ప్రముఖ రచయుత లల్లాదేవి గారు 1 April 2013 న ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన ప్రకటన..మన బ్లాగర్స్ దగ్గర ఎవరి వద్దనైనా ఉంటే సహాయపడతారని..

4, ఏప్రిల్ 2013, గురువారం
2, ఏప్రిల్ 2013, మంగళవారం
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ అన్నమాచార్యకీర్తన
అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ |
తమ్మియింట నలరుకొమ్మ ఓయమ్మ ||
నీరిలోన తల్లడించే నీకే తలవంచీ
నీరికింద పులకించీ నీరమణుండు |
గోరికొన చెమరించీ కోపమే పచరించీ
సారెకు నీయలుక ఇట్టె చాలించవమ్మ ||
నీకుగానే చెయ్యిచాచీ నిండాకోపమురేచీ
మేల్కొని నీవిరహాన మేను వెంచీని |
ఈకడాకడి సతుల హృదయమే పెరరేచీ
ఆకు మడిచియ్యనైన ఆనతియ్యవమ్మా ||
చక్కదనములె పెంచీ సకలము గాలదంచి
నిక్కపు వేంకటేశుడు నీకే పొంచీని |
మక్కువతో అలమేల్మంగ నాంచారమ్మ
అక్కున నాతని నిట్టే అలరించవమ్మ ||
చేరి యశోదకు శిశు వితడు అన్నమాచార్య కీర్తన
చేరి యశోదకు శిశు వితడు
ధారుణి బ్రహ్మకు తండ్రియు నితడు ||
సొలసి చూచినను సూర్యచంద్రులను
లలి వెదచల్లెడులక్షణుడు |
నిలిచిననిలువున నిఖిలదేవతల
కలిగించు సురలగనివో యితడు ||
మాటలాడినను మరియజాండములు
కోటులు వోడమేటిగుణరాశి |
నీటగునూర్పుల నిఖిలవేదములు
చాటువనూ రేటిసముద్ర మితడు ||
ముంగిట జొలసిన మోహన మాత్మల
బొంగించేఘనపురుషుడు |
సంగతి మావంటిశరణాగతులకు
నంగము శ్రీవేంకటాధిపు డితడు ||
1, ఏప్రిల్ 2013, సోమవారం
ఈ సంవత్సరం నా పరీక్షలు అయ్యాయి
హమ్మయ్య నా పరీక్షల హడావుడి అయిపాయిందోచ్చ్ :
అంతే కదండీ మరి . పిల్లల కు పరీక్షలు అంటే మనకే కదా పెద్ద పరీక్షలు .పిల్లలదేముంది అమ్మ అస్సలు మాట్లాడనివ్వడం లేదు, TV చూడనివ్వడం లేదు, ఆడుకోనివ్వడం లేదు. అంటూ వాళ్ళ నాన్నగారికి రాగానే నా మీద complaints . ఆయన అయ్యో పోనిలేవోయ్ కాసేపు refresh అవ్వనీ అని వాళ్ళకి వంత పలకడం . అమ్మో ఈ పదిహేను రోజులు మా ఇంట్లో ఒకటే యుద్ధం అంటే నమ్మండి. నాకు భయం పిల్లలు కొంచెం time ఇస్తే ఇంకాస్త వాళ్ళే తీసేసుకుంటారు . మళ్ళీ పుస్తకాల దగ్గర కూర్చోపెట్టడానికి తాతలు దిగి రావలసిందే మరి . నా భయం నాది.
పరీక్షలంటే పిల్లల కన్నా పెద్దవాళ్ళకే ఎక్కువ భయం . పిల్లలు సరిగా చదువుతున్నారా లేదా , ఈ చదువులో పడి తిండి సరిగా తినటంలేదు ,ఇంతకీ చదివినది జాగ్రత్తగా పేపర్ పైన పెడతారా లేదా, నిద్ర సరిపోకపోతే వేడి చేస్తుందేమో , వీటన్నింటి తో పెద్దవాళ్ళకు చెమటలు పట్టేస్తాయి. ముఖ్యంగా అమ్మలకు . అమ్మలకు అటు పిల్లల చదువు కావాలి ఆరోగ్యం కావాలి.
నేను భయపడ్డాను కానీ మీరెవరూ భయపడకండి . ఈ రోజులలో పిల్లలే మనకన్నా confident గా వుంటున్నారు. అందులోనూ ఇప్పుడు పిల్లలే పెద్దవాళ్ళకి పాఠాలు చెప్పగలిగే తెలివితేటలతో వుంటున్నారు . కాబట్టి మీరు కంగారుపడి వాళ్ళని కంగారు పెట్టకండి .
మొత్తానికి ఎలాగయితేనేం ఈ సంవత్సరం నా పరీక్షలు అయ్యాయి .

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)