8, ఫిబ్రవరి 2019, శుక్రవారం

కాలక్షేపం

 కాలక్షేపం



చాల రోజులయ్యిందండి బ్లాగ్ రాసి, దాదాపు ఏడాది ఐపోతోంది. ఈ ఏడాది ఎలా ఇపొయిందో తెలియనంత త్వరగా ఐపోయింది నాకైతే. ఈ ఏడాది మాత్రమే కాదు లెండి నా లైఫ్ అంతా  ఇప్పటిదాకా ఎలా ఇపొయిందో తెలియనంత  స్పీడ్ గా ఐపోయింది.  ఇంకా స్కూల్ కి వెళ్లే రోజులు, కాలేజ్  రోజులు, అలా దొర్లిపోయి పెళ్లి, పిల్లలు, వాళ్ళు ఎదగడం అన్ని స్పీడ్ స్పీడ్ గా  ఐపోతున్నాయి. ఏమిటో కాలం పరుగెడుతోంది, అందరికీనా లేక నాకేనా. యెంత తొందరగా కాలం పరుగెత్తినా ఎక్కడో ఏదో తోచటం లేదు అనే మాట మాత్రం పోవటం  లెదు. అది కూడా నా  ఒక్కత్తికే ఉంటుందేమో. పూర్వం అమ్మమ్మ, అమ్మ ఉద్యోగాలు చెయ్యలేదు ఐనా వాళ్ళకి ఎప్పుడు తోచటం లేదు అనే మాటే లేదు. ఇప్పుడు అక్కర్లేని కాలక్షేపాలు ఎన్ని ఉన్న ఈ తోచక పోవటం ఏమిటో.  ఎంతసేపు చేస్తాము పని అనిపిస్తుంది ఒక్కోసారి.  ఇంకోసారి యెంత చేసిన తెమలేదేం అనిపిస్తుంది.  TV  చూసినా ఎంత  ఎంతసేపు చూస్తాము.  నాలాంటి  వాళ్ళకి అసలే అవ్వదు. ఒక సీరియల్ చూసే అలవాటు లేదు పోనీ అలవాటు చేసుకుందామా అన్నా నచ్చదు. ఇంతకూ ముందు వంటల ప్రోగ్రాంలు, చేసిచూద్దాం ప్రోగ్రాంలు చూసి అవి ఇవి తగలేసేదాన్ని. ఇప్పుడు ఆ సరదాలు ఐపోయాయి. కొత్తగా యూ ట్యూబ్, దాన్ని ఉద్దరించేసా చాల వరకు. అది కూడా బోర్ కొట్టేసింది మరి.  ఇంకా ఏం చెయ్యాలో టైం గడవడానికి అని వెతికే పని మళ్ళి మొదలు. ఆ మధ్య ఒక షార్ట్ ఫిలిం చూసాను యంగ్ మదర్ అంటే 40 to 50 ఇయర్స్ కె పిల్లలు పెద్ద ఐపోయిన తల్లుల ఇబ్బందులు. వీళ్ళు కొత్తగా కెరియర్ స్టార్ట్ చెయ్యలేరు, ఇంట్లో వీళ్ళమీద ఆధార పడే పిల్లలు ఉండరు, అంటే వండడం వరకే వీళ్ళ పని. వీళ్ళకి వేరే ముఖ్యమైన ఆలోచనలకి కూడా అంతగా ఆస్కారం లేని టైం. ఎందుకంటె ట్రెండ్ కి తగ్గ ఆలోచనలు చేసే వయసు దాటి పోతూ తరవాతి తరాన్ని మోటివేట్  చేసే అవగాహనా తగ్గిపోయే ఏజ్ maybe . నిజమో కాదో తెలియదు కానీ అమ్మకి ఏం తెలుసు వీటి గురించి అని పిల్లలకి అనిపించే వయసు అని నా ఉద్దేశం.  ఇంకా ఏం  ప్రయోజనం అని మనమే ఆగిపోవాలి అని నాకు అనిపిస్తుంది. అన్ని పనులు మనమే చేసుకున్నా నాకు టైం ఎందుకు గడవదు అనేది పెద్ద ప్రశ్నయే.  మీకు తెలిస్తే కొంచెం చెప్పరూ, నేర్చుకుంటాను.

11, మార్చి 2018, ఆదివారం

పుత్రోత్సాహము

డెలివరీ రూమ్ లో డాక్టర్, అమ్మా శారద చాల కష్టపడ్డావు ఇదిగో నీ కొడుకు చూడు అన్నారు. మొదటిసారి పెద్ద పెద్ద కళ్ళు బొద్దుగా ముద్దుగా ఉన్న కొడుకుని చూడగానే రాత్రంతా పురిటి నెప్పులతో పడ్డ కష్టం ఒక్కసారిగా మాయమైపోయిన అనుభూతి . వాడికి 6 నెలలు వయసు లో healthy  baby షో లో prize సంపాదించినా మొదటి పుత్రోత్సాహము.

2 ఏళ్ళు వచాయి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు  మొదలు పెడదాం అని క్రెష్ లో వేసి వస్తుంటే వాడి భయం , మధ్యాహ్నం తీసుకు రావడానికి వెళ్ళే సరికి వాడి ముఖంలో ఆనందం  ఇంకా  గుర్తున్నాయి నాకు .ఇంత చిన్న పిల్లాడిని వదిలేసి ఉద్యోగాలు అవసరమా అనిపించింది.

ఇంతలో 3 1/2 ఏళ్ళు  రానే వచ్చాయి. బడి కి తప్పక పంపాల్సిన వయసు.  LKG లో  చేర్చే మొదటి రోజు నేను నర్సరీ, ప్లే స్కూల్ కి పంపలేదు లెండి ,  ఆ సర్టిఫికేట్ LKG కి అవసరం లేదని.  పిల్లలందరినీ క్లాసు లోకి పంపి  పేరెంట్స్ ని మాత్రం బయట ఒక పక్కన పిల్లలకి కనిపించని ప్లేస్ లో కూర్చోబెట్టారు.  మనకి పిల్లలు అడపా దడపా కనిపిస్తూ వుంటారు. లోపలికి వెళ్ళేప్పుడు school అంటే ఆటలు, పాటలు, ఫ్రెండ్స్ చాలా బాగుంటుందని  చెప్పి చెప్పి ( రెండోసారి (చెప్పి) పొరబాటుగా రాయలేదండి చెప్పి చెప్పి పంపానన్నమాట) పంపడం వల్ల హుషారుగానే లోపలికి వెళ్ళాడు. ఒక అరగంట తరవాత గేమ్స్ పీరియడ్ అని బయటకి తీసుకు వచ్చారు పిల్లలని. అంతే అందరు పేరెంట్స్ ని చూడగానే మొహాలు ఇంత ఇంత చేసుకున్నవాళ్ళు కొంతమంది, బిక్క మొహాలుతో ఏడుపు లంకించు కున్నవాళ్ళు కొంతమంది.  ఇంకా క్లాసు కి వెళితే ఒట్టు.  మొదటి  రోజు school అలా జరిగింది . ఈ లోపే మా వాడు ఒక తిట్టు నేర్చేసుకుని వచ్చి ఇంట్లో ప్రయోగించేసాడు.  దాని ఫలితం మూతి మీద చిన్న దెబ్బ .  అమ్మ చేత్తో అది వాడి మొదటి దెబ్బ. దానితో ఇప్పటికి వాడు పరుషంగా మాట్లాడాడు (ఇంట్లో ఖచితంగా ).

LKG అంతా బాగానే జరిగాకా ఇంక  UKG , అదీ ఫుల్ డే school.  బాక్స్ లో lunch తినాలి . ఇంటికి పంపరు. రోజు వెళ్లి గంట తినిపించడం హడావిడి . ఈ లోపు సెకండ్ pregnancy నెలలు నిండి వెళ్ళలేని పరిస్తితి . నా ఇబ్బందికి పాపం LKG టీచర్ గారు నువ్వు రాకమ్మా నీ కొడుక్కి నేను తినిపిస్తాను అంటూ  వాడికి అన్నం తినిపించేవారు. అప్పుడు  అనిపించింది వాడు చెప్పే రైం chubby cheecks dimple chin............టీచర్స్ pet అని.

ఇంక tenth class exams హడావిడి జాగ్రత్తలు చెపుతుంటే అమ్మ నువ్వు రా అంటూ . నాన్న దింపు తారుగా అన్నా అయినాసరే ఇద్దరు రండి అంటూ.  ఇద్దరం వెళ్లి ఏదో exam మేమే రాస్తున్నట్టు exam అయ్యేదాకా center దగ్గరే ఉండి వాడు బయటికి వచ్చి బాగా రాసాను అన్నాకా ఊపిరి పీల్చుకుని tenth మొదటి exam అలాగా. తరువాత second exam నుండి వాడే వెళ్ళా డనుకోండి.

ఇంటర్ గడిచింది డిగ్రీలో జాయిన్ అయ్యాడు. వాడు ఇంటర్ లో మాకు తెలియకుండా చేసిన పని మాకు అప్పటికి తెలియలేదని వాడి కడుపునొప్పి. ఏమిటా అనుకుంటున్నారు కదా చెపుతాను వుండండి .హాలిడే ట్రిప్ కి వెళ్ళాము ముంబై జుహు బీచ్ లో మా అమ్మాయి మావారు sea water లో దూరంగా ఆడుకొంటున్నారు మా వాడు నేను ఇసుకలో కూర్చుని కబుర్లు చెప్పు కొంటున్నాము . అమ్మ నీకో విషయం చెప్పాలి నువ్వు తిట్టకు అంటూ మొదలెట్టాడు. ఏం కొంప ముంచాడో అని కంగారు పడుతుంటే ఇంటర్ లో collage బంద్ రోజు నేను మీకు చెప్పకుండా ఫ్రెండ్స్ తో మూవీ కి వెళ్ళాను అన్నాడు .హమ్మయ్య అని మనసులో అనుకుని పైకి మాత్రం కొంచెం కోపం చూపించి ఎన్నిసార్లు అన్నాను వాడు కొంచెం బెరుకుగా ఒక్కసారే అమ్మా అన్నాడు. డబ్బులు ఎక్కడివి అన్నాను మీరు emergency కి ఇచ్చిన  డబ్బులు  అన్నాడు.  సరే ఇంకెప్పుడు చెప్పకుండా వెళ్ళకు అన్నాను .  ఇంత easyగా తీసుకుంటావని అనుకోలెదమ్మ నువ్వు అంటూ ఆనందపడిపోయాడు. తప్పు అనిపించినదానికి వాడి గిల్టీ వాడికి వున్నందుకు  పరవాలేదు  మంచి  దారిలోనే  వున్నాడు  అనుకున్నాను.

ఇంతకీ ఎందుకు చెపుతున్నాను ఇందులో పుత్రోత్సాహము ఏమిటి అనుకొంటున్నారు కదా. అమ్మకి పిల్లలతో ప్రతి క్షణం పుత్రోత్సాహమే కదండీ. ఆడపిల్ల అయితే ఏమిటి అనకండి దానిని ఏమంటారో నాకు తెలియదు కానీ word తెలియకపోయినా ఆడపిల్ల తో కూడా ప్రతి క్షణం ఆనందమే , ఉత్సాహమే,  అపురూపమే.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఈ రోజు మా వాడు campus  లో select అయిన job(training) కి మొదటి రోజు .  పాపం  పొద్దున్నే 6 గంటలకి వెళ్ళాడు ఇంట్లోంచి ఒక అరగంట బండిమీద metro station కి వెళ్లి అక్కడ నుండి ఒక గంట metro train లో ప్రయాణం చేసి అక్కడ నుండి cab లో ఒక 45 నిమిషాలు ప్రయాణం చేసి office కి వెళ్ళాడు. పాపం రోజంతా ఏం తిన్నాడో ఏమో రాత్రి  9 అయ్యింది ఇంకా రాలేదు అని  ఎదురు చూస్తుండగా 9.30 కి చేరాడు ఇంటికి . ఇంచుమించు వాళ్ళ నాన్న ఎత్తుకుని లోపలి తీసుకు వచ్చారా అన్నంత అలసటగా.  వస్తూనే బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోతూ కూర్చోలేను నాన్న పడుకుంటాను అంటూ. భోజనం రా అంటుంటే అమ్మా తినిపించు అంటూ బెడ్ మీద కూర్చుండిపోయాడు.  అటు అమ్మమ్మ, తాతగారు. ఇటు మామ్మ కాల్ చేసి ఎలా వుంది ఆఫీస్ అంటే మా వారు వాళ్ళ అమ్మ తినిపించేలా వుంది అని నవ్వారు. 

అమ్మకి  పుత్రోత్సాహము  అదే కదండీ. పిల్లలు యెంత పెద్దవాళ్ళు  అయినా అమ్మ తినిపించవూ అంటే ఆనందం కదా . ఇదన్న మాట పుత్రోత్సాహము. మీరు ఒప్పుకొంటారు కదా.


22, మే 2017, సోమవారం

పెళ్లి రోజు కానుక (Surprise)

ఎంతైనా మీరు మరీ తెలివైన వారు కదా surprise అని చెప్పి ఓ  అరతులం బంగారం తో సరిపెట్టేసారు పెళ్లిరోజు gift అని దెప్పడం నా వంతు అయ్యింది కాని మా వారు ఒక చిన్న చిరుమందహసంతో సరిపెట్టేసరికి మూతి తిప్పడం తప్ప ఇంకేమి అనలేకపోయాను . మొదటి నుంచి మా వారు ఇంతే. మొదటిలో చిన్న పిల్లనేమో చేతిలో కొత్త వస్తువు రావడమే అపురూపం అనిపించేది. దానిలో అది చిన్నదో పెద్దదో ఉపయోగ పదేదో కాదో  తెలుసుకునే వయసు లేదు. మా బావ నాకోసం తెచ్చాడు వరకే తెలుసు మరి . పెద్దవి కొన్న రోజులు వున్నాయనుకోండి . అవి surprise లు కావు . మా వారు surprise అన్నారో ఆ time నాకు పెద్ద gift రాదని అర్ధం అన్నమాట. సరే ఏం చేస్తాం ఎలాను తిరుపతి కూడా తీసుకువెళ్లటం లేదు కనీసం ఉదయాన్నే గుడికైనా పెందరాలే తీసుకువెళ్ళండి అని last మాట మనదైతే వుండే satisfaction కోసం దేప్పినట్టు నటించి ఊరుకున్నాను.

మొత్తానికి మావారి gift కే సరిపెట్టుకుని గుడికి వెళ్లి అటునుంచి అటు బయట tiffin కానిచ్చి తిరిగి వస్తుంటే ఫోన్ ring అయ్యింది. ఎవరా అని చూస్తె police station నుంచి . ఇదేంటి పోలీసులు హడావిడి అనుకొంటున్నారా వుండండి వస్తున్నాను. మొన్న January లో హ్యాండ్ బాగ్ పాయిందని complaint చేసింది మీరేకదా  దొంగ దొరికాడు ఇంకా పూర్తిగా అతని దొంగతనం ఒప్పుకోలేదు ఒప్పుకోగానే కాల్ చేస్తాము station కి రండి అని. మాకు చాల ఆశ్చర్యం అనిపించింది.  ఎప్పుడో నాలుగు నెలల క్రితం ఒక functionలో నా హ్యాండ్ బాగ్ పోయింది . పోయింది కాదు లెండి నా అజాగ్రత్త  అనే చెప్పాలి. కింద గ్రౌండ్ ఫ్లౌర్ లో బాగ్ పెట్టి ఫస్ట్ ఫ్లోర్ లో lunch చెయ్యడానికి వెళ్ళాను. అందరు పెట్టారు నేనోక్కత్తినే కాదుకదా అనే ధైర్యం తో కాని అందరి బాగ్ లు వున్నాయి ఏదో నాలాంటి ఒకల్లిద్దరివి తప్ప అందులోను మన దానిలో విలువలు ఎక్కువవి పోయాయి. స్మార్ట్ ఫోన్ ఒకటి, పాతిక వేలు డబ్బులు, కార్డు లు వగైరా వగైరా.  బాగ్ పోవడం ఒక వంతు ఐతే అది మా గురువుగారి పుట్టిన రోజు function కావడం ఒకఎత్తు. sentimental గా చాల బాధ వేసే వెషయం ఇపోయింది . ఇంకేం దొరుకుతుంది లే అని అనుకొంటున్నా సమయంలో అక్కడ పరిచయమైన రిటైర్డ్ police ఆఫీసర్ ఒకరు కంప్లైంట్ ఇవ్వండి వదిలేస్తే ఎలా అనగా పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చేసినా అది దొరుతుందన్న నమ్మకం ఐతే మాలో లేదు.

పోలీసులు రావడం అక్కడి CC కెమెరాలలో రికార్డు ఇనవి చూడడం క్లారిటీ లేదు సో ట్రై చేస్తాముఅని చెప్పడం జరిగింది. మా వారి classmate ఒకరు police ఆఫీసర్ ఆయనకూడా అంత easy కాదురా CC Tv footages కూడా సరిగా లేవుకదా సో దొరకడం కష్టమే కానీ ఒకసారి నేను కనుక్కుంటాను అన్నారు కానీ నమ్మకంగా చెప్పలేను అని అన్నారు. ఇంకా ఆయన అలా అనేసరికి ఇంకేం విసిగిస్తాములే పోలీసులను అని మేము కూడా దొరికిందా అని అడిగిన పాపానకూడా పోలేదు .

ఇక్కడ మీకో విషయం చెప్పెతీరాలి మరి పోగొట్టిన బాగ్ చాల విలువై నదే అన్నానుకదా  అన్ని పోగొట్టినా మావారు మాత్రం పాపం నన్ను ఒక్క మాట కూడా అనలేదనుకోండి . ఏం అనలేకపోయారో లేక ఎప్పుడు ఏమి పోగొట్టలేదు ఇదే ఫస్ట్ time అని ఊరుకున్నారో కాని అన్ని బాగ్ లో పెట్టుకుని తిరగోచ్చా అని ఒక సారి మాత్రం చిన్నగా అని ఊరుకున్నారు . పాపం నన్ను అనలేరు కూడా ఆయన  ఇది ఒప్పుకుని తీరాల్సిన విషయం నేను.

 ఈ మర్చిపోయిన విషయం మీద కాల్ రావడం అంటే చాల వింతగా అనిపించింది నాకు మా వారికి . సరే రమ్మన్నారుకదా అని వెళ్ళాము ఇంతకీ ఆ దొంగతనం అతనే చేసానని ఒప్పుకున్నాడుట . వాళ్ళ బంధువులతో మా డబ్బు మాకు ఇప్పించారు Hyderabad పోలీసులు .ఇలా పోయిన డబ్బు తిరిగి వస్తుందా అనే ఆలోచనలలోనుంచి తెలుకోడానికి కొంచెం time పట్టిందనుకోండి . పోలీసులకు థాంక్స్ చెప్పి స్వీట్ కొని విష్ చేసి వచ్చాము .

గురువుగారి పుట్టిన రోజున పోయిన డబ్బులు తిరిగి నాకు పెల్లిరోజుకు gift గా ఇచ్చారు అన్నమాట మొత్తానికి మా పెళ్లిరోజు gift అలా భారీగా ( మా వారు తక్కువలో తెల్చేసినా ) అందినందుకు అందులోను గురువుగారి పుట్టినరోజున పోయింది అనే బాధను చెరిపేస్తూ పెళ్ళి రోజుకు కానుకగా అందినందుకు చాల ఆనందం లో ములిగి పోవడం జరిగింది.


14, మే 2017, ఆదివారం

స్నేహం

           మొన్న మే ఒకటవ తేదీన మా స్కూల్ get-to-gather జరిగిందండి . దాదాపు 26 సంవత్సరాలు తరవాత కలిసాము అందరమూ .  మాది girls high school లెండి . పాతికేళ్ళ క్రితం ఆడపిల్లలకి ఇప్పటి పిల్లలలా ఫోన్లు గట్రా లేవుకదా పరిచయాలు నిలబెట్టుకోవడానికి.  వున్నా ఊళ్లోనే వుండే అవకాశాలు కూడా తక్కువ . పెళ్ళిళ్ళు అయ్యి భర్తలతో అత్తవారి ఇళ్లకో ,  ఉద్యోగ రీత్యా వేరే వేరే ఊర్లకో వెళ్లి వున్తున్నవాళ్ళమే ఎక్కువ కదా. ఒక వేళ స్నేహాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయం తో ఉత్తరాలు ద్వార కొన్నాళ్ళు సంబంధాలు కొనసాగించినా తరవాత తరవాత సంసారం బాధ్యతలు పిల్లలు హడావిడులు అంటూ అవీ ఆగిపోయి చాల కాలమే అయ్యింది అందరికి.

       ఒక అమ్మాయి చొరవ వల్ల  ఎట్టకేలకు 26 సంవత్సరాల తరవాత అందరమూ కలవ గలిగాము. కలిసామే కానీ మాలో చాల మందికి చాల మందికి కాదేమో దాదాపు అందరికి  ఒకరో ఇద్దరో తప్ప ఎవరికి ఎవరు గుర్తులేము. ముఖాలు ఎక్కడో గుర్తొస్తున్నాయి కానీ పేర్లు తెలియవు.  మళ్ళి మళ్ళి కొత్త కొత్త గా పరిచయాలు చేసుకున్నా చిన్నప్పుడు స్నేహాలు అనుకునే సరికి ఒక కొత్త లేదు పాత లేదు అందరం ఒకటే కబుర్లు ఆటలు కేకలు పాటలు డాన్సులు . 40 లలో డాన్సులా  అందులోను ఆడవాళ్ళు అనకండి. చుట్టాలతోనో పక్కలతోనో ఐతే 40 లలో కాదు 20 లలోను చెయ్యలేము అల్లరి. బాల్య స్మ్రుతులంటే ఇదేనేమో అందరు మన సొంతవాళ్ళే, అందరు మన అక్క చేల్లెల్లె , అందరు మన బందుజనాలే.  దాదాపు 200 మందిమి కలిసాము. ప్రతి చోట వుండే మొహమాటాలు బెరుకులు తెలియని ప్రపంచం చూసినట్టు వుంది.

        గత పది సంవత్సరాలుగా మా వారి school get-to-gather లకి  నన్ను పిల్లలని కూడా తీసుకువేల్తున్నారు మా వారు. వల్ల ఫ్రెండ్స్ తో మా వారిని చూసినప్పుడు నాకు అనిపించేది . మగ పిల్లలుగా పుట్టడం యెంత లక్కీ నో కదా అని చక్కగా వాళ్లు ఇప్పటికి వల్ల school ఫ్రెండ్స్ దగ్గరనుండి అందరిని కలవోచ్చు ఏం కావాలంటే అల ఉండొచ్చు ఆడపిల్లలకి అవకాసం ఎలా వుంటుంది అని అనుకునే దాన్ని కానీ ఈ సంవత్సరం నేను మా ఫ్రెండ్స్ ని కలిస్తే చాల సంతోషంగా అనిపించింది . స్నేహాలు continue అయితే వుండే ధైర్యం ఏమిటో మళ్ళి ఇంకోసారి రుచిచూడడం అందులోను అన్ని బంధాల గురించు పూర్తిగా అవగాహనా వుంటే ఈ వయసులో తిరిగి అనుభూతిని పొందడం చాల బాగుంది. 

అందరమూ కొంత money ప్రోగు చేసి ఒక పేద స్నేహితురాలికి వేదిక మీదే విరాళం ఇచ్చాము.


31, జనవరి 2017, మంగళవారం

Whatsapp(పెను భూతం)

Whatsapp(పెను భూతం)

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ||

అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు.. 

ఇది నా 100వ పోస్ట్ అంది ఇలాంటి టాపిక్ రాయాల్సి రావడం లక్కీనో కాదో తెలియదు మరి . ఓ బాలకృష్ణ 100 వ సినిమా లాగా శాతకర్ణి నో, చిరంజీవి 15౦వసినిమాలగానో తెలియదు కాని  ఇది నా 100వ పోస్ట్. 

హాయిగా కాలక్షేపానికి అమ్మలు , అత్తలు పెరటిగుమ్మంలో పనులు చేసుకుంటూ బియ్యం ఏరుకుంటూనో,  పప్పులు చేరుగుకుంటూనో ,  కందిపొడి విసురుకుంటూనో ఇంచక్కా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు.

తరువాత TV లు వచ్చి కొంచెం ప్రశాంత  కాలక్షేపాన్ని   పాడుచేస్తూ  వారానికి  ఒక సినిమా, వారంలో  ఒక చిత్రలహరి , మధ్య మధ్య లో చిన్న  చిన్న నాటికలు . ఆ  time లో  కొంచెంలో కొంచెం  నాలుగు  ఇళ్ళకు  ఒక TV అవ్వడం  వల్ల కాస్తా  కలసి  మాట్లాడుకుంటూనే  ఆ  programs  చూసేవాళ్ళు.

ఇంకొన్నాళ్ళకు  ఆ  ఒక్క  channel చాలదని  ఆ  నలుగురు  ఒకచోటే  కూర్చుండిపోయి  మాట్లాడేసుకుంటూ న్నారని కంగారుపడి  TV వాళ్ళు  చానల్స్  పెంచేశారు.  అంతేఅక్కడితో  మొదలయ్యి  ఉంటాయి  ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క choice  అనే  ఆలోచన  అంతే దెబ్బకి TV దెయ్యం  ప్రతి ఇంట్లో వెలిసింది.  అక్కడితో అమ్మలక్కల  కబుర్ల  ఫుల్ స్టాప్  కి పునాది పడిందనే  చెప్పాలి .

తరువాత తరువాత ఎన్నెన్ని చానల్స్ , ఎన్నెన్ని సీరియల్స్ , అందులో ఎంతెంత మంది ఆడ విలన్స్  చెప్పనలవి కావు. ఇవి సరిపోలేదుట. ఇంట్లో నలుగురు మాట్లాడేసుకుంటూ ఏదో ఒక ప్రోగ్రాం చూసేస్తున్నారుట.  అది అర్ధమైన వెంటనే టెక్నాలజీ కంప్యూటర్ ని దానికి జతగా  ఇంటర్నెట్ ని  తీసుకు వచ్చింది.  పోనీ అందులో కొంత కొత్తదనం  వచ్చి ప్రపంచం తో మనం పోటీ పడదాం అనుకునే లోపు  ప్రతివాడు ఎదిగిపోతే  కష్టం  అని  చేతిలోకి  స్మార్ట్ ఫోన్  వచ్చింది.  చెయ్యి అంటే మరి  కుటుంబానికి  ఒకటి కాదు కదా . మనిషికి రెండు . అందుకే  డ్యూయల్ సిమ్ లు మెమరీ కార్డు లు , దానికి తోడూ అందులో  WiFi లు etc  etc  etc .

ఇప్పుడు కొత్తగా  4Gలు 5Gలు . ఇంక పెద్దలకే  పిచ్చి పట్టే కాలక్షేపాలు అరిచేతిలోనే .  అలాంటిది  పిల్లల సంగతి వేరే చెప్పాలా.  facebookలు ,  E mail లు  విషయం అందరికి తెలిసినదే .  దాని వల్ల లాభాల మాటేమో కానీ పక్క  మనుషులతో  సంబంధాలు పోయి , social మీడియా లో అందరూ  బిజీ ఐపోయారు.  ఇప్పుడు కొత్తగా వచ్చింది whatsapp .  రామారామా  ప్రతి వాళ్ళు  whatsapp  లోనే  పలకరించుకోవడా లు ,  మాట్లాడుకోడాలు. అందులో  ప్రతి వాళ్ళకి  ఓ వంద గ్రూప్ లు .

గ్రూప్ లు అంటే గుర్తువచ్చింది  ఇంట్లో అందరిని అంటే  మళ్ళి ఎందరో అనుకుంటారేమో  అబ్బే అమ్మ, నాన్న, ఇద్దరు పిల్లలు అంతే  సుమండీ .  హాయిగా పిల్లలని పక్కన కూర్చోబెట్టుకుని  ఇది మంచి ఇది చెడు అని మాట్లాడుకుంటూ  పిల్లలకి కొత్త విషయాలు నేర్పాలిసిన కుటుంబ వ్యవస్థ ఒరేయ్ ఫ్యామిలీ గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టాను చూడు అనుకునే స్టేజి లోకి ఈ టెక్నాలజీ  మనల్ని మర్చేస్తోంది. మాటలు  పోయి  మెసేజ్ లతోను  అది కూడా వాళ్ళు వాళ్ళ భావాలను చెప్పఖర్లేదు  సుమండీ. ఎవరో పంపిన మెసేజ్ ని  forward చేసేస్తారు.  అంటే  వీడు పదాలు వెతుక్కోవాల్సిన  పని కూడా లేదు. ఇంక మాటలు ఏం మాట్లాడతారు .  ఇది ఫ్యామిలీ గ్రూప్ సంగతి ఇలా వుంది . 

ఇంకా ప్రతి వాడికి స్కూల్ గ్రూప్ , collage గ్రూప్, ఆఫీస్ గ్రూప్, కాలనీ group అంటూ ఇలా ఓ వంద గ్రూప్ లు. వీటిలో పనికివచ్చే విషయాలు షేర్ చేసుకోవడం మాట ఎలా వుందో తెలియదు ఎవ్వరికీ కానీ , ఒక గ్రూప్ లో వచ్చిన ప్రతి మెసేజ్ ప్రతి గ్రూప్ లోను కనబడుతుంది. ఒక అరగంట కనక ఫోన్  కేసి  చూసే  time దొరకక పొరపాటున  లేట్ అయ్యిందో  ఇంక ఫోన్ చూడాలంటె భయం వేసేనని వందల వందల మెసేజ్ లు అసలు అన్ని మెసేజ్ లు పైపైన చూడాలన్న యెంత time వేస్ట్ అయిపోతుందో .  

అసలు అన్ని మెసేజ్ లు అంత time ఫోన్ లోనే  స్పెండ్ చేసేస్తుంటే  పిల్లలకి  చదువుకునే  time ఎలా . పెద్దలకు పనులు ఎలా . అసలు పక్కన ఒక మనిషి ఉన్నాడు  మాట్లాడాలనే ఆలోచన ఎలా వస్తుంది?  ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి  చేతిలోనూ ప్రపంచంలోను ఉండే  ఆఖర్లేని  కాలక్షేపాలతో గడిపే అలవాటు ఇపోతే  పనికొచ్చే పనులకు సమయం ఎక్కడ వుంటుంది .  మన ఫ్రెండ్ కి కష్టం వచ్చిందంటే  గెట్ వెల్ సూన్ అని మెసేజ్ పెట్టేస్తే వాడు బాగు పడిపోతడా.  

తండ్రి పిల్లాడికి ఒక మంచి మెసేజ్ పెట్టేస్తే వాడు మంచి  దారిలోనే వెళతాడా . కనీసం నువ్వు పంపిన మెసేజ్  వాడు చదివాడో లేదో కూడా చూసే ఆలోచన ఉంటోందా.ఇలాంటి విషయాలలో  వేగంగా కొట్టుకుపోతున్నమనం తెలివి  తెచ్చుకుని  ఇంటివైపు , జనం వైపు చూస్తామా . దేశానికీ పనికొచ్చే కాదు కాదు కనీసం మనకు పనికొచ్చే ఆలోచనలు మన  బుర్రలకు తడతాయా. మనందరికీ డౌటే కదా .

ఓ పది రోజులుగా నేను whatsapp వాడుతున్నాను లెండి . దాని మీద నాకు కలిగిన వికారం , చిరాకు , భయం ఇలా రాయిస్తున్నాయి . టెక్నాలజీ వాడుకోవాలి కాదనము కానీ దానికి కొంత పరిధి ఉండాలి, దాని అవసరాన్ని తెలిసి సద్వినియోగం చేసుకోవాలి కానీ మన ఇల్లు, ఆలోచనలు, చదువులు,  పనులు  పాడైపోయేలా  మాత్రం  కాదు కదా. మీరేమంటారు?




2, నవంబర్ 2016, బుధవారం

అభిరుచి

మొన్న బ్లాగ్ లో అందరు మా దంపతులకు ఒకటే అభిరుచి వుందని అన్నారు  అది చదివినప్పటినుండి నిజమేనా అని ఒకటే ఆలోచిస్తున్నాను .

ఆ ఆలోచనలు ఎక్కడ నుండి మొదలు పెట్టాలా అని ఆలోచిస్తే మా పెళ్ళికి జాతకాలూ చూడలేదు మేనరికం కావడంతో . కానీ మా తమ్ముడి పెళ్ళిలో యేవో లెక్కలు అవి చూస్తున్నారు అప్పుడు నాకు మా వారికీ ఎన్ని అంకెలు కుదిరయా అని చూసనుకదా ఒక్క దానిలోనూ పొంతనలేదంటే నమ్మండి . అసలు బయటి (మేనరికం కాని ) సంబంధానికి మా జాతకాలూ చూడల్సివస్తే వెంటనే  సిద్ధాంతి గారు కూడా భయపడే సంబంధం మాది.

ఇంకా రుచులకి వస్తే పోద్దుటి నుండి మొదలు పెడదాం నేను కాఫీ చక్కగా చెట్టుకింద మెట్టుమీద కూర్చుని అది చల్లగా ఇపోతున్న నెమ్మదిగా తీరిగ్గా తాగాలి ఆయన వేడి వేడి టీ  పేపర్ లో ఒక వార్త చదవడం పూర్తయ్యే లోపు పొగలు కక్కుతూ తాగేయాలి.  ఇంకా టిఫిన్ లకి వస్తే నాకు వేడి తగ్గని టిఫిన్స్ ఇష్టం ఐతే తనకి పులిహోర ప్రాణం .
కూరలు చెప్పఖర్లేదు మా ఇద్దరి టేస్ట్ లు అస్సలు కుదరవు వాటిలో కూడా. ఇలా ఏది చూసినా ఇంత విరుద్ధంగా ఉన్న మమ్మల్ని, ఎలా ఒకటే అభిరుచి అనిపించిన్దబ్బా.

ఇక్కడితో ఇపోలేదన్దోయ్ ఇంకా చాల వున్నాయి మా బేధాభిప్రాయాలు .  పెళ్ళికి ముందు ఏడాదికి ఒక సినిమా ఐనా డౌట్ చూసే నేను వారానికి కనీసం నాలుగు సినిమాలు చూసే తను . బయట భోజనం అస్సలు తెలియని నేను, చాల మామూలుగా గా బయటి భోజనం తినే  తను . కొత్తవాళ్ళని పలకరించాలంటే భయపడే నేను అందరిని పరిచయం చేసేసుకునే తను . ఎవరింటికైనా వెళ్ళాలంటే మొహమాట పడే నేను అందరిని చుట్టేసి పలకరించేసే తను.  ఇన్ని తేడాలతో మేము ఒకే అభిరుచి ఏమిటో మీకూ తెలియటం లేదు కదా.

బంధువులలో, స్నేహితులలో మేము హిట్ పెయిర్ మరి.ఇప్పుడు శర్మగారి పుణ్యమా అని బ్లాగ్ లో కూడా. అందరిలోనే కాదండోయ్ మాకు కూడా అనిపిస్తుంది హిట్ పెయిర్ అని. ఎలాగబ్బా అని ఆలోచిస్తే మాత్రం దానికి కారణం మా ఇద్దరి స్నేహం అనే నేను చెపుతాను. ఎలాంటి టాపిక్ ఐనా తనతో షేర్ చేసుకునే స్వేచ్చని ఇచ్చారు నాకు అనే చెప్పాలి.  నచ్చింది నచ్చలేదు ఖచితంగా మొహమాటం లేకుండా మాట్లాడే అవకాశం ఇవ్వడం తన గొప్ప అనే చెప్పాలి.

చాల మంది భార్య అంటే అనుకూలవతిగా వుండాలి అంటారు కానీ మావారు సమాన హోదా లో నే ఉంచారు నన్ను. ఆ అవకాశం అందరు ఆడవాళ్ళకి వస్తుందనుకోను నేను, ఎందుకంటె అందరు మగవాళ్ళు ఒకలా మా వారిలా ఆలోచించరు కదా. మా వారి సన్మానపత్రంలా వుందనుకుంటున్నారా . తనతో ముఖాముఖి గా చెప్పలేం కదా ఇలాంటివి, అవకాశం వచ్చిందని చెప్పేస్తున్నాను అంతే, ఏం అనుకోకండి.

ఇంతకీ చెప్పోచేదేమంటే ఇన్నివిరుద్ధ భావాలూ,రుచులు వున్నామేము ఒకదానిలో మాత్రం ఒకలానే ఆలోచిస్తున్నాము సుమండీ .  అది ఒకరి మీద ఒకరికి గౌరవం , అభిమానం అని మాత్రం చెప్పాలి . మన పనితో  ఎదుటి వారు (ఒకరిని ఒకరు ) బాధ పడతారు  అనుకుంటే మాత్రం ఆ ఆలోచన ఆగిపోతుంది.  దానికి మూలం మా ఇద్దరి స్నేహమనే చెప్పాలి.

ఇంతకీ ఒక విషయం చెప్పాలి సుమండీ  ఇప్పుడు నేను మావారు చెప్పే వార్తలు వింటూ  టీ తాగుతున్నాను, పులిహోర తింటున్నాను, మూవీస్ చూస్తున్నాను.హోటల్ కి వెళ్తున్నాను . చుట్టాలతో క్లోజ్ గా మసులుతున్న , ఇంకా కొత్తవల్లంటే మాత్రం కొంచెం బెరుకు ఉందనుకోండి . ఇప్పుడు డౌట్ వస్తోందా మీకు ఆయన ఏం మారారు అని నాకు ఇంకా తెలియలేదు మరి తెలిస్తే చెపుతాను . మీరేమంటారు?


27, అక్టోబర్ 2016, గురువారం

ఆడది

 ఆడది

      ఆడపిల్లకు అసలు నిజంగా సొంతం అని ఎవరున్నట్టు?  అమ్మ నాన్నల దగ్గర మారం చేస్తే ఆడపిల్లవి ఏమిటా మారం అని పట్టించుకోరు. అమ్మ నాకూ  సైకిల్ కావాలి కోనవూ అని అంటే నీకేందుకు ఆడపిల్లవి అనేస్తుంది అమ్మ. అన్నని ఏదన్నా అడిగితే తన పనులు తనవంటాడు . పెళ్ళితో బాధ్యత తీర్చుకుంటాడు తండ్రి.

     ప్రేమించి / పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న భర్త చేయి పట్టుకోగానే నీ తరువాతే అన్నీఅని (మచ్చిక చేసుకోడానికి) మన ఇంట్లో చెప్పిన కబుర్లు అతని ఇంటికి తీసుకెళ్ళ గానే అమ్మ చెప్పింది చెయ్యి అనో , అక్కకు నచ్చినట్లు ఉండు అనో రెండో స్థానంలో నించో బెడతాయి .

     ఇంక పిల్లలు పుట్టకా చెప్పనే అవసరం లేదు. ఏనాటికైనా వీళ్ళకు నా తరువాతే అని మొదట అనిపించినా వారి అవసరాలతో ఆడదాని కాలం, జీవితం కరిగిపోతాయి. కొడుకు హయాముకు వచ్చేసరికి రెండో స్థానం నుండి జారి ఆఖరికి చివరి స్థానం ఐనా దక్కుతుందో లేదో చెప్పలేని ఆడ బ్రతుకుకు ఎవరు ఆసరా? ఎవరు ఆలంబన?

    వీటన్నింటి మధ్య చిన్నచిన్న ఆనందాల రూపంలో చిరుజల్లులు కురిసినట్టే కురిసి మాయమయ్యే ఆడదాని జీవితానికి ఎవరి నీడ సొంతం? ఎవరి ఆత్మీయత నిజం?

ఇప్పటి రోజులలో మీకు చదువులు , సంపాదనలు వున్నాయిగా అనేవారు వున్నారు. ఎన్ని చదువులు వున్నా , సంపాదనలు వున్నా పక్కన నిజమైన తోడూ నీడ వుండడం అవసరం .స్వతంత్రం వేరు స్వాంతన వేరు . ఆ తోడు ఎవరిది ?  ఆనీడ ఏది ?


20, అక్టోబర్ 2016, గురువారం

చెప్పాలని వుంది

చెప్పాలని వుంది నీకు చాలా చెప్పాలని వుంది
నీతో గడిపే ప్రతిక్షణం నా జీవిత మధురిమని
నీతోడే నా ఆనందాల వెల్లువని
నీ చెలిమే నా గరిమ అని
చెప్పాలని వుంది నీకు చెప్పాలని వుంది!!

నాపై నిలిచే  నీ చూపే నా చిరకాల వాంఛ అని
నీ నోటి మాటే నా జీవిత మకరందమని
నీ చేతి స్పర్శే నా జన్మకు ధన్యమని
నీ అభిమానమే నా జీవిత లక్ష్యమని
చెప్పాలని వుంది నీకు చెప్పాలని వుంది!!

నీతో వేసే ప్రతి అడుగు నా గమ్యానికి చేరువని
నీతో పలికే ప్రతి మాట నా ప్రగతికి మెట్టు అని
నీతో ఆడే ప్రతి ఆట నా ఆనందానికి ఆసరా అని
నీతో నిండిన జీవితమే నా జన్మకు పరమార్ధమని
చెప్పాలని వుంది నీకు చెప్పాలని వుంది!!


15, అక్టోబర్ 2016, శనివారం

పాత కొత్తల మేళవింపు


మీరు పాత కొత్తల మేళవింపు గురించి విని వుంటారు కదా . ఎప్పుడైనా డైరెక్ట్ గా చూసారా . ఏమిటి చాల రోజుల తరువాత కాదు కాదు చాల ఏళ్ళ తరువాత వచ్చి ఇలా ఏమిటేమిటో అడుగుతోంది తల తోక లేకుండా అనుకుంటున్నారా .. కాసేపు ఆలోచించండి చూసారో లేదో . ఎందుకంటె మేము మొన్న దసరా సెలవలకి మా ఊరు వెళ్ళినప్పుడు ఒక పెద్దాయన్ని చూడడానికి అనపర్తి వెళ్ళాము . ఆయన మీ అందరికి కూడా పరిచయమే లెండి మీ అందరికి అంటే బ్లాగ్ లు చదివే వారందరికి అని సుమండీ .

ఇంటిముందు గేటు తీసేసరికి చక్కగా అరటి మొక్కలు, కనకాంబరాలు, మామిడి చెట్టు, మల్లె తీగ ఇలా అన్ని మొక్కలు స్వాగతం పలికాయి . ఎదురుగా పెద్దావిడా (పార్వతిదేవి అంటే బాగుంటుందేమో )ఎవరికో అరటి ఆకులు ఇస్తూ మమ్మల్ని చూసి ఎవరబ్బా ఎక్కడ చూసినవాళ్ళలా లేరే అనుకుంటూ ఉండగానే మేము హైదరాబాదు నుండి  వచ్చాము సర్ వున్నారా  అండి  అని  అడిగాము.  ఆవిడ లోపలి  తీసుకు వెళ్లారు మీకోసం ఎవరో వచ్చారు అంటూ .

చక్కగా కచ్చాపోసిన  పంచెకట్టు ముఖాన విభూది రేఖలు , వాటి మధ్యన కుంకుమ  బొట్టు. అప్పుడే భోజనం ముగించుకుని ఒక్కపొడి నములుతున్న 6 అడుగుల 70వ పడిలో పడిన మనిషిని చూసి మేము ఫలానా మిమ్మల్ని చూడాలని వచ్చాము అని మావారు తన పేరు ఊరు పరిచయం చేసుకున్నారు . ఆ పరిచయం తో మావారిని పెద్దాయన పరిష్వంగం తో సత్కారం చేసారు . ముఖం తెలియక పోయినా ఆ సత్కారానికి మా వారు తెగ సంబరపడిపోయారు. ఆయన ఆనందాన్ని నేను పంచుకున్నాను అనుకోండి .

ఇంతకీ మొదలు పెట్టిన విషయానికి దీనికి ఏమిటా సంబంధం అనుకుంటున్నారు కదా . వస్తున్నానండి అక్కడికే వస్తున్నా .ఇంతకీ ఆ పెద్దాయన వేషధారణ గురించి చెప్పానుకదా ఆయన వయసుకు భోజనం తరువాత ఏంచేస్తారు కాసేపు పడుకుంటారు అనుకుంటాము మనం కానీ ఆయన ఈ నాటి కంపూటర్లు మాకేం గొప్పకాదు అనేలా కంప్యూటర్ లో తెలియని విషయం లేదు . పూర్వకాలంలాగా అంటే మరీ 60 లు 70 లు లోలా కాదు 80 లో లా లెండి మోడల్ ఇల్లు వంటగది వేరు భోజనాల గది వేరు డైనింగ్ టేబుల్ వుందండోయ్. అలానే పెద్దగ హాలంతా నిండిపోయే టీవీ కాదు కానీ చక్కగా ఎవరి పడక గదుల్లో వాళ్ళకి చిన్న టీవీలు . పెరటిలో చక్కని మొక్కలు ఇంట్లో ACలు , అలానే మీకు నీళ్ళకు కాగులు వాడేవారు గుర్తుందోలేదో మా అమ్మమ్మగారి ఇంట్లో మా మామ్మగారి ఇంట్లో ఉండేవి లెండి పెద్ద ఇత్తడి బిందెతో కట్టెలపొయ్య మీద వేడి నీళ్ళు కాస్తారు దానిని కాగు అంటాము మేము.పెరటిలో కాగు తో నీళ్ళు కచుకోడానికికట్టెల పొయ్యి ఇప్పుడు చెప్పేది మరీ వింత గొప్ప కూడానండోయ్ మీరు ఊర్హించలేరు పాతకాలం వాళ్ళు అందులోను పల్లెటూరి వాళ్ళు దానిగురించి ఆలోచిస్తారని చెప్పేస్తున్నా మరి సోలార్ పవర్ సప్లై. అది చూసి నేను చాల ఆశ్చర్యపోయాను సుమండీ.

సిటీ లో వాళ్ళే దాని గురించి ఆలోచించడం చాల అరుదు కదా . అలాంటిది చిన్న ఊరిలో ఆ సోలార్ వాడకం నాకు చాల కొత్తగా అనిపించింది . అప్పుడు అనిపించింది  ఆ పెద్దాయన కు అన్నింటిమీదా పట్టు వుంది కనుకనే ఇన్ని పోస్ట్లు, బ్లాగ్స్ లో అన్ని కంమెంట్లు అంతమంది  ఫాల్లోవర్స్ అని . ఆయన అనుభవం ఆధ్యాత్మికం ఆసక్తి ఎప్పుడు కాలంతో పాటు నడుస్తూ ఉంటాయని అర్ధమయ్యాక ఆయనమీద అభిమానం మావారికి నాకు చాల పెరిగిపోయయనుకోండి .

అన్నట్టు ఇంకో విషయం కూడా చెప్పాలి,  ఇంట్లో ఆయన భార్య కొడుకు కోడలు ఒక మనవరాలు వున్నారు . చిన్న ఊరులో ఆడపిల్లని పెంచడం అంటే ఇక్కడ వంచిన తల బడిలోనూ, బడిలోవంచిన తల ఇంట్లోను ఎత్తేలా పెంచుతారు కదా. అందులోను తాతగారు  మామ్మగారు వున్నా ఇంట్లో ఆడపిల్ల అంటే ఇంకా కట్టుబాట్లు ఎక్కువ వుంటాయి కదా, ఇంతకీ విషయమా ఏంటంటే ఆ మనవరాలు నేషనల్ లెవెల్  కరాటే ఛాంపియన్ అంటే ఆశ్చర్యంగా లేదు మీకు.

పాత ఆచారాలను ఒక చేతిలో పట్టుకుని, కొత్త ఆలోచనలను మేళ విన్చుకుంటూ, తన తరువాతి తరానికి ప్రతి విషయాన్నీ విపులంగా వివరిస్తూ, వాటిలోని మంచి చెడులను ఎంచుకోగలిగిన ఆలోచనలను వారిలో పెంపొందిస్తు ముందుకు నడిపిస్తూ, ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా దేశవిదేశాలలోని పాఠకులకు కూడా  ఆ విజ్ఞానాన్ని పంచుతూ, వారికి  వున్న సమయాన్ని అందరికి ఉపయోగపడేలా వినియోగిస్తున్నారంటే చాల ఆనందంగా వుంది  కదూ . రేపు కాదు కాదు ఇప్పటినుండైనా మనం ఎలా ప్రవర్తిస్తే నలుగురికి మన నుంచి మంచి అందే అవకాశం ఎలా వుంటుందో మనకు తెలుస్తుంది ఇలాంటివారి సావాసం వల్ల. వారికి నా నమోవాకాలు.


7, అక్టోబర్ 2015, బుధవారం

special

అందరిలోనూ స్పెషల్  గా కనబడాలని అందరి కళ్ళు మనమీదే వుండాలని ఆలోచిన్చేవాళ్ళల్లో నేను వున్నాను .అసలు ఆ ఆలోచనకి మూలం ఏమిటా అని చాలాసార్లే ఆలోచిస్తూ వుంటాను. ఇప్పటికి సరైన సమాధానం దొరకలేదనుకోండి. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా శోదిస్తూనే వున్నాను.

     చిన్నప్పుడు స్కూల్ లో చదివేటప్పుడు టీచర్  నన్నే మెచ్చుకోవాలి అల్లరిచేసినా  తిట్టకూడదు అనుకునే దాన్ని . పాపం మా టీచర్స్ నా పట్ల అలానే వుండేవారు. అమ్మ నన్ను ఏంతో శుభ్రంగా తయారు చేసి రోజు స్కూల్ కి వెళ్ళేటప్పుడు మంచి బుద్దులు చెప్పి పంపేది నేను చాలావరకు అలానే ఉండడానికి ప్రయత్నించేదాన్ని టీచర్ నన్ను గుడ్ అని మేచుకోవాలని. తతిమా పిల్లలు నన్ను స్పెషల్ గా చూడాలని.

     collageలో చేరిన రోజు అమ్మ , నాన్న ఇద్దరు చాల జాగ్రత్తలు చెప్పారు (మంచి బుద్దులు చెప్పే స్టేజి దాటానని) .ఇంటి దగ్గర దించిన  తల collageలోనే ఎత్తాలని , బయటి వాళ్లతో కొత్తవాళ్ళతో అవసరం లేకుండా మాట్లాడ కూడదని , మంచి పిల్ల అనిపించుకోవాలని అలానే వున్నాను అందరు నన్నుమంచి అని మేచుకోవాలని, చాలా  స్పెషల్ అనాలని. స్పెషల్ ముందు  చాలా చేరిందేమిటా అని చూస్తున్నారా ?  మరి  collage కదా ఇంకొంచెం స్పెషల్   అన్నమాట .

     పెళ్లి కుదిరింది .ఆ రోజు రానే వచ్చింది . అమ్మ చెప్పింది అత్తగారింటిలో మర్యాదగా మసులుకోవాలి . ఎదురు మాట్లాడకూడదు . మంచి అమ్మాయి మా కోడలు అని అనిపించుకోవాలి అని . అలానే వున్నాను నా వీలినంతవరకు .మా కోడలు చాల శుభ్రం . అన్ని చాల జాగ్రత్తగా చేస్తుంది ఉంచుతుంది అనిపించుకున్నాను . 

     ఇంక పిల్లలు పుట్టుకు వచ్చారు . అమ్మ చెప్పింది పిల్లలని బాగా, జాగ్రత్తగా, మంచిగా, మర్యాదగా ఇన్నిచేరాఏమిటా అని చూస్తున్నారా . మరి బాధ్యత కూడా చేరింది కదా అమ్మవ్వగానే అందుకన్నమాట .ఇలా మనపిల్లలు కూడా అందరిలో స్పెషల్ గా కనపడాలనే తపన ఇంకా పెరిగిపోయింది . నా స్పెషల్ సంగతి మర్చిపోయి వాళ్ళ స్పెషల్ గురించి తపన ప్రయత్నం పెరిగిపోయాయి . 

     ఇవన్ని ఆలోచిస్తుంటే మళ్ళినా ఆలోచనలు తిరిగి స్పెషల్ దగ్గరే ఆగాయి  ఏంచేస్తాం కొన్ని ప్రశ్నలకి ఆలోచనలకి  సమాధానాలు దొరకడం చాల కష్టం అని ఇప్పటికి బాగా అర్ధమయ్యింది . 

     కొంతవరకు  స్పెషల్ గా  ఉండాలనే ఆలోచన  ఇతరులని  ఇబ్బంది పెట్టనంత వరకు  ఆరోగ్యకరమే కదా వచ్చిన నష్టం ఏం లేదు కదా ని సరిపెట్టేసుకోవటమే నా వంతు అయ్యింది . 

     ఆ మర్చిపోయానండోయ్ ఇప్పుడిక పిల్లలతో పాటు నేను కూడా నా స్నేహితుల మధ్య. ఇంటి చుట్టూ పక్కల వాళ్ళ మధ్య స్పెషల్ ఏ సుమండీ.అలా అయితేనే నాకు ఇష్టం అనుకోండి .

14, ఆగస్టు 2015, శుక్రవారం

సందేశం


          మొన్న ఒక కధ చదివానండి . ఎందులో అనేది ఇక్కడ విషయం కాదనుకోండి .ఇంతకీ విషయం ఏమిటి అనేగా మీరు అడిగేది వస్తున్నానండి అక్కడికే వస్తున్నాను.

          మొన్న కధ చదివానన్నాను కదా అందులో ఒక మాస్టారు పాపం కొంచెం పేద మాస్టారు లెండి తన కూతురికి కొత్తగా పెళ్లి చేసారు . మొదటి సంక్రాంతి వచ్చింది. అల్లుడిని కూతురిని ఇంటికి పిలిచి బట్టలు పెట్టి ఏదైనా గిఫ్ట్ కొనివ్వాలని ఆ మాస్టారి గారి భార్య గారి ఆశా. పాపం మాస్టారి పరిస్టితి ఇరకాటంలో పడుతుంది . ఇంకా పెళ్ళికి చేసిన అప్పులకి వడ్డీలే తెమలలేదు, ఎలారా భగవంతుడా అని ఆలోచనలో పడుతుంటారు. ఇంతలో పండగ రానే వచ్చింది . దానితో పాటే కూతురు కొత్తల్లుడు కూడా వచ్చారు. దానితో మాస్టారి కంగారు ఇంకా ఎక్కువ అయ్యింది . పాపం తన భార్యకేమో అల్లుడికి కొత్త బండి కొనివ్వాలని కోరిక . పోనీ ఏ వాచినో వుంగారమో ఐతే మాస్టారు కాస్త ఆశాజనకంగా ఉండేవారేమో .అంత చిన్నచిన్న బహుమతులు పెద్దింటి అబ్బాయికి ఎలా ఇస్తాము అందులోను కట్నం కూడా లేకుండా మనమ్మాయిని చేసుకున్నారాయే అంటారు మాస్టారి భార్య . ఇంక బండి గురించి ఆలోచించక తప్పలేదు మాస్టారికి . ఆయన పడే తర్జన భర్జన చూడలేక ఆ గొప్పింటి అబ్బాయి తనే ఒక బండి బుక్ చేసి surprise గా బండి మాస్టారే బుక్ చేసినట్టుగా ఇంటి address కి పంపి మాస్టారి చేతులమీదుగా బహుమతి గా ఆ బండిని అందుకుని తన ఇంట్లో భార్యకు అవమానం జరగకుండా ఆదుకుంటాడు . ఎప్పటికి మావగారికి ఆ విషయం తెలియకూడదని తన భార్యనుండి మట తీసుకుంటాడు . బండి ఎలా వచ్చిందో తెలియక మాస్టారు , మాస్టారే తెచ్చారు కాబోలనుకుని మురిసిపోయిన మాస్టారి భార్య , తన భర్త తన పరువు తన తల్లి తండ్రుల పరువు కాపాడి   (అతని తరఫు వాళ్ళ దగ్గర ) తనని ఉన్నత స్తానం లో నిలబెట్టడాని కూతురు మురిసిపోతారు .

          ఆ అల్లుడి ఉద్దేశం తప్పని నేను అనటంలేదు . కాని తన వాళ్ళని మోసం చేసి నట్టే కదా . ఈ కధ ద్వార మనం అత్తారికి తెలియకుండా వాళ్ళ అబ్బాయి మనకు హెల్ప్ చెయ్యడం మంచిది అని కదా చెపుతున్నాము. కాని మార్పు అనేది ఒక వ్యక్తీ లో వస్తే ఏం లాభం . మొత్తం సమాజంలో కనీసం అబ్బాయి విలువలు వున్నవాడు అంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఆ విలువలను నేర్పే సంస్కారం వున్నవాళ్ళుగా వుండాలని చూపిస్తే బాగుండేది . వాళ్ళకి తెలియకుండా కొడుకు వేరే వాళ్ళకి అత్తారే అనుకోండి సమర్ధింపుగా వున్నాడనే విషయం తరవాత తెలిస్తే వాళ్ళు తల్లితండ్రులుగా ఓడిపోయినట్టే కదా .
     
     ఇలాంటి కధలు అందరికి ఒకే సందేశాన్ని ఇవ్వలేవు కదా అని . మీరేమంటారు? ఇది నేను ఈ కధ రాసిన వాళ్ళని విమర్శించాలని కాదు నా అభిప్రాయం నాలో నేను గా రాస్తున్నాను అంతే  సుమండీ . 

     నా బ్లాగ్ కదా అని ధైర్యం అంతే. అందరిని కలుపుకోగలగాలి అనే ఉద్దేశం వుండాలి కాని ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని సమర్ధిస్తే తరువాత తరువాత గోడవలని మనమే పెంచి పోషించినట్టు కదా .

          

         

మధురా నగరిలో చల్లనమ్మబోదు







మధురా నగరిలో చల్లనమ్మబోదు 
దారి విడుము కృష్ణా కృష్ణా  ! మధురా నగరిలో !

మాపటి వేలకు తప్పక వచ్చెద
పట్టకు నా కొంగు గట్టిగాను కృష్ణా  !మధురా నగరిలో!

కొసరి కొసరి నాతో సరసములాడకు
రాజ మార్గమిది కృష్ణా కృష్ణా
వ్రజ వనితలు నను చేరవత్తురిక 
విడు విడు నాచేయి కృష్ణ కృష్ణా  !మధుర నగరిలో!

ఈ క్రింది చరణం కూడా వుంటుందండి ఆడియో సాంగ్ లో ఆడియో కూడా విడిగా పెడదామనుకున్నాను కానీ దొరకలేదు . దొరకగానే అదికూడా వినిపిస్తాను మీకు అది ఇంకా బాగుంటుంది .

అత్తా చూసినా నన్ను ఆరడి చేయును
ఆగదమేలరా అందగాడ కృష్ణా  !మధురా నగరిలో!

12, ఆగస్టు 2015, బుధవారం

గురుపూజ

                                గురుపూజ 


మొన్న నేను గురుపూజ చూసానండి. గురుపూజ అంటే ఏదో గుడిలో బాబాగారికి పూజచేయడం కాదు . మొన్న సత్యసాయి నిగమాగమంలో శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు శంకరాభరణం సినిమా మీద ప్రవచనం చేసే సందర్భంలో ఆ వేదికపైన గురుశిష్య సంబంధం లోని విశేషాలను విలువలను గురించి చెప్పిన సందర్భంలో శ్రీశ్రీశ్రీ మంగళంపల్లి బాల మురళీకృష్ణగారికి వారి శిష్యుడు మోహన కృష్ణ గారు స్వయంగా తమ స్వహస్తాలతో గురువుగారికి పురుష సూక్త యుక్త షోడస ఉపచార పూజ చేసారు. ఎంత అదృష్టవంతులు ఆ గురు శిష్యులు ఇద్దరు.  గురువు ప్రాణాలతో నిలబడి పూజ చేసే భాగ్యం శిష్యునికి కల్పించడం శిష్యుని అదృష్టం ఐతే, పూజ చేయడానికి మనసు నిండా భక్తిని నింపుకున్న శిష్యుడు వుండడం గురువుకి గౌరవం కదా. 

    వారిద్దరి ఆనందం ఒక ఎత్తుఐతే అలాంటి దృశ్యాన్ని చూసే అదృష్టాన్ని కలిగిన వారందరి భాగ్యమే భాగ్యం సుమండీ. ఒక మనిషికి భాగవతుని ఉపచారాలన్నీ జరిపి పూజించడం కళ్లారా చూడడం నిజంగానే చాల ఒళ్ళు పులకించే సంఘటననే చెప్పాలి . 

ఆ  సందర్భంగా వారిద్దరూ కలిసి వేదిక మీద ఒక కీర్తన ఆలపించారు, బ్రహ్మాండం!


11, ఫిబ్రవరి 2015, బుధవారం

రాముడు రాఘవుడు రవికులు డితడు అన్నమాచార్య కీర్తన




రచన: అన్నమాచార్య
 
రాగం: కానడ

రాముడు రాఘవుడు రవికులు డితడు |
భూమిజకు పతియైన పురుష నిధానము ||


అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున |
పరగ జనించిన పర బ్రహ్మము |
సురల రక్షింపగ అసురుల శిక్షింపగ |
తిరమై ఉదయించిన దివ్య తేజము ||


చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో |
సంతతము నిలిచిన సాకారము |
వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి |
కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము ||


వేద వేదాంతములయందు విఙ్ఞాన శాస్త్రములందు |
పాదుకొన పలికేటి పరమార్ధము |
ప్రోదితొ శ్రీ వేంకటాద్రి పొంచి విజయ నగరాన |
ఆదికి అనాదియైన అర్చావతారము ||

1, జనవరి 2015, గురువారం

HAPPY NEW YEAR

                                                    
                                              HAPPY NEW YEAR 








22, సెప్టెంబర్ 2014, సోమవారం

గోవిందాశ్రిత గోకులబృందా అన్నమాచార్య




రచన: అన్నమాచార్య

గోవిందాశ్రిత గోకులబృందా |
పావన జయజయ పరమానంద ||


జగదభిరామ సహస్రనామ |
సుగుణధామ సంస్తుతనామ |
గగనశ్యామ ఘనరిపు భీమ |
అగణిత రఘువంశాంబుధి సోమ ||


జననుత చరణా శరణ్యు శరణా |
దనుజ హరణ లలిత స్వరణా |
అనఘ చరణాయత భూభరణా |
దినకర సన్నిభ దివ్యాభరణా ||


గరుడ తురంగా కారోత్తుంగా |
శరధి భంగా ఫణి శయనాంగా |
కరుణాపాంగా కమల సంగా |
వర శ్రీ వేంకట గిరిపతి రంగా ||

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి అన్నమాచార్య కీర్తన







రచన: అన్నమాచార్య

రాగం: ఆరభి

దాచుకో నీపాదాలకుదగ నే జేసినపూజ లివి |
పూచి నీకీరీతిరూపపుష్పము లివి యయ్యా ||


వొక్క సంకీర్తనె చాలు వొద్దికై మమ్ము రక్షించగ |
తక్కినవి భాండారాన దాచి వుండనీ |
వెక్కసమగునీ నామము వెల సులభము ఫల మధికము |
దిక్కై నన్నేలితి వీ  ఇక  నవి తీరని నా ధనమయ్యా ||


నా నాలికపైనుండి నానాసంకీర్తనలు |
పూని నాచే నిన్ను బొగడించితివి |
వేనామాల వెన్నుడా వినుతించ నెంతవాడ |
కానిమ్మని నాకు ఈ పుణ్యము గట్టితి వింతేయయ్యా ||


యీమాట గర్వము గాదు నీ మహిమే కొనియాడితిగాని |
చేముంచి నాస్వాతంత్ర్యము చెప్పినవాడగాను |
నేమాన బాడేవాడను నేరము లెంచకుమీ |
శ్రీమాధవా నే నీదాసుడ శ్రీవేంకటేశుడవయ్యా ||

25, ఆగస్టు 2014, సోమవారం

దేవ దేవం భజే దివ్యప్రభావమ్ అన్నమాచార్య కీర్తన





రచన: అన్నమాచార్య

రాగం: ధన్నాసి

దేవ దేవం భజే దివ్యప్రభావమ్ |
రావణాసురవైరి రణపుంగవమ్
రామం ||

రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయమ్ |
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రమ్ ||

నీలజీమూత సన్నిభశరీరం ఘనవి-
శాలవక్షం విమల జలజనాభమ్ |
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనమ్ ||

పంకజాసనవినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనమ్ |
లంకా విశోషణం లాలితవిభీషణం
వెంకటేశం సాధు విబుధ వినుతమ్ ||

22, ఆగస్టు 2014, శుక్రవారం

అన్నమాచార్య కీర్తన నానాటి బతుకు నాటకము

చాలా రోజుల తరువాత పెడుతున్నానని అలిగి వినకుండా వదిలేయ్యకండి . మీకు పరిచయమున్న పాటే . కానీ M.S.సుబ్బలక్ష్మిగారు పాడారు. ఆవిడ పాడినపాట అంటే చెవిలో అమృతం పోసినట్టే కదా. మీరు కాదనరనుకోండి . మరి ఇంకెందుకు ఆలస్యం వినేయ్యండి .ఆఆ ఎలావుందో చెప్పడం మార్చిపోయే అంత మైమరచిపోకండి .

 

నానాటి బ్రతుకు నాటకము





రచన: అన్నమాచార్య

రాగం: ముఖారి

నానాటి బతుకు నాటకము
కానక కన్నది కైవల్యము ||


పుట్టుటయు నిజము, పోవుటయు నిజము
నట్టనడిమీ పని నాటకము |

యెట్టనెదుటి కలదీ ప్రపంచము
కట్ట గడపటిది కైవల్యము ||


కుడిచేదన్నము కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాటకము |
వొడి కట్టుకొనిన ఉభయ కర్మములు
గడి దాటినపుడే కైవల్యము ||


తెగదు పాపము, తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము |
ఎగువనే శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము ||

9, ఆగస్టు 2014, శనివారం

వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు