అందరిలోనూ స్పెషల్ గా కనబడాలని అందరి కళ్ళు మనమీదే వుండాలని ఆలోచిన్చేవాళ్ళల్లో నేను వున్నాను .అసలు ఆ ఆలోచనకి మూలం ఏమిటా అని చాలాసార్లే ఆలోచిస్తూ వుంటాను. ఇప్పటికి సరైన సమాధానం దొరకలేదనుకోండి. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా శోదిస్తూనే వున్నాను.
చిన్నప్పుడు స్కూల్ లో చదివేటప్పుడు టీచర్ నన్నే మెచ్చుకోవాలి అల్లరిచేసినా తిట్టకూడదు అనుకునే దాన్ని . పాపం మా టీచర్స్ నా పట్ల అలానే వుండేవారు. అమ్మ నన్ను ఏంతో శుభ్రంగా తయారు చేసి రోజు స్కూల్ కి వెళ్ళేటప్పుడు మంచి బుద్దులు చెప్పి పంపేది నేను చాలావరకు అలానే ఉండడానికి ప్రయత్నించేదాన్ని టీచర్ నన్ను గుడ్ అని మేచుకోవాలని. తతిమా పిల్లలు నన్ను స్పెషల్ గా చూడాలని.
collageలో చేరిన రోజు అమ్మ , నాన్న ఇద్దరు చాల జాగ్రత్తలు చెప్పారు (మంచి బుద్దులు చెప్పే స్టేజి దాటానని) .ఇంటి దగ్గర దించిన తల collageలోనే ఎత్తాలని , బయటి వాళ్లతో కొత్తవాళ్ళతో అవసరం లేకుండా మాట్లాడ కూడదని , మంచి పిల్ల అనిపించుకోవాలని అలానే వున్నాను అందరు నన్నుమంచి అని మేచుకోవాలని, చాలా స్పెషల్ అనాలని. స్పెషల్ ముందు చాలా చేరిందేమిటా అని చూస్తున్నారా ? మరి collage కదా ఇంకొంచెం స్పెషల్ అన్నమాట .
పెళ్లి కుదిరింది .ఆ రోజు రానే వచ్చింది . అమ్మ చెప్పింది అత్తగారింటిలో మర్యాదగా మసులుకోవాలి . ఎదురు మాట్లాడకూడదు . మంచి అమ్మాయి మా కోడలు అని అనిపించుకోవాలి అని . అలానే వున్నాను నా వీలినంతవరకు .మా కోడలు చాల శుభ్రం . అన్ని చాల జాగ్రత్తగా చేస్తుంది ఉంచుతుంది అనిపించుకున్నాను .
ఇంక పిల్లలు పుట్టుకు వచ్చారు . అమ్మ చెప్పింది పిల్లలని బాగా, జాగ్రత్తగా, మంచిగా, మర్యాదగా ఇన్నిచేరాఏమిటా అని చూస్తున్నారా . మరి బాధ్యత కూడా చేరింది కదా అమ్మవ్వగానే అందుకన్నమాట .ఇలా మనపిల్లలు కూడా అందరిలో స్పెషల్ గా కనపడాలనే తపన ఇంకా పెరిగిపోయింది . నా స్పెషల్ సంగతి మర్చిపోయి వాళ్ళ స్పెషల్ గురించి తపన ప్రయత్నం పెరిగిపోయాయి .
ఇవన్ని ఆలోచిస్తుంటే మళ్ళినా ఆలోచనలు తిరిగి స్పెషల్ దగ్గరే ఆగాయి ఏంచేస్తాం కొన్ని ప్రశ్నలకి ఆలోచనలకి సమాధానాలు దొరకడం చాల కష్టం అని ఇప్పటికి బాగా అర్ధమయ్యింది .
కొంతవరకు స్పెషల్ గా ఉండాలనే ఆలోచన ఇతరులని ఇబ్బంది పెట్టనంత వరకు ఆరోగ్యకరమే కదా వచ్చిన నష్టం ఏం లేదు కదా ని సరిపెట్టేసుకోవటమే నా వంతు అయ్యింది .
ఆ మర్చిపోయానండోయ్ ఇప్పుడిక పిల్లలతో పాటు నేను కూడా నా స్నేహితుల మధ్య. ఇంటి చుట్టూ పక్కల వాళ్ళ మధ్య స్పెషల్ ఏ సుమండీ.అలా అయితేనే నాకు ఇష్టం అనుకోండి .
ఆ మర్చిపోయానండోయ్ ఇప్పుడిక పిల్లలతో పాటు నేను కూడా నా స్నేహితుల మధ్య. ఇంటి చుట్టూ పక్కల వాళ్ళ మధ్య స్పెషల్ ఏ సుమండీ.అలా అయితేనే నాకు ఇష్టం అనుకోండి .