12, ఆగస్టు 2015, బుధవారం

గురుపూజ

                                గురుపూజ 


మొన్న నేను గురుపూజ చూసానండి. గురుపూజ అంటే ఏదో గుడిలో బాబాగారికి పూజచేయడం కాదు . మొన్న సత్యసాయి నిగమాగమంలో శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు శంకరాభరణం సినిమా మీద ప్రవచనం చేసే సందర్భంలో ఆ వేదికపైన గురుశిష్య సంబంధం లోని విశేషాలను విలువలను గురించి చెప్పిన సందర్భంలో శ్రీశ్రీశ్రీ మంగళంపల్లి బాల మురళీకృష్ణగారికి వారి శిష్యుడు మోహన కృష్ణ గారు స్వయంగా తమ స్వహస్తాలతో గురువుగారికి పురుష సూక్త యుక్త షోడస ఉపచార పూజ చేసారు. ఎంత అదృష్టవంతులు ఆ గురు శిష్యులు ఇద్దరు.  గురువు ప్రాణాలతో నిలబడి పూజ చేసే భాగ్యం శిష్యునికి కల్పించడం శిష్యుని అదృష్టం ఐతే, పూజ చేయడానికి మనసు నిండా భక్తిని నింపుకున్న శిష్యుడు వుండడం గురువుకి గౌరవం కదా. 

    వారిద్దరి ఆనందం ఒక ఎత్తుఐతే అలాంటి దృశ్యాన్ని చూసే అదృష్టాన్ని కలిగిన వారందరి భాగ్యమే భాగ్యం సుమండీ. ఒక మనిషికి భాగవతుని ఉపచారాలన్నీ జరిపి పూజించడం కళ్లారా చూడడం నిజంగానే చాల ఒళ్ళు పులకించే సంఘటననే చెప్పాలి . 

ఆ  సందర్భంగా వారిద్దరూ కలిసి వేదిక మీద ఒక కీర్తన ఆలపించారు, బ్రహ్మాండం!


2 కామెంట్‌లు: