల్లితండ్రులుగా ఓడిపోయినట్టే కదా .
ఇలాంటి కధలు అందరికి ఒకే సందేశాన్ని ఇవ్వలేవు కదా అని . మీరేమంటారు? ఇది నేను ఈ కధ రాసిన వాళ్ళని విమర్శించాలని కాదు నా అభిప్రాయం నాలో నేను గా రాస్తున్నాను అంతే సుమండీ .
నా బ్లాగ్ కదా అని ధైర్యం అంతే. అందరిని కలుపుకోగలగాలి అనే ఉద్దేశం వుండాలి కాని ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని సమర్ధిస్తే తరువాత తరువాత గోడవలని మనమే పెంచి పోషించినట్టు కదా .
మంచితనానికి కూడా హద్దులు పెడితే ఎలాగండి?
రిప్లయితొలగించండిమంచితనం అనేది ఇంట్లోనుంచి మొదలైతే బాగుంటుందని . ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కదండీ
రిప్లయితొలగించండి