మానసిక స్తైర్యం
నిన్న టీవీ పెట్టిన దగ్గరనుంచి ఒకటే డల్ గా అనిపించింది. సిని నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య. అసలు ఆత్మహత్య చేసుకోవాలంటే ధైర్యం చాలా కావాలి. అంత ధైర్యం వాళ్ళకష్టాన్ని గట్టెక్కడానికి ఉపయోగించగలిగితే వాళ్ళు సాధించలేనిది ఏముంటుంది? చావాలని ఆలోచించే సమయాన్ని వాళ్ళు ప్రాబ్లం కు సొల్యూషన్ వెతకటం లో పెట్టగలిగితే సగం నిరాశావాదులు తగ్గుతారు.
ఎంత కష్టం వచ్చినా దేనిమీదైనా విరక్తి కలగచ్చు కానీ , జీవితం మీద విరక్తి కలగకూడదు. కాలంతో పాటు కొన్ని కష్టాలు అనుకున్నవి చాలా సులువుగా తీసిపడేసే అంశాలుగా కనబడొచ్చు. అయిన ఆ మాత్రం జీవితం మీద అవగాహన లేనివాళ్ళు వాళ్ళ మీద ఆధారపడే వారిని ఎలా జాగ్రత్తగా చూసుకోగలరు? ఒక (చిన్న/పెద్ద) కష్టాన్ని తట్టుకోలేని , సాధించలేని మనస్తత్వాలు దేశానికి, సమాజానికి, కనీసం కుటుంబానికి ఎంతవరకు భరోసాగా వుండే అవకాశం ఉంటుంది?
చిన్నప్పటి నుంచి ఆటల నుంచి పిల్లల మనస్తత్వాలను ధైర్యంగా మలచగలిగే కుటుంబవ్యవస్థ కేవలం మన భారత దేశానికే సొంతం. అలాంటిది ఈ మధ్య యువతలో మానసిక స్తైర్యం సన్నగిల్లిపోవడానికి కారణాలను చూస్తే మనమే అనేది స్పష్టమవుతోంది . పూర్వంలా ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడులేవు. అవి వుంటే కొంతలో కొంత పిల్లలకి తాత, మామ్మ / అమ్మమ్మ ల నుండి కొంత కౌన్సిలింగ్ లు జరిగే అవకాశం వుండేది. ఇంకోటి పిల్లలు నలుగురితో కలిసి ఆడుకోవడం, పోట్లాటలు తిరికి కలిసిపోవడాలు లాంటి వాతావరణం ఈనాటి పిల్లలలో లేకపోవడం ఒక కారణంగా చెప్పొచ్చు.చిన్నప్పటి నుండి పక్క పిల్లలతో కలిసిమెలిసి తిరగడం వల్ల చిన్న చిన్న తగాదాలు ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల వాళ్ళు పరిస్తితులను ఎలా నెగ్గాలి అనే విత్తనం పడే అవకాశం ఉంటుంది. అలానే పూర్వం ఇంట్లో కనీసం ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు ఉండేవారు. అలా మిగతా వారితో కలిసి పెరగడం వల్ల ఒక వస్తువు మీద కేవలం ఒకరి హక్కే అనే భావన కాకుండా పంచుకోవడం, సర్దుకోవడం వంటివి ఉండేవి. ఇప్పటి ఇళ్ళల్లో కేవలం ఒక్క పిల్లో, పిల్లాడో ఉండడం వల్ల వారి బొమ్మలపై , అమ్మానాన్నల గారాలపై కేవలం వారి ఒక్కరి హక్కే ఉంటోంది. కాబట్టి షేరింగ్ , వెయిటింగ్ లాంటి విషయాల గురించి పిల్లలకి తెలిసే అవకాశం లేదనే చెప్పాలి.
ఇంకో కారణం ఇప్పటి తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు కావడం వల్ల టైం దొరకని కారణం వల్ల పిల్లలకు ఇన్స్టెంట్ ఫుడ్ లు, రడీమేడ్ డ్రెస్ లు, మాల్ల్స్ లో షాపింగ్ లు ఇవే పరిచయం చేస్తున్నారు. వాటిలో రియాలిటీ కన్న పిల్లలకు నాచురల్ కాక ఆర్టిఫిషియల్ విషయాలే కనబడుతున్నాయి. మనిషికి అన్ని ఎంతో సులువుగా అందుతాయి అన్న అవగాహనే ఏర్పడుతోంది. దానితో తండ్రి కష్టపడితేనే ఈ సౌకర్యాలు అనే విషయం వైపు పిల్లలకి దృష్టి పడే అవకాశమే వుండడం లేదు. చిన్నప్పుడు మా అబ్బాయిని ఎవరైనా మీ నాన్నకి డబ్బులు ఎలా వస్తాయి అని అడిగితే వాడు ATM మిషిన్ లో కార్డు పెడితే వస్తాయి అనేవాడు. అదే వాడికి కనపడేది మరి. అది వాడి తప్పు కాదనుకోండి. ఆ పద్ధతి ఇప్పటి పిల్లలలో ఇంకా ముదిరిందనే చెప్పాలి.
ఇంక స్కూల్స్ లో ఐతే excursion కి తీసుకెళ్ళాలి అంటే ఏ రిసార్ట్ కో తీసుకేలుతున్నారే కానీ అందులో పిల్లలకు ఎంత వరకు ఉపయోగం అనేది ఆలోచించటం లేదనే చెప్పాలి. ఇప్పటి పెద్ద స్కూల్స్ ఐతే ఫారెన్ ట్రిప్స్ కూడా వేస్తున్నారు. పిల్లలకు అది అవసరమా అసలు.
ప్రతి పిల్లాడి చేతిలో tablet / mobile వుంటోంది. ఎందుకురా నీకు అంటే ఆడుకోడానికి అంటాడు వాడు. ఇది వాళ్లంతట వాళ్ళకు వచ్చినది కాదుకదా. స్కూల్ డేస్ లో చేతిలో సెల్ ఫోన్లు, కాలేజ్ డేస్ లో బైక్ లు , ఇంక రియల్ లైఫ్ గురించి ఆలోచించే సమయం ఇప్పటికితల్లితండ్రులు గా మనం ఎక్కడ ఇస్తున్నాము?
ఇంక సినిమాలలో ఐతే హీరో అంటే మేలినియర్ కి వారసుడు ఓ వందమందిని చంపెస్తేనే వాడు మగాడు. ఆడపిల్లకి ఐతే వాడే సరైన మొగుడు . ఆ సినిమాలుచూస్తే పిల్లలకి పెద్దైన వెంటనే తేరగా ఆస్తులు వచ్చి పడతాయి అనుకుంటున్నారు. రాని పిల్లలకి తండ్రి చేతకానివాడుగా కనబడతాడే తప్ప వాడు పగటికలలలో వున్నాడని అర్ధం అయ్యే సరికి వాళ్ళకి ౩౦ ఏళ్ళు దాటిపోతున్నాయి. ఇంక ఆ టైం లో చేసి సాధించడం గురించి ఎప్పటికి ఆలోచించగలరు.
ఇలాంటి పెంపకాల వల్ల మనమే మన పిల్లల భవిష్యత్తును గాలిలో నిలబెడుతున్నామన్న నిజాన్ని తల్లితండ్రులు ముందుగా గ్రహించుకుంటే , పిల్లలకు వాళ్ళని వాళ్ళు ఎలా బాలన్స్ చేసుకోవాలో నేర్పగలిగిన వాళ్ళమవుతాము .
బాగా చెప్పారు. ఇటువంటి పనికొచ్చే విషయాలను స్కూల్లో కూడా నేర్పితే తర్వాతి తరం ఐనా బాగుపడుతుంది.
రిప్లయితొలగించండిప్రపంచం మొత్తం స్పీడ్ యుగం లో ఉంది, తోటి వాళ్ళ గురించి పట్టించుకునే తీరిక ఎవరికీ లేదు, అందుకే ఇటువంటివన్నీ. మొత్తం మీద మీరు బాగా రాసారు, ఇటువంటివి చదివి ఐనా కనీసం కొంతమంది మారితే మీ పోస్ట్ కి సార్ధకత సిద్ధిస్తుంది..
రిప్లయితొలగించండిమీ రెస్పాన్స్‌కి ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి