కొన్ని "స్వాతి ముత్యాలు"
మనసులో ఎలాంటి కల్మషం లేకుండా మనిషి మనిషిగా జీవించడమే మహనీయత.
ఆడినమాట, గడిచిన కలం, వేసిన బాణం తిరిగిరానివి.
మౌనానికి మహత్తర శక్తి ఉంది. మంచి ఆలోచనలు, నిర్ణయాలు మౌనం నుంచే పుడతాయి.
ఉత్తమమైన స్వభావం అత్యున్నతమైన ఆభరణం.
మంచిపని ప్రతిదీ మొదట కష్టమనిపిస్తుంది.
చిన్న ఖర్చులే అని దుబారా చేయకండి. చిల్లు చిన్నదే అయినా పెద్ద ఓడ కూడా
మునిగిపోతుంది.
ఆలోచించట మే కాదు, ఆచరణ ముఖ్యం – అదీ ఇప్పుడే ప్రారంభించాలి తప్ప రేపటికి
వాయిదా వేయకూడదు.
మన అంతరాత్మయే మనకు మంచి స్నేహితుడు.
ఈ రోజును సద్వినియోగం చేసుకుంటే రేపటిరోజుకు నవ్వుతూ ఆహ్వానించ గలుగుతాం.
చాలా బాగున్నాయి, (అందరూ)ఆచరణలో పెడితే ఇంకా బాగుంటుంది !
రిప్లయితొలగించండిఇప్పుడే మీ పోస్ట్స్ అన్నీ చూశాను. చాలా బాగున్న్నాయి అన్ని పోస్ట్స్. అభినందనలు.
రిప్లయితొలగించండినిజంగా ఆణిముత్యాల్లాంటి మాటలివి.
చాల సంతోషమండి భారతి గారు. మీలా చదివిన వారు బాగుంది అంటే కొత్తవి పోస్ట్ చెయ్యడానికి నాలాంటి కొత్తవాళ్ళకి ప్రోత్సాహకరంగా వుంటుంది. మీ అభినందనలకు ధన్యవాదాలు.
తొలగించండి