22, ఆగస్టు 2014, శుక్రవారం

అన్నమాచార్య కీర్తన నానాటి బతుకు నాటకము

చాలా రోజుల తరువాత పెడుతున్నానని అలిగి వినకుండా వదిలేయ్యకండి . మీకు పరిచయమున్న పాటే . కానీ M.S.సుబ్బలక్ష్మిగారు పాడారు. ఆవిడ పాడినపాట అంటే చెవిలో అమృతం పోసినట్టే కదా. మీరు కాదనరనుకోండి . మరి ఇంకెందుకు ఆలస్యం వినేయ్యండి .ఆఆ ఎలావుందో చెప్పడం మార్చిపోయే అంత మైమరచిపోకండి .

 

నానాటి బ్రతుకు నాటకము





రచన: అన్నమాచార్య

రాగం: ముఖారి

నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము ||


పుట్టుటయు నిజము, పోవుటయు నిజము
నట్టనడిమీ పని నాటకము |

యెట్టనెదుటి కలదీ ప్రపంచము
కట్ట గడపటిది కైవల్యము ||


కుడిచేదన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాటకము |
వొడి కట్టుకొనిన ఉభయ కర్మములు
గడి దాటినపుడే కైవల్యము ||


తెగదు పాపము, తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము |
ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము ||

1 కామెంట్‌:

  1. కీర్తనేమో అన్నమాచర్యులవారిది,పాడినదేమో అమ్మ ఎమ్.ఎస్, రాగం ముఖారి ఇంక చెప్పేదేమి? ఆనందః

    రిప్లయితొలగించండి