25, సెప్టెంబర్ 2013, బుధవారం

ఎదురుచూపులు



                                       ఎదురుచూపులు

ఇలా శ్రీవారు ఆఫీసుకి వెళ్ళారో లేదో సుమన ఫోన్ వచ్చింది . ఇంట్లోనే ఉంటున్నావా నేను వస్తున్నాను అని.  You are always welcome అని చెప్పాను తనకి.  సుమన వస్తుందంటే నాకు చాలా సంతోషం మరి. ఎందుకంటే తను నాకున్న మంచి స్నేహితురాళ్ళలో మొదటి స్థానంలో వుంటుంది మరి.

తను వచ్చేసరికి పనంతా ముగించుకుని కబుర్లు చెప్పుకోవచ్చని మొత్తం పనంతా గబగబా హడావిడిగా చేసి వచ్చి హాల్లో సోఫాలో కూర్చుని తనకోసం ఎదురు చూస్తూ TV లో channels తిప్పుతున్నాను .  Time  చూస్తే 11.30, అయినా సుమన ఇంకా రాలేదు సరికదా, కనీసం తన ఫోన్ కూడా రాలేదు. సరేలే ఇంకా బయలుదేరటం కుదరలేదేమో అని అనుకున్నాను.

సుమనకి నాకు పదిహేనేళ్ళ స్నేహం. సుమన భర్త మావారు ఒకే ఆఫీసులో పని చేస్తారు. సుమన తీరు వేరు. మనిషి అందంగా , హుందాగా ఉంటుంది. ఎవరైనా తన సర్కిల్ లో వాళ్ళు సలహా అడిగితే ఎంతో ఆలోచించి అన్ని కోణాలనుండి ఆ సమస్యలోని సాధక బాధకాల గురించి పూర్తిగా విశ్లేషించి వివరించి చెప్పగల తెలివైనది.  నాకు తన వ్యక్తిత్వం చాలా విషయాలలో నచ్చుతుంది. ఒక్క విషయంలో తప్ప.  అబ్బ ఇంకా రాలేదేమిటా అని టైం చూస్తే ఒంటిగంట లంచ్ టైం అయ్యింది ఇంక ఎప్పటికి వస్తుంది సుమన ? కనీసం ఎదురుచూస్తూ ఉంటానని అనుకోదేం?  ఒక ఫోన్ చేసి లేట్ అవుతుందని చెబితే తన సొమ్మేం పోతుంది?

ఇంత గింజుకునే బదులు ఆ పనేదో నేనే చెయ్యొచ్చుగా అనేగా మీ ఉద్దేశం? అదే వస్తున్నాను. నాకు తనలో నచ్చని విషయం ఇదే . ఇప్పుడు నేను ఫోన్ చేసాననుకోండి "అయ్యో నేను  నీకు చెప్పినప్పటి నుంచి ఒకటే హడావిడిగా పనులు చేస్తూనే వున్నాను. ఇంకా కాలేదోయ్ ఏమీ అనుకోకు నేనే చేసి చెబుదామనుకున్నాను. హడావిడిలో మర్చిపోయాను . ఇందాక ఫోన్ దాకా వచ్చిన దాన్నే ఏదో గుర్తువచ్చి వెళ్లాను మళ్ళి కుదరలేదు. అందులోను నువ్వేకదా  నన్ను బాగా అర్ధం చేసుకున్నదానివి, ఇంక నా  సంగతి బాగా తెలిసిన దానివి కనుక మనిద్దరిమధ్య ఫార్మాలిటీస్ కి అంత ఇంపార్టెన్స్ లేదని, మర్చిపోయినా నువ్వేమీ అనుకోవని పరవాలేదులే" అని.............. అంటూ ముందరకాళ్ళకి బంధం వేసేస్తుంది మరి. ఇలాంటివి చాలా సార్లే అయ్యాయి లెండి. అందుకే ఈసారి మాత్రం ఎలాగైనా తను చేసి చెపితేనే వినాలి అని నేను పట్టుబట్టి కూర్చున్నాను.

సరే తనింకా రాలేదుగా అని ఎలాగో లంచ్ టైం అయ్యింది  కదాని భోజనం అయ్యిందనిపించానే కానీ ధ్యాసంతా సుమన మీదే . ఇన్ని మంచి క్వాలిటీస్ వున్న అమ్మాయి ప్రతిసారి ఇలానే ఎందుకు చేస్తుందా అని. వచ్చిన తరువాత మాత్రం ఇంక భూమ్మీద తను నిలబడదు, నన్ను నిలబడ నివ్వదు . అంత హడావిడి చేసేస్తుంది. ఈ లోపు ఎదురుచూడడం మాత్రం నేను ఎప్పుడు ఫేస్ చేసే పెద్ద బోరింగ్ ప్రోగ్రాం అనుకోండి. టైం 4 కాస్తోంది ఇంకేం వస్తుంది? ఒకవేళ ఫోన్ చేసినా ఇంక కుదరదు లేవోయ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వేళ్ళయ్యింది అంటుంది. అందుకని ఇంక నేను కూడా ఈ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెట్టి నా పిల్లలు వచ్చే వేళ్ళయ్యిందని లేచి వాళ్ళకు టిఫిన్ ఏర్పాట్లలో పడ్డాను.

తనంటే నాకు క్లోజ్ కనుక నిజంగానే మా మధ్య ఫార్మాలిటీస్ కి అంత ప్రాముఖ్యం లేదు కనుక సరిపోతోంది. ఇలా ఎదుటివాళ్ళ ఫీలింగ్స్ గురించి అంత శ్రద్ధ చేయని వాళ్ళు చాలామందే వుంటారు. కానీ రిలేషన్స్ ని జగ్రత్తగా మెయింటైన్ చెయ్యాలంటే మాత్రం ఇలాంటి చిన్న చిన్న విషయాలమీద శ్రద్ధ చాలా అవసరం. చిన్న ఫోన్ కాల్ లేదా మెసేజ్ పెట్టడం వల్ల అవతల వ్యక్తి మీద మనకున్న కేర్ ని , అభిమానాన్ని వ్యక్తం చేసినవాళ్ళమవుతాము . వాళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్ అనే భావన అవతలి వారిలో మనమీద పాజిటివ్ ఫీల్ ని నింపుతుంది . దాని వల్ల ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య బంధం మరింత బలపడుతుందనేది మాత్రం నిజం. ఇది కేవలం ఫ్రెండ్స్ వరకే కాదు తల్లిదండ్రులు – పిల్లలు, భార్య – భర్తలు, రిలేటివ్స్ఇలా ఎవరి మధ్యనైనా ఇటువంటి చిన్న కేర్ బంధాలను బలపరుస్తుందనేది నా అభిప్రాయం, నమ్మకం. మరి మీది?

18, సెప్టెంబర్ 2013, బుధవారం

జర్నీ (ప్రయాణంలో పదనిసలు)

జర్నీ  (ప్రయాణంలో పదనిసలు)


జోరుగా హుషారుగా షికారు పోదమా 
హాయి హాయిగా తీయతీయగా జోరుగా.....

     ఈ పాట వింటూ కారులో లాంగ్ జర్నీ ఎంత బాగుంటుందో కదా. మేము ఈ హాయినీ , తీయదనాన్ని చాలా సార్లే ఎంజాయ్ చేసాము లెండి . కానీ దారిలో ఏదైనా ఇబ్బంది అయిందంటే వచ్చే చేదుని కూడా ఈ మధ్యనే రుచి చూసాము మేము. ఎలా అంటారా...

     మొన్న వినాయకచవితికి రెండు రోజులముందు బెంగుళూరుకు వెళ్ళడానికి సన్నాహాలు ప్రారంభిస్తే నేనేమో హాయిగా ట్రైన్లో వెళదాం అని అంటే మా సుపుత్రుడు ససేమిరా అని, వెడితే కారులో హాయిగా ఎంజాయ్ చేస్తూ వెళదాము అని ఒకటే పట్టుపట్టాడు. నా ఓటు తప్ప, వాడిది కాక, ఇంట్లో మిగిలిన రెండు ఓట్లు వాడికే పడ్డాయి. ఇంకేముంది నేనుకూడా తప్పని పరిస్థితుల్లో సరే అని దానికే ఊ అనాల్సివచ్చి కారులో బయలుదేరాము . NH 7 హైవే చాలా బాగుంది. నిజంగానే చాలా హాయిగా సాగిపోయాము చీకటి పడేదాకా .

     చీకటి పడ్డాకా దారిలో మా కారుకి ఏదో తగిలి ధబీ మని పెద్ద సౌండ్ . మావారు గభాలున కారు పక్కకి ఆపి చూసాముకదా పెట్రోల ట్యాంక్ కు హోల్ అయ్యింది. బొటబొటబోట మని ఇరవై లీటర్లు పైగా పెట్రోల్ ఒక్కసారిగా మా కళ్ళముందే నేలపాలయిపోయింది .  అసలే ఈ రోజులలో పెట్రోలంటే మాటలా. అందులోను డబ్బుల బాధ కన్నా చూస్తూ చూస్తూ అంత ఫ్యూయల్ ని నేలపాలవుతుంటే చూడడం ఇంకా బాధ.  ఏమి చేయలేము దానిని ఆపడానికి .

     ఇంతకీ ఏమి తగిలిందా అని కొంచెం వెనక్కి నడిచి వెళ్లి చూస్తే పోలీసులు స్పీడ్ కంట్రోల్ కోసం పెట్టె బోర్డు. ఎవరో లారీవాళ్ళో , వేరే వాళ్ళో దానిని అంతకు ముందు గుద్దేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయిన దాని ఫలితం మేము ఇబ్బంది పడడం . కొంచెం ఆగి దానిని పక్కకి జరిపితే వాడి సొమ్మేంపోతుంది చెప్పండి. ఇంకా అది అక్కడే అలానే వుంటే మాలానే వేరేవాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వుంటుందని పాపం మా వారు దానిని పక్కకి పెట్టి వచ్చారనుకోండి . ఇలాంటి విషయాలలో మాత్రం నేను మావారిని మెచ్చుకోక తప్పదనుకోండి. ఏమి చేస్తాం తను గుడ్ బోయ్ మరి. మీరు ఆయనతో నేను ఇలా అన్నానని చెప్పకండి. ఇంక ఆయన ములగచెట్టు దిగరు. మనం పట్టుకోలేము .

     ఇది ఒక ఎత్తయితే టైం ఎంత అని చూసేసరికి రాత్రి ఒంటిగంట . అప్పుడు మొదలయ్యింది నాలో కంగారు. అర్ధరాత్రి, హైవే  , నిర్జనప్రదేశం , వంటిమీద బంగారం, పక్కన ఆడపిల్ల . ఎవరినైనా ఆపి హెల్ప్ అడగలన్నా భయం. ఆడపిల్ల పుట్టిందని ప్రతిక్షణం మురిసిపోయే నేను మొదటిసారిగా ఆడపిల్ల అంటే భయపడడం జరిగింది. నాకే ఆశ్చర్యం వేసింది . మనం మన దేశంలోనే వుండి బ్రతకడానికి ఇంత భయపడవలసిన పరిస్తితి ఏమిటా అని. కానీ అవసరం వుండి కూడా డేర్ చేసి బయటికి మన పని మీద మనం వెళ్లడానికి వీలు కాని పరిస్తితికి కారణం ఎవరు అని ఆలోచిస్తే సమాధానం మాత్రం కేవలం మనమే అనేది మాత్రమే దొరుకుతోంది . బహుశా మీ అందరికి కూడా అదే సమాధానం దొరుకుతూ ఉండో చ్చేమో .

      లోపల కారులోనే ఉండు అని చెపితే అర్ధంకాక , నాన్న వెనక క్యూరియస్ గా తిరిగే చురుకైన ,అమాయకపు చిన్నపిల్ల తను. అంత భయపడకోయ్ అనే అసలు భయం పట్టని మావారు. ఇంక నా కొడుకైతే సరేసరి . ఫరలేదులే అమ్మా నేను , డాడీలేము అంటాడు వాడు .  నా పాట్లు ఆ దేవుడికే తెలియాలి.

     ఇంతలో మా వారు హై వే పోలీసులకు ఫోన్ చేసి ఏదన్నా హెల్ప్ దొరుకుతుందేమో అని చూసారు. వాళ్ళు ఆక్సిడెంట్ అయ్యి ఇంక గొడవ జరుగుతూ ఉంటేనే వస్తారుట లేకపోతే రారుట. అలాగే హై వే హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేస్తే మొత్తానికి బండి తుక్కుతుక్కు అయిపోతే పక్కకి పడేయడానికి వస్తారుట అదేట వాళ్ళ డ్యూటీ .పోనిలే బాబూ అంత అవసరం రాకుండా భగవంతుడు దయ తలచాడు అని అనుకోవలసి వచ్చింది వాళ్ళ సమాధానాలు విన్నాక.

      ఒక గంటా గంటన్నర ఇలా గడిచాకా రిపేర్ షాప్లు కూడా పొద్దుటిదాకా తెరవరు కనుక మీరు బస్సులో  బెంగుళూరు వెళ్ళిపొండి నేను రేపు రిపేర్ చేయించుకుని వచ్చేస్తాను అని మావారు అనగానే నాకు ఇంకా భయం వేసింది. ఎందుకా అని అనుకుంటున్నారా? ఏమి లేదండి నాకు పుట్టింటికి వెళ్ళడానికి ఇక్కడ ఈయన ట్రైన్ ఎక్కిస్తే అక్కడ (ఉండేది ఒక్క బస్సు స్టాప్ , ఒక్క రైల్వే స్టేషనే  కాబట్టి) నాన్నగారు వచ్చి రిసీవ్ చేసుకోవడమే తెలుసు మరి.  వేరే ఎక్కడికి నేను ఒక్కత్తినే వెళ్ళిన అలవాటు, ఆలోచన కూడా లేని దాన్ని మరి.  నిజమండి.

      అలాంటిది బెంగుళూరు అంటే మాటలా, ఎన్ని ఏరియాలో , ఎన్ని రైల్వే స్టేషన్లో, ఎన్ని బస్సు స్టాప్లో  . వెళ్ళగలిగితే అక్కడికి మా తమ్ముడు వస్తాడనుకోండి, కానీ నా భయం నాది. ఎంతైనా సొంత ప్రాణం కదండీ . నా వల్ల కాదంటే కాదని ససేమిరా అనేసా.

     ఇంక తప్పేది లేక మావారు కనీసం హైదరాబాదు బస్సు ఎక్కు నేకు తెలియకపోతే పిల్లలకకి  తెలుసు అనేసారు. నా అభిప్రాయంతో పని లేకుండా. మా అబ్బాయి కూడా భరోసా ఇవ్వడంతో కొంచే భయంగానే అనిపించినా కూడా రోడ్డుమీద ఆడపిల్లతో రిస్క్ తీసుకోవడం కన్నా అదే మంచిదని హైదరాబాదు వెళ్ళే బస్సు రిక్వెస్ట్ మీద అక్కడే ఆపి ఎక్కి హైదరాబాదు చేరడం జరిగింది.  బస్సు లక్డీకాపూల్ ట అక్కడ ఆగింది . అక్కడ ఆటో ఎక్కించాడు మా అబ్బాయి. ఒక్కదారి ఎప్పుడూ చూసిన దాఖలా కనిపించలేదు నాకు .  నీకు దారి తెలుసురా అంటే వాడు పరవాలేదు అంటాడే కానీ గారెంటీ ఇవ్వడు. ఆటో డ్రైవర్ ఎటు వెళ్ళాలండి అని అడిగితె ఏమి చెప్పాలా అని నాకు ఒకటే టెన్షన్.  నా అదృష్టం బాగుండి ఆ ఆటో డ్రైవర్ ఎలాంటి ప్రశ్నలు వెయ్యకుండానే మా ఏరియాకు తీసుకువచ్చాడు కాబట్టి సరిపోయింది. తెలిసిన ఏరియాకు వచ్చాకా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను నేను. ఇల్లు చూసాక అయితే ప్రాణం లేచొచ్చిం దంటే నమ్మండి.  మా వారు రావడనికయితే పాపం రాత్రి అయ్యింది. (ఆయన కారుని ఎలా రిపైర్ చేయించుకున్నారు అనేది ఒక పోస్ట్ కు సరిపడే విషయం).

     ఇంత టెన్షన్ , భయం ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల మన అనుభవిస్తున్నాం అంటే మన సమాజం ఎంత ఇన్సేక్యుర్ గా  తయారయ్యిందో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా వుంది. దానిని సరిదిద్దుకోవలసిన అవసరం దేశ పౌరులందరి మీదా వుంది. మనం తప్పుడు పద్దతులను ప్రోత్సహించకూడదు, చూసి చూడనట్లు ఊరుకోకూడదు, తప్పును తప్పు అని చెప్పడానికి సమిష్టిగా కృషి చేయవలసి వుంది. అనే నిజాలను అందరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఈ రోజు మన దేశ  పరిస్తితులను బట్టి ఎంతైనా ఉంది.

      పక్క మనిషిని నమ్మలేని పరిస్తితి మన భారత దేశంలో వుంది అంటే మిగతా ప్రపంచానికి మన దేశానికి తేడా లేదనే కదా.

     ఇంతకీ ఇదండి మా హాయి హాయి జర్నీ లోని చెడు అనుభవం. సో జర్నీ లో జాగ్రత్త సుమండి . తప్పు మనది కాకపోయినా ఒక్కొక్క సారి మనం ఇబ్బంది పడవలసి వస్తుంది. అలా అని మానేసి ఇంట్లో కూర్చోలేముకదా.  మీ ప్రయాణాలు ఎప్పుడూ తియ్యగానే సాగిపోవాలని కోరుతూ...............


                                                                                                                                                                                 శారద విభావరి 

                                                                                                       

                                                                                                             

     



     

    

     

     


25, ఆగస్టు 2013, ఆదివారం

హౌస్ వైఫ్



హౌస్ వైఫ్

పక్కింటి సరళ ని చూసినప్పుడల్లా శ్రావణి ఆలోచనలో పడిపోతుంది. హాయిగా 9 కొట్టేసరికల్లా మంచి ఇస్త్రీ చీర కట్టుకుని హ్యాండ్ బాగ్ భుజాన వేసుకుని టిప్పుటాపుగా వాళ్ళాయన సుబ్బారావుతో బండిమీద ఆఫీసుకి వెళ్ళిపోతుంది. నేను వున్నాను చదువుకుని ఎందుకు ఎంతసేపు అంట్లు, పిల్లలు, చాకిరీ. గంజిపెట్టిన చీర కట్టుకోవాలన్నా వందసార్లు ఆలోచించాలి. ఇంట్లోనే వుండే దానికి అవసరమా ఇస్త్రీ పడయిపోతుంది అని. ఒకవేళ బయటికి వెళ్ళినా సరళ అంత హుందాగా పనివుండి వెళ్ళిన ఫీలింగ్ ఏం వుంటుంది అని. కాలక్షేపానికి షాపింగ్ కి వెళ్లినట్టు వుంటుంది . హూ ...     ఏంచేస్తాం ఎంత రాసి పెట్టి వుంటే అంతే ప్రాప్తం అని ...

శ్రావణికి వుద్యోగం చెయ్యాల్సిన అవసరం లేదు. దానితో ఇంట్లోవాళ్ళు, తను తన వుద్యోగం మీద అంతగా శ్రద్ధ చేయలేదు. శ్రావణి భర్త శ్యాం కూడా ఎందుకోయ్ ఉద్యోగం తో శ్రమ పడటం, హాయిగా ఇంట్లో వుండక అంటాడు . తను కూడా పెద్దగా శ్రద్ధ చెయ్యక పోవడంతో హౌస్ వైఫ్ గా స్తిరపడిపోయింది. వెళితే కాదనే వాళ్ళు లేరు, మానేస్తే వద్దనేవాళ్ళు లేరు . కానీ ఉద్యోగాస్తురాళ్ళను చూస్తే శ్రావణికి కొంచెం లోటనిపిస్తుంది.

నిజమే మరి ఈ రోజుల్లో ఉద్యోగాలు చెయ్యాలి అనుకుంటే చాలా అవకాశాలే వున్నాయి. అందులోను ఒకసారి తీసుకున్న నిర్ణయం ఇంక ఎప్పటికి నచ్చాలని లేదుకదా. ఈ వాళ్ళ కావాలనుకున్నది రేపు వద్దనిపించోచ్చు. అలానే శ్రావణి లాంటి చాలా మంది హౌస్ వైఫ్ ల పరిస్తితీను .

పిల్లల చిన్నప్పుడు వాళ్ళ ఆలన పాలనా ముఖ్యం కనుక శ్రావణి అప్పటికి ఆ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కాలేజీ కి వచ్చిన పిల్లలకి అన్ని టైం కి అవిరిస్తే సరిపోతోంది. పూర్వం లా వాళ్ళ వెంట పరుగెత్తి తినిపించాలి, దగ్గర కూర్చుని హోం వర్క్ చేయించాలి అనే అవసరం వుండక పోవడంతో ఇప్పుడు తనకి చాల ఖాళీ సమయం దొరుకుతోంది. ఇంత ఖాళీ సమయాన్ని తను ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచనా తెగటంలేదు .

తను ఇప్పుడు తన పాత అభిరుచులకు మెరుగు పెడదామన్నా ఇప్పుడు ఈ వయసులో అంత అవసరమా అనిపించడం చాలా సహజం. చాలామంది పెద్దవాళ్ళు సమాజసేవ అలవాటు చేసుకుంటే సరి అని చాల తేలికగా అనేస్తారు. అలాంటివి మామూలుగా అంత సులువా.  నలుగురికి ఉపయోగపడడం గోప్పవిషయమే కానీ అంది అందరికీ సాధ్యపడే విషయమా. హౌస్ వైఫ్ అంటే మరీ అంత స్వతంత్రురాలా?

మరి శ్రావణి ఇలా ఆలోచిస్తూంటే అటు శ్రావణి దృష్టిలో ఎంతో అద్రుష్టవంతురలై న సరళ ఏమాలోచిస్తోందో.

మరి మీరేమంటారు?

21, ఆగస్టు 2013, బుధవారం

భగవద్గీత పారాయణం 12







 రచన: వేద వ్యాస

అథ దశమో‌உధ్యాయః |

శ్రీభగవానువాచ |
భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః |
యత్తే‌உహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా || 1 ||


న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః |
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః || 2 ||


యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ |
అసంమూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే || 3 ||


బుద్ధిర్ఙ్ఞానమసంమోహః క్షమా సత్యం దమః శమః |
సుఖం దుఃఖం భవో‌உభావో భయం చాభయమేవ చ || 4 ||


అహింసా సమతా తుష్టిస్తపో దానం యశో‌உయశః |
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః || 5 ||


మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా |
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః || 6 ||


ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః |
సో‌உవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః || 7 ||


అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే |
ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః || 8 ||


మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్ |
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ || 9 ||


తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ |
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే || 10 ||


తేషామేవానుకంపార్థమహమఙ్ఞానజం తమః |
నాశయామ్యాత్మభావస్థో ఙ్ఞానదీపేన భాస్వతా || 11 ||


అర్జున ఉవాచ |
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ |
పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుమ్ || 12 ||


ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా |
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే || 13 ||


సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ |
న హి తే భగవన్వ్యక్తిం విదుర్దేవా న దానవాః || 14 ||


స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ |
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే || 15 ||


వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః |
యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి || 16 ||


కథం విద్యామహం యోగింస్త్వాం సదా పరిచింతయన్ |
కేషు కేషు చ భావేషు చింత్యో‌உసి భగవన్మయా || 17 ||


విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన |
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే‌உమృతమ్ || 18 ||


శ్రీభగవానువాచ |
హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః |
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే || 19 ||


అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః |
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ || 20 ||


ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ |
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ || 21 ||


వేదానాం సామవేదో‌உస్మి దేవానామస్మి వాసవః |
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా || 22 ||


రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్షరక్షసామ్ |
వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహమ్ || 23 ||


పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ |
సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః || 24 ||


మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ |
యఙ్ఞానాం జపయఙ్ఞో‌உస్మి స్థావరాణాం హిమాలయః || 25 ||


అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః |
గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః || 26 ||


ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ |
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్ || 27 ||


ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ |
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః || 28 ||


అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ |
పితూణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ || 29 ||


ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ |
మృగాణాం చ మృగేంద్రో‌உహం వైనతేయశ్చ పక్షిణామ్ || 30 ||


పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ |
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ || 31 ||


సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున |
అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్ || 32 ||


అక్షరాణామకారో‌உస్మి ద్వంద్వః సామాసికస్య చ |
అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః || 33 ||


మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్ |
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా || 34 ||


బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ |
మాసానాం మార్గశీర్షో‌உహమృతూనాం కుసుమాకరః || 35 ||


ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ |
జయో‌உస్మి వ్యవసాయో‌உస్మి సత్త్వం సత్త్వవతామహమ్ || 36 ||


వృష్ణీనాం వాసుదేవో‌உస్మి పాండవానాం ధనంజయః |
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః || 37 ||


దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ |
మౌనం చైవాస్మి గుహ్యానాం ఙ్ఞానం ఙ్ఞానవతామహమ్ || 38 ||


యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున |
న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్ || 39 ||


నాంతో‌உస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప |
ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా || 40 ||


యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా |
తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోం‌உశసంభవమ్ || 41 ||


అథవా బహునైతేన కిం ఙ్ఞాతేన తవార్జున |
విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్ || 42 ||


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
విభూతియోగో నామ దశమో‌உధ్యాయః ||10 ||

16, ఆగస్టు 2013, శుక్రవారం

12, ఆగస్టు 2013, సోమవారం

భగవద్గీత పారాయణం 11



రచన: వేద వ్యాస

అథ నవమో‌உధ్యాయః |

శ్రీభగవానువాచ |
 

ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే |
ఙ్ఞానం విఙ్ఞానసహితం యజ్ఙ్ఞాత్వా మోక్ష్యసే‌உశుభాత్ || 1 ||


రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ |
ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ || 2 ||


అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప |
అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్త్మని || 3 ||


మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా |
మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః || 4 ||


న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ |
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః || 5 ||


యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్ |
తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ || 6 ||


సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ |
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ || 7 ||


ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః |
భూతగ్రామమిమం కృత్స్నమవశం ప్రకృతేర్వశాత్ || 8 ||


న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ |
ఉదాసీనవదాసీనమసక్తం తేషు కర్మసు || 9 ||


మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్ |
హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే || 10 ||


అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ |
పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్ || 11 ||


మోఘాశా మోఘకర్మాణో మోఘఙ్ఞానా విచేతసః |
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః || 12 ||


మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః |
భజంత్యనన్యమనసో ఙ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ || 13 ||


సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః |
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే || 14 ||


ఙ్ఞానయఙ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే |
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ || 15 ||


అహం క్రతురహం యఙ్ఞః స్వధాహమహమౌషధమ్ |
మంత్రో‌உహమహమేవాజ్యమహమగ్నిరహం హుతమ్ || 16 ||


పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ || 17 ||


గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణం సుహృత్ |
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ || 18 ||


తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ |
అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున || 19 ||


త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యఙ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే |
తే పుణ్యమాసాద్య సురేంద్రలోకమశ్నంతి దివ్యాందివి దేవభోగాన్ || 20 ||


తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |
ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే || 21 ||


అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || 22||
 

యే‌உప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః |
తే‌உపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకమ్ || 23 ||


అహం హి సర్వయఙ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభిజానంతి తత్త్వేనాతశ్చ్యవంతి తే || 24 ||


యాంతి దేవవ్రతా దేవాన్పితూన్యాంతి పితృవ్రతాః |
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినో‌உపి మామ్ || 25 ||


పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః || 26 ||


యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ |
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ || 27 ||


శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి || 28 ||


సమో‌உహం సర్వభూతేషు న మే ద్వేష్యో‌உస్తి న ప్రియః |
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ || 29 ||


అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |
సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః || 30 ||


క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్ఛతి |
కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి || 31 ||


మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే‌உపి స్యుః పాపయోనయః |
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తే‌உపి యాంతి పరాం గతిమ్ || 32 ||


కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్ || 33 ||


మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః || 34 ||


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
రాజవిద్యారాజగుహ్యయోగో నామ నవమో‌உధ్యాయః ||9 ||

6, ఆగస్టు 2013, మంగళవారం

భగవద్గీత పారాయణం 10



రచన: వేద వ్యాస
అథ అష్టమో‌உధ్యాయః |
అర్జున ఉవాచ |
 

కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ |
అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే || 1 ||


అధియఙ్ఞః కథం కో‌உత్ర దేహే‌உస్మిన్మధుసూదన |
ప్రయాణకాలే చ కథం ఙ్ఞేయో‌உసి నియతాత్మభిః || 2 ||


శ్రీభగవానువాచ |
అక్షరం బ్రహ్మ పరమం స్వభావో‌உధ్యాత్మముచ్యతే |
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంఙ్ఞితః || 3 ||


అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ |
అధియఙ్ఞో‌உహమేవాత్ర దేహే దేహభృతాం వర || 4 ||


అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరమ్ |
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః || 5 ||


యం యం వాపి స్మరన్భావం త్యజత్యంతే కలేవరమ్ |
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః || 6 ||


తస్మాత్సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ |
మయ్యర్పితమనోబుద్ధిర్మామేవైష్యస్యసంశయమ్ || 7 ||


అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా |
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ || 8 ||


కవిం పురాణమనుశాసితారమణోరణీయంసమనుస్మరేద్యః |
సర్వస్య ధాతారమచింత్యరూపమాదిత్యవర్ణం తమసః పరస్తాత్ || 9 ||


ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ |
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్స తం పరం పురుషముపైతి దివ్యమ్ || 10 ||


యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః |
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే || 11 ||


సర్వద్వారాణి సంయమ్య మనో హృది నిరుధ్య చ |
మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణామ్ || 12 ||


ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ |
యః ప్రయాతి త్యజందేహం స యాతి పరమాం గతిమ్ || 13 ||


అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః |
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః || 14 ||


మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ |
నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః || 15 ||


ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినో‌உర్జున |
మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే || 16 ||


సహస్రయుగపర్యంతమహర్యద్బ్రహ్మణో విదుః |
రాత్రిం యుగసహస్రాంతాం తే‌உహోరాత్రవిదో జనాః || 17 ||


అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే |
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంఙ్ఞకే || 18 ||


భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |
రాత్ర్యాగమే‌உవశః పార్థ ప్రభవత్యహరాగమే || 19 ||


పరస్తస్మాత్తు భావో‌உన్యో‌உవ్యక్తో‌உవ్యక్తాత్సనాతనః |
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి || 20 ||


అవ్యక్తో‌உక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్ |
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ || 21 ||


పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా |
యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ || 22 ||


యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః |
ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ || 23 ||


అగ్నిర్జోతిరహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్ |
తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః || 24 ||


ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ |
తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే || 25 ||


శుక్లకృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే |
ఏకయా యాత్యనావృత్తిమన్యయావర్తతే పునః || 26 ||


నైతే సృతీ పార్థ జానన్యోగీ ముహ్యతి కశ్చన |
తస్మాత్సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున || 27 ||


వేదేషు యఙ్ఞేషు తపఃసు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ |
అత్యేతి తత్సర్వమిదం విదిత్వాయోగీ పరం స్థానముపైతి చాద్యమ్ || 28 ||


ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

అక్షరబ్రహ్మయోగో నామాష్టమో‌உధ్యాయః ||8 ||